టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ల వైఫల్యం వల్లే భారత్‌కు స్వదేశంలో ఘోర పరాభవం ఎదురైందని అభిమానులు సైతం మండిపడుతున్నారు. కనీసం ఆస్ట్రేలియా సిరీస్‌లోనైనా సత్తా చాటి జట్టును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు.. భారత మాజీ క్రికెటర్లు మాత్రం.. రోహిత్- కోహ్లి ఇప్పటికైనా దేశవాళీ క్రికెట్ ప్రాముఖ్యతను గుర్తించి.. రంజీ బరిలో దిగాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
విలాసవంతమైన జీవితాన్ని కాస్త పక్కనపెట్టి
ఆస్ట్రేలియా పర్యటనలో రిషభ్ పంత్ కీలకం కానున్నాడన్న కైఫ్.. సీనియర్లు తమ విలాసవంతమైన జీవితాన్ని కాస్త పక్కనపెట్టి చెమటోడ్చాలని సూచించాడు. పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో తిరగడం కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని పేర్కొన్నాడు.
ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చారంటే రోహిత్, కోహ్లిలాంటి వాళ్లకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని కైఫ్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘పరుగులు రాబట్టేందుకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో.. ఎవరికైతే సరైనంత ప్రాక్టీస్ టైమ్ దొరకడం లేదో.. వారు వందకు వంద శాతం దేశవాళీ క్రికెట్ ఆడాలి.
అక్కడ వీఐపీ ట్రీట్‌మెంట్ దొరకకపోవచ్చు
మేము పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో ప్రయాణిస్తామనే విషయాన్ని మర్చిపోవాలి. మీకు అక్కడ వీఐపీ ట్రీట్‌మెంట్ దొరకకపోవచ్చు.. కానీ ఫామ్‌లోకి రావాలంటే ఇదొక్కటే మార్గం’’ అని కైఫ్ కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. అదే విధంగా.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో రిషభ్ పంత్ మరోసారి కీలకంగా మారనున్నాడని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
కివీస్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలం
కాగా న్యూజిలాండ్‌తో తాజాగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్, కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఆరు ఇన్నింగ్స్‌లో రోహిత్ వరుసగా 2, 52, 0, 8, 18, 11 పరుగులు మాత్రమే చేయగా.. కోహ్లి 0, 70, 1, 17, 4, 1 రన్స్ రాబట్టాడు.
ఇద్దరూ కలిసి కేవలం 184 పరుగులు మాత్రమే చేశారు. ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. కాగా దేశవాళీ క్రికెట్‌లో రోహిత్ ముంబై, కోహ్లి ఢిల్లీకి ఆడిన విషయం తెలిసిందే.
చదవండి: BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment