
నా రెండో ఇన్నింగ్స్ మొదలైంది!
క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ వ్యాఖ్య
కాన్పూర్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తన రెండో ఇన్నింగ్స్ ఆరంభమైందని చెప్పాడు. విజయవంతమైన రాజకీయవేత్తగా తాను ఎదుగుతానని అతను అన్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కైఫ్, ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నాడు. ‘ఇక్కడి అలహాబాద్‌లోనే నేను పుట్టి పెరిగాను. గల్లీల్లో క్రికెట్ ఆడాను.
నేను భారత్‌కు ఆడినప్పుడు ఇక్కడివారంతా ఎంతో సంతోషించారు. ఎన్నికల్లోనూ వారు నాకు మద్దతుగా నిలుస్తారని నమ్ముతున్నాను’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్‌లో తాను మంచి ఫామ్‌లో ఉన్నానని, క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే విషయంపై ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. రాజకీయాలు చెడ్డవి కావని అభిప్రాయపడిన కైఫ్ 13 టెస్టుల్లో, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 33 ఏళ్ల కైఫ్ ఆఖరిసారిగా 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.