ఐపీఎల్-2025 సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను తిరిగి తీసుకురావడంతో.. ధోని రిటెన్షన్‌కు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది సీజన్‌లో ధోని అన్‌క్యాప్డ్ కోటాలో సీఎస్‌కే తరపున బరిలోకి దిగనున్నాడు.
అతడిని రూ. 4 కోట్ల కనీస ధరకు సీఎస్‌కే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిలో ఆడాలనే కోరిక ఉన్నంతవరకు ఐపీఎల్ నియమాలు మారుతూనే ఉంటాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
"వచ్చే ఏడాది సీజన్‌లో కూడా ధోని ఆటను మనం చూడబోతున్నాం. అతడు ఫిట్‌గా ఉన్నాడు. అంతేకాకుండా తన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల వెనక కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఎంఎస్ ఆడాలనుకున్నంత కాలం, నియమాలు మారుతూనే ఉంటాయి.
ధోని కోసం రూల్స్ మార్చిన తప్పులేదు. అతడొక లెజెండ్, సీఎస్‌కేకు మ్యాచ్ విన్నర్. అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను ధోని కోసమే తిరిగి తీసుకు వచ్చారని నేను భావిస్తున్నాను. ధోనికి మనీతో పనిలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడే చాలా సార్లు చెప్పాడు.
టీమ్ మేనేజ్‌మెంట్ ఏం కోరుకుంటే అది చేస్తానని తలా గతంలో స్పష్టం చేశాడు. రూ. 4 కోట్లు అనేది అతడికి చిన్నమొత్తం అయినప్పటకి, సీఎస్‌కే రిటైన్ చేసుకునేందుకు సిద్దంగా ఉంది. సీఎస్‌కేతో అతడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.
అసలేంటి ఈ అన్‌క్యాప్డ్ పాలసీ?
ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్‌క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు. కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్‌లో తొలగించారు.
ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఈ రూల్ ద్వారా రిటైన్ అవ్వడానికి ధోనితో పాటు మోహిత్ శర్మ(గుజరాత్ టైటాన్స్), సందీప్ శర్మ(రాజస్తాన్), పియూష్ చావ్లా(ముంబై ఇండియన్స్) మాత్రమే అర్హులు. వీరిందరూ గత ఐదేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.
చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?
Comments
Please login to add a commentAdd a comment