ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ బుధవారం డ్రాగా ముగిసింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది.
న్యూఢిల్లీ: ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ బుధవారం డ్రాగా ముగిసింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. అంతకు ముందు 218/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 52 పరుగుల ఆధిక్యం లభించింది. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, విజయ్ కుమార్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
హైదరాబాద్ మ్యాచ్ కూడా...
వాయనాడ్: మరో వైపు ఇదే గ్రూప్‌లో కేరళతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా చేసుకుంది. 4/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 249 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (110), అక్షత్ రెడ్డి (104 నాటౌట్) సెంచరీలు సాధించారు. గ్రూప్ ‘సి’లో మూడు రౌండ్ల అనంతరం ఆంధ్ర 8 పాయింట్లతో, హైదరాబాద్ 7 పాయింట్లతో ఉన్నాయి.