
వెస్టిండీస్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు వెటరన్ వికెట్ ముష్ఫికర్ రహీమ్ వ్యక్తిగత కారణాలతో వెస్టిండీస్ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం,నయీమ్ ఇస్లాం వంటి కీలక ఆటగాళ్లు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. "ముష్ఫికర్ వెస్టిండీస్ టూర్‌కు అందుబాటులో ఉండడు. ఎందుకంటే అతడు తన కుటంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లనున్నాడు "అని బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ పేర్కొన్నాడు.
ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. జూన్ 16న ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం శ్రీలంకతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇరు జట్లు మధ్య తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 5,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రహీమ్ నిలిచాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్-2022లో టాప్ రన్ స్కోరర్స్ వీళ్లే..
Comments
Please login to add a commentAdd a comment