13 ఏళ్ల తర్వాత..!
13 ఏళ్ల తర్వాత..!
Published Thu, Nov 28 2013 12:38 AM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM
1990ల్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన హీరోల్లో అరవింద్‌స్వామి ఒకరు. ఆరడగులుంటారో లేదో తెలియదు కానీ.. ఈ అందగాడితో ఏడడుగులు వెయ్యాలని చాలామంది అమ్మాయిలు కలలు కన్నారు. అప్పట్లో ఆయన పాపులార్టీ అలా ఉండేది మరి. ఈ హ్యాండ్‌సమ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా, బోల్డంత క్రేజ్ సంపాదించుకున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని, వ్యాపారంలో నిమగ్నమయ్యారు అరవింద్‌స్వామి.
‘కడలి’ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించారారు. ఇప్పుడాయన ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నారు. మరాఠీ చిత్రం ‘కక్‌స్పర్ష్’ చిత్రానికి రీమేక్ ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ మంజ్రేకరే ఈ హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా ఉత్తరాది తెరపై కనిపించబోతున్నానని అరవింద్‌స్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించబోతున్నారట. 2015లో ఈ చిత్రాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement