న్యూజిలాండ్‌ 195/7 | Watling half-century revives New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ 195/7

Published Sat, Aug 17 2019 5:32 AM | Last Updated on Sat, Aug 17 2019 5:32 AM

Watling half-century revives New Zealand - Sakshi

గాలే:  శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌కు తలవంచారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ లసిత్‌ ఎంబుల్‌డెనియా (4/71) చెలరేగడంతో మ్యాచ్‌ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి కివీస్‌ 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌ (63 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీ చేయగా, లాథమ్‌ (45) రాణించాడు. ధనంజయకు 2 వికెట్లు దక్కాయి. సౌతీ (23)తో కలిసి వాట్లింగ్‌ ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లున్న న్యూజిలాండ్‌ 177 పరుగుల ఆధిక్యంలో ఉంది.  అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 227/7తో ఆట కొనసాగించిన శ్రీలంక మరో 40 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం లభించింది. డిక్‌వెలా (61) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, లక్మల్‌ (40) రాణించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement