డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారిన హీరోయిన్‌ | Actress Rakshitha Turned As Dubbing Artist | Sakshi

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారిన హీరోయిన్‌

May 21 2018 8:58 AM | Updated on Apr 3 2019 9:14 PM

Actress Rakshitha Turned As Dubbing Artist - Sakshi

రక్షిత

ఇడియట్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ రక్షిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. భర్త ప్రేమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విలన్‌’’ సినిమాలో నటి అమీ జాక్సన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారామె. పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా 2002లో వచ్చిన ‘‘అప్పు’’ సినిమాతో రక్షిత తెరంగేట్రం చేశారు. 2002లో వచ్చిన ‘‘ఇడియట్‌’’ తెలుగులో ఆమె మొదటి సినిమా. తెలుగులో అగ్రతారలైన చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబులతో పలు సినిమాలలో కలిసి నటించిందామె.

2007లో కన్నడ సినిమా దర్శకుడు ప్రేమ్‌తో వివాహం అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే కొన్ని టీవీ షోలతో బిజీగా ఉన్న ఆమె మరోసారి భర్త సినిమా కోసం తన గొంతును సవరించుకున్నారు. రక్షిత మాట్లాడుతూ.. కేవలం తన పాత్రలకు మాత్రమే డబ్బింగ్‌ చెప్పుకున్న ఆమె ఇలా ఇతరుల పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం కొత్తగా ఉందన్నారు. ఇలా ఇతరులక డబ్బింగ్‌ చెప్పడం ఇష్టంగా, చాలా సంతోషంగా ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement