గెలుపుబాటలో పాక్ | Pakistan has South Africa on the ropes in first Test | Sakshi
Sakshi News home page

గెలుపుబాటలో పాక్

Published Thu, Oct 17 2013 1:13 AM | Last Updated on Wed, Jul 25 2018 2:19 PM

Pakistan has South Africa on the ropes in first Test

అబుదాబి: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు గెలుపు బాటలో పయనిస్తోంది. సఫారీ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేశారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లకు 72 పరుగులు చేసింది. డివిలియర్స్ (11), స్టెయిన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లు ఇర్ఫాన్, జునైద్, అజ్మల్, జుల్ఫీకర్ తలా ఓ వికెట్ తీశారు. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే సఫారీ జట్టు ఇంకా 121 పరుగులు చేయాలి.
 
  అంతకుముందు 263/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 138.4 ఓవర్లలో 442 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మన్‌జూర్ (266 బంతుల్లో 146, 15 ఫోర్లు) కాసేపటికే నిష్ర్కమించగా,  కెప్టెన్ మిస్బావుల్ హక్ (187 బంతుల్లో 100, 8 ఫోర్లు) సెంచరీ సాధించాడు. 39 ఏళ్ల మిస్బా పాకిస్థాన్ తరఫున సెంచరీ చేసిన పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement