Arvind Swamy
-
కార్తీ 'సత్యం సుందరం' HD మూవీ స్టిల్స్
-
రామ్ చరణ్ విలన్.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడా?
సినీ తారలకు సినిమా ఒక్కటే ప్రపంచం కాదు. ఎంత స్టార్డమ్ వచ్చినా వారు కేవలం ఆ రంగానికే పరిమితం కారు. తమ టాలెంట్‌ను పలు రకాలుగా చూపిస్తారు. కేవలం సినిమాల్లోనే చేస్తూ ఖాళీగా ఉండరు. కాస్తా సమయంలో దొరికితే చాలు ఏదో ఒక బిజినెస్ చేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో కనిపిస్తారు నటుడు అరవింద స్వామి. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా ధైర్యంగా నిలిచిన అతి కొద్దిమందిలో ఒకరాయన. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. ఎందుకంటే రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో ప్రతి నాయకుడిగా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. 20 ఏళ్లకే సినీ కెరీర్ ప్రారంభం 1991లో 20 ఏళ్లకే మణిరత్నం సినిమా తలపతిలో ఎంట్రీ ఇచ్చిన అరవింద స్వామి.. బొంబాయి, రోజా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాతే స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. అనంతరం బాలీవుడ్ భామ కాజోల్‌తో నటించిన చిత్రం మిన్సార కనవు చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత ఏడాదిలోనే సాత్ రంగ్ కే సప్నే చిత్రంలో జూహీ చావ్లా సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికీ కూడా అతన్ని కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్‌ల లాంటి స్టార్స్‌కు వారసుడిగా భావిస్తారు. అయితే 1990ల్లోనే బొంబాయి, రోజా సినిమాలతో సూపర్ స్టార్‌గా ఎదిగిన అరవింద్ స్వామి ఓ వ్యాపారవేత్త అని చాలామందికి తెలియదు. ప్రస్తుతం అరవింద్ స్వామి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం గురించి వివరాలేంటో తెలుసుకుందాం. 30 ఏళ్లకే నటనకు గుడ్‌బై- పక్షవాతంతో పోరాటం అయితే 90వ దశకం చివరి నాటికి అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. దీంతో తన సినిమా కెరీర్ పట్ల నిరాశతో ఉన్న స్వామి.. 2000 తర్వాత సినిమాల్లో నటించడం మానేశాడు. ఆ తర్వాత తన తండ్రి వ్యాపార వ్యవహరాలను చూసుకున్నారు. వీడీ స్వామి అండ్ కంపెనీలో పని చేస్తూనే.. ఆపై ఇంటర్‌ప్రో గ్లోబల్‌లో పని చేయడంపై దృష్టి సారించారు. అయితే 2005లో అతని కాలు పాక్షికంగా పక్షవాతానికి దారితీసింది. వ్యాపార సామ్రాజ్యం అయినప్పటికీ 2005లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించారు. పక్షవాతం నుంచి కోలుకున్నాక పే రోల్ ప్రాసెసింగ్, తాత్కాలిక సిబ్బందిని నియమించే టాలెంట్ మాక్సిమస్ అనే సంస్థను స్థాపించారు. రాకెట్ రీచ్ వంటి మార్కెట్ ట్రాకింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. 2022లో టాలెంట్ మాగ్జిమస్ ఆదాయం దాదాపు 418 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ. 3300 కోట్లు)గా ఉంది. ప్రస్తుతం అరవింద్ స్వామి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ అయితే మళ్లీ 2013లో తన గురువు మణిరత్న ప్రాజెక్ట్ కాదల్‌తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వామి తెలుగులో రామ్ చరణ్ మూవీ ధృవలో విలన్‌గా మెప్పించారు. 2021లో అతను తమిళ-హిందీ ద్విభాషా చిత్రం తలైవిలో కంగనా రనౌత్ సరసన ఏంజీ రామ్‌చంద్రన్ పాత్రలో నటించారు. -
మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!
అరవింద స్వామి పేరు వినగానే గుర్తొచ్చేది దళపతి, బాంబే, రోజా చిత్రాలే. మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో నటించిన దళపతి చిత్రంలో యువ కథానాయకుడిగా పరిచయమైన నటుడు అరవిందస్వామి. కొన్ని చిత్రాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లోనూ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్‌గా మెప్పించారు. (ఇది చదవండి: Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!) అయితే ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ అయ్యి తనీ ఒరువన్ వంటి పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు గానూ నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నా ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిసింది. ఈయన ఇప్పటికే కథ కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆల్ ఇండియా స్టార్ ఫాహద్ ఫాజిల్‌ను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో అరవిందస్వామి కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ చిత్రంలో విలన్‌గా తన విశ్వరూపం చూపించిన నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాగా అరవిందస్వామి దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!) -
ఆ హీరో నా కన్నకొడుకు, కానీ మా మధ్య ఏ బంధమూ లేదు: నటుడి షాకింగ్ కామెంట్స్
అరవింద్ స్వామి.. ఈయన పేరు చెప్పగానే రోజా, బాంబే, ధృవ సినిమాలు గుర్తొస్తాయి. మొదటి రెండు సినిమాల్లో హీరోగా చేసిన ఈయన తర్వాతి కాలంలో విలన్‌గా మారాడు. సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లోనూ పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన తండ్రి ఎవరంటే చాలామంది వెంకటరామ దొరై స్వామి పేరు చెప్తారు. కానీ అరవింద్ స్వామి అసలు తండ్రి సింగం నటుడు డిల్లీ కుమార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. అరవింద్ నా కన్న కొడుకు అరవింద్ తన కన్నకొడుకు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అరవింద్ స్వామి నా కొడుకు. కానీ మా మధ్య తండ్రీకొడుకుల బంధమనేదే లేదు. అతడు పుట్టగానే నా చెల్లెలికి దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి అరవింద్ ఆ కుటుంబంలోని వ్యక్తిగానే పెరిగాడు. ఏదైనా ప్రధానమైన ఫంక్షన్స్ ఉంటే మాత్రమే నా ఇంటికి వచ్చేవాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాడు. మేమిద్దరం తండ్రీకొడుకుల అనుబంధాన్ని పెంచుకోలేదు అని చెప్పుకొచ్చాడు. కెరీర్ తొలినాళ్లలోనే నిజం చెప్పేసిన హీరో కాగా అరవింద్ స్వామి దళపతి సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తమిళంలో మెట్టియోలి అనే సీరియల్ ప్రసారమైంది. ఇందులో డిల్లీ కుమార్ నటించాడు. ఆ సమయంలో అరవింద్ స్వామి తన తండ్రి డిల్లీ కుమార్ అని ప్రకటించాడు. తర్వాత ఎక్కడా తన తండ్రి గురించి ప్రస్తావించలేదు. అంతేకాదు, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు. ఇన్నాళ్లకు పెదవి విప్పిన నటుడు వీరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోకపోవడమే కాకుండా ఎక్కడా కలిసి నటించకపోవడం గమనార్హం. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అరవింద్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు డిల్లీ కుమార్. కథ కుదిరితే అరవింద్‌తో నటించేందుకు కూడా సిద్ధమేనంటున్నాడు. ఇకపోతే అరవింద్‌ను వి.డి.స్వామి-వసంత దంపతులు దత్తత తీసుకుని పెంచుకున్నారు. చదవండి: ఓటీటీలో భోళా శంకర్.. ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్.. -
పక్షవాతానికి గురైన హీరో కాలు.. ఆటుపోట్లు అధిగమించి బిజినెస్‌మెన్‌గా!
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు ఉన్నప్పుడే, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. కానీ ఒకప్పటి హీరో, ఇప్పటి విలన్ అరవింద్ స్వామి మాత్రం స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో అర్ధాంతరంగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. రోజా, బాంబే సినిమాలతో ప్రేక్షకుల మనసులో తనదైన స్థానం సంపాదించుకున్న ఇతడు బాలీవుడ్‌లోనూ లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. బాలీవుడ్‌తో బేజారు కానీ హిందీలో రెండు సినిమాలు రిలీజ్ కాగా మరో రెండు ఏళ్ల తరబడి ప్రొడక్షన్ హౌస్‌లోనే మగ్గిపోయాయి. వరుసగా అపజయాలు సైతం రావడంతో ఫెయిల్యూర్ హీరోగానూ ముద్రపడింది. ఈ పరిణామాలతో విసుగెత్తిన అరవింద్ స్వామి 2000వ సంవత్సరంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అప్పుడు తన తండ్రి వ్యాపారాలను చూసుకున్నాడు. వీడీ స్వామి అండ్ కంపెనీలో పని చేశాక ఇంటర్‌ప్రో గ్లోబల్‌కు షిఫ్ట్ అయ్యాడు. బిజినెస్‌మెన్‌గా ఎదుగుతున్న సమయంలో 2005లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు స్వల్ప పక్షవాతానికి గురైంది. 4-5 ఏళ్లపాటు సుదీర్ఘ చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. బిజినెస్‌మెన్‌గానూ సత్తా చాటాడు అయితే అప్పటికే వ్యాపారంలో రాణిస్తున్న అరవింద్ స్వామి ఈ ప్రమాదం జరగడానికి ముందు టాలెంట్ మాక్సిమస్ అనే సంస్థను స్థాపించాడు. ఇది మార్కెట్లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసే ఏజెన్సీలా వ్యవహరిస్తుంది. గతేడాది ఈ సంస్థ ఆదాయం రూ.3,300 కోట్లుగా ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీని అరవింద్ స్వామియే చూసుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత మరో ఆరేడేళ్లు వెండితెరపై కనిపించని అరవింద్ స్వామి తన రీఎంట్రీ మాత్రం రీసౌండ్ ఇచ్చేలా చూసుకున్నాడు. ధృవతో విలన్‌గా రచ్చ లేపాడు 2013లో మణిరత్నం కాదల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. ఆ తర్వాత తను ఒరువన్ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇదే సినిమా తెలుగులో ధృవ పేరుతో రీమేక్ కాగా ఇక్కడ కూడా అతడే విలన్‌గా నటించి మెప్పించాడు. ఆయన విలనిజం మెచ్చి తెలుగులో బోలెడు ఆఫర్లు వచ్చాయి. కానీ కుదరకపోవడంతో వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన కస్టడీలోనూ మెప్పించాడు అరవింద్ స్వామి. అనుకున్నది సాధించాడు ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు. స్క్రీన్‌పై మన పర్ఫామెన్స్ ఎలా ఉందన్నదే ముఖ్యం అనే మాటను నమ్ముతాడు అరవింద్ స్వామి. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే దర్శకుడు అవ్వాలనుకున్న కలను 2021లో నిజం చేసుకున్నాడు. నవరస ఆంథాలజీలో రౌద్రం భాగానికి దర్శకత్వం వహించాడు. కార్టూన్ సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. చదవండి: ఓ పక్క పెళ్లి.. మరోపక్క విడాకులు.. మెగా ఫ్యామిలీలో అనూహ్య పరిణామాలు అటు మాజీ భార్య.. ఇటు ప్రేయసి.. ఇరువురి భామల మధ్య అమీర్ ఖాన్ -
Arvind Swamy Latest Photos: హీరో అరవింద్ స్వామి అరుదైన ఫొటోలు చూశారా
-
హీరోగా అరవింద్ స్వామి ‘రెండగం’, రిలీజ్ డేట్ ఖరారు
నటుడు అరవిందస్వామి కథానాయకుడిగా నటించిన రెండగం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు ఫెలివి తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు కుంజాకో బోబన్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తమిళం మలయాళం భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఈషా రెబ్బా నాయికగా నటించగా జాకీ ష్రాప్, అనీష్ గోపాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీన్ని నటుడు ఆర్య షాజినటేషన్ కలిసి నిర్మించడం విశేషం. గౌతమ్ శంకర్ చాయాగ్రహణ, అరుళ్ రాజ్ కెనడి సంగీతాన్ని అందించారు. యాక్షన్ కిల్లర్ జానర్లో రూపొందించిన కథా చిత్రం అని డైరెక్టర్ చెప్పారు. చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే 14 లక్షల మంది ట్రైలర్ వీక్షించారని చెప్పారు. దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయని.. వాటిని రెండగం చిత్రం కచ్చితంగా అధిగమిస్తుందనే నమ్మకం తమకు ఉందని దర్శకుడు అన్నారు. -
Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ
టైటిల్ : తలైవి జానర్: బయోపిక్ నటీనటులు : కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు నిర్మాణ సంస్థలు: విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : విష్ణు వర్ధన్ ఇందూరి కథ: విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. వరుసగా నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో రివ్యూలో చూద్దాం. ‘తలైవి’కథేంటంటే: దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ‘తలైవి’. ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ.. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తను ఎంతో అభిమానించే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తెలియాలంటే ‘తలైవి’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. జయలలిత పాత్రలో కంగన ఒదిగిపోయారు. తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప.. కంగాన రనౌత్ ఏ మూలాన కనిపించదు. ఆమెను జాతియ ఉత్తమ నటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతంది. ఎంజీఆర్‌తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది. ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్ స్వామిది. ఎంజీఆర్ పాత్రలో ఆయన జీవించేశాడు. స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగాను ప్రత్యేక హావభావాలను పలికించాడు. ఎంజీఆర్ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఓ సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్ పాత్రను హైలైట్ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. జయ-ఎంజీఆర్ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు. రాజకీయాలే వద్దనుకున్న జయ.. పాలిటిక్స్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే జయలలితను తమిళ ప్రజలు ‘అమ్మ’అని ఎందుకు ముద్దుగా పిలుసుకుంటారో తెలియజేసే సీన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక రాజకీయాల్లో వచ్చి తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు చూపించారు. సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయడం, ఆమెను రాజ్య సభకి పంపడం లాంటి సీన్స్ కూడా హత్తుకునేలా తీర్చి దిద్దారు. ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం అదిరిపోయింది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కంగనా ఓ గొప్ప నాయకురాలవుతుంది
‘‘తెలుగు, తమిళంలో నట వారసత్వం ఉన్నప్పటికీ గ్రూపిజమ్, గ్యాంగిజమ్ ఉండవు. అన్ని భాషలవారినీ ఆదరిస్తారు. దక్షిణాదిలో నాకు లభించిన ప్రోత్సాహం, అభిమానం చూస్తే ఇక్కడే మరికొన్ని చిత్రాల్లో నటించాలనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్‌గారు సిఫారసు చేయకపోయి ఉంటే ‘తలైవి’ అవకాశం నాకు వచ్చేది కాదు. నేనీ పాత్రకు సరిపోతానని నమ్మి విజయ్ నన్ను ఒప్పించారు’’ అని కంగనా రనౌత్ అన్నారు. దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రను కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మంగళవారం కంగనా పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ని చెన్నైలో విడుదల చేశారు. ‘‘తలైవి అంటే లీడర్.. నిజ జీవితంలోనూ కంగనా ఓ గొప్ప నాయకురాలవుతుంది’’ అన్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘‘పురుషాధిపత్యంలోంచి ఓ మహిళ ఎలా నిలబడింది? ఎలా విజయం సాధించింది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు ఏఎల్ విజయ్. ‘‘తలైవి’ టీజర్ విడుదలయ్యాక అందరూ నా ఎంజీఆర్ లుక్‌పై ప్రశంసలు కురిపించారు.. ఎంతో కష్టపడ్డావ్ అన్నారు. కానీ నేనీ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను’’ అన్నారు అరవింద్ స్వామి. విష్ణు వర్ధన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా ప్రసాద్ మాట్లాడారు. చదవండి: బర్త్ డే నాడే కన్నీళ్లు పెట్టుకున్న కంగనా -
ఆచార్య వర్సస్ అరవింద్ స్వామి?
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నిర్మించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా ఎవరు నటిస్తారు? అనేది ఇప్పటివ రకూ తెలియలేదు. తాజాగా ‘ఆచార్య’ను ఢీ కొనేది అరవింద్ స్వామి అని తెలిసింది. మెయిన్ విలన్ పాత్రలో ఆయన నటించనున్నారని సమాచారం. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. ఈ సినిమాలో చిరంజీవి ఉద్యమకారుడిగా, రామ్‌చరణ్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారట. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సింధూర..
‘జయం’ రవి, అరవింద్ స్వామి హీరోలుగా, హన్సిక హీరోయిన్గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్’. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘సింధూర..’ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడం మా టీమ్‌కి సంతోషంగా అనిపించింది. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ట్యూన్ చేసిన ‘సింధూర..’ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. భువనచంద్రగారు ఈ పాటకు లిరిక్స్ అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ప్రభాస్ చిత్రంలో స్టైలిష్ విలన్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. ఇక ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ.400 కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కీలకపాత్రలు పోషించే నటీనటులను జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమాలో విలనిజాన్ని చాలా కొత్తగా చూపించాలని దర్శకుడు భావిస్తున్నారట. ప్రభాస్‌తో పోటీగా సాగే విలన్ పాత్ర కోసం ఒకప్పటి హీరో.. రీఎంట్రీ విలన్ అరవింద్ స్వామి అయితే బాగుంటుందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనతో దర్శకుడు సంప్రదింపులు జరిపినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. అయితే చర్చలు తుదిదశలో ఉన్నాయని త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ చిత్రంలో అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చదవండి: విష్ణు టిక్‌టాక్ వీడియో.. అద్భుతః ‘అది వాషింగ్ మెషీన్ కాదు యష్’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_831249961.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘భాస్కర్ ఒక రాస్కల్’ మూవీ స్టిల్స్
-
ప్రేమ సంబరాలు
నయనతార – విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని అధికారికంగా బయటపెట్టకపోయినా వాళ్ల ప్రేమను మాత్రం వీలున్నప్పుడల్లా బయటపెడుతూనో, బయటపడుతూనో ఉంటారు. హాలీడేయింగ్, ఒకరి పుట్టినరోజు ఒకరు జరపడం. ఒకరికి హిట్ వస్తే ఇంకొకరు సెలబ్రేట్ చేసుకోవడంలాగా అన్నమాట. బుధవారం విఘ్నేష్ బర్త్‌డే. బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే పార్టీను ఫ్రెండ్స్‌తో కలిసి ఘనంగా చేశారు నయనతార. ఈ ఫంక్షన్‌కు డ్రెస్ కోడ్ బ్లాక్ అండ్ బ్లాక్. దర్శకుడు అట్లీ, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటుడు అరవింద్ స్వామి, హీరో విజయ్ సేతుపతి మరికొందరు ఈ పార్టీకు హాజరయ్యారు. ఇటీవలే విఘ్నేష్ నిర్మాణంలో నయనతార హీరోయిన్గా ఓ సినిమా ప్రారంభం అయింది. -
తప్పయితే సరిదిద్దుకుంటా!
సాక్షి, చెన్నై : తప్పయితే సరిదిద్దుకుంటానంటోంది నటి అమలాపాల్. సింధు సమవెళి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ ఈ అమ్మడన్న విషయం తెలిసిందే. మైనా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా విజయ్‌తో జత కట్టిన తలైవా చిత్రం ఆమెను దర్శకుడు విజయ్‌కు దగ్గర చేసింది. ఆయనతో ప్రేమ పెళ్లికి దారి తీసింది. చాలా తక్కువ కాలంలోనే పెళ్లి చేసుకున్న నటిగా పేరు తెచ్చుకున్నా ఆ వివాహ జీవితం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. భేదాభిప్రాయాలతో ఈ సినీ జంట విడిపోయారు. దర్శకుడు విజయ్ నుంచి అమలాపాల్ విడాకులు పొంది మళ్లీ నటనపై దృష్టి సారించింది. అయినా హీరోయిన్గా కొనసాగడం ఈమె అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అరవిందస్వామితో నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం పలు ఒడుదుడుకులను ఎదురొడ్డి ఎట్టకేలకు శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా అమలాపాల్ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీ చూద్దాం. భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి? భాస్కర్ ఒరు రాస్కెల్ చాలా సరదాగా సాగే కుటుంబ కథా చిత్రం. వేర్వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరిని కలపడానికి పిల్లల ప్రయత్నం ప్రధానంగా చిత్రం సాగుతుంది. అయితే చిత్రం ఎంటర్ టెయిన్ పాళు ఎక్కువగా ఉండే చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. ఇందుల్లో తాను 8 ఏళ్ల బిడ్డకు తల్లిగా నటించాను. తల్లి పాత్రలో నటించిన మీరు గ్లామరస్‌గా నటించారనే విమర్శల గురించి ఎలా స్పందిస్తారు? ఈ చిత్రంలో అమ్మ పాత్ర అయినా సాధారణ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రను గ్లామర్‌గా మలచాలనుకున్నాం. అరవిందస్వామి చిత్రంలో చాలా రఫ్‌గా కనిపిస్తారు. అందుకే నా పాత్ర మోడరన్‌గా ఉండాలని గ్లామరస్ దుస్తులు వాడాం. తాజాగా ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు? తదుపరి రాక్షన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అవళ్ ఒరు పరవై బోల చిత్రం చివరి దశలో ఉంది. మలయాళంలో ఆడుజీవితం అనే చిత్రంలో నటిస్తున్నాను. తాజాగా ఒక హిందీ చిత్రానికి ఓకే చెప్పాను. ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది మీ గురించి తరచూ గ్యాసిప్స్ వస్తుంటాయే? నిజం చెప్పాలంటే నేను అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. సాధారణంగా నీ గురించి రెండు రకాలుగా గ్యాసిప్స్ ప్రచారం అవుతుంటాయి. వాటిలో నేను తప్పు దారిలో పయనిస్తున్నానని, రెండోది సక్రమ మార్గంలోనే నడుస్తున్నానని. తాజాగా అమలాపాల్ మంచి దారిలోనే పయనిస్తోంది అంటున్నారు. అందుకే నా దారి మార్చుకోవలసిన అవసరం లేదు. అయితే తన మార్గం సరికాదని చెబితే నేను కచ్చితంగా నా తప్పును సరిదిద్దుకుంటాను. అంతే కానీ పని పాటా లేని వారు నాపై పుట్టించే గాసిప్స్ గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. -
ఎవరీ నరకాసురుడు..?
ధృవంగల్ 16 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ నరకాసురుడు. ధృవ సినిమాతో నెగెటివ్ రోల్లో ఆకట్టుకున్న అరవింద్ స్వామి, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అరవింద్ స్వామి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ్లో నరగసూరన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫాంటసీనా..? థ్రిల్లరా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా సీనియర్ స్టార్ శ్రియహీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రజిత్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. అయితే ముందుగా ఈ కథను టాలీవుడ్ హీరో నాగచైతన్యతో రూపొందించాలని ప్లాన్ చేశారు... కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో చైతు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌లో తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న సందీప్ కిషన్‌ను హీరోగా తీసుకున్నారు. -
మణిరత్నంను ఆకట్టుకున్న అతిథి
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో రిపీట్ అయిన కథానాయికలు చాలా తక్కువనే చెప్పాలి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాత్రమే ఇరువర్, గురు,రావణన్ చిత్రాల్లో నటించారు. తాజాగా మరో బాలీవుడ్ నటి అతిథిరావు దర్శకుడు మణిరత్నంను బాగా ఆకట్టకున్నారు. ఈ బ్యూటీని కార్తీకి జంటగా కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేశారు.ఆ చిత్రం విడుదలై ఇటు పరిశ్రమ వర్గాలలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ మిశ్రమ స్పందనను పొందినా, మణిరత్రం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు. ఈ సారి తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో తాను దళపతి చిత్రం ద్వారా పరిచయం చేసి, రోజా, బొంబాయి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా మార్చిన నటుడు అరవిందస్వామిని తాజా చిత్రంలో కథానాయకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. అదే విధంగా టాలీవుడ్ యువ స్టార్ నటుడు రామ్‌చరణ్‌ను మరో హీరోగా ఎంపిక చేసినట్లు టాక్ హల్చల్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అతిథిరావునే ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాట్రువెలియిడై చిత్రంలో ఈ అమ్మడి అభినయం అంతగా మణిరత్నంకు నచ్చేయడంతో తన తాజా చిత్రంలోనూ ఈ భామనే నాయకిగా ఎంచుకున్నారని టాక్. మొత్తం మీద కోలీవుడ్‌లో అతి«థిరావు మరో అవకాశం కొట్టేసిందన్నమాట. -
హ్యాండ్సమ్ స్టార్‌తో నిఖిల్ హీరోయిన్
ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ నందిత శ్వేత. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు సౌత్‌లో వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నందిత హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన శతురంగ వెట్టై సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పింది ఈ బ్యూటి. కోలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ అరవింద్ స్వామిగా హీరో తెరకెక్కుతున్న వనన్గమూడి సినిమాలో నందిత హీరోయిన్గా నటించనుంది. సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందిత పోలీస్ గెటప్‌లో దర్శనమివ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నందితతో పాటు రితికా సింగ్, చాందినీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రీమేక్ రాజా?
మాస్ మహారాజా రవితేజను రీమేక్ రాజా చేయాలని తమిళ దర్శకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు రవితేజ రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు. ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకముందు... ‘జిల్లా’, ‘కణిదన్’ తదితర తమిళ చిత్రాల రీమేక్స్‌లో రవితేజ నటిస్తారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. కానీ, అవేవీ పట్టాలు ఎక్కలేదు. తాజాగా లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయాలను కుంటున్నారని చెన్నై నుంచి కబురొచ్చింది. ‘‘తెలుగులోనూ లక్ష్మణే దర్శకత్వం వహిస్తారు. ‘జయం’ రవి పాత్రకు రవితేజను, అరవింద్ స్వామికి మరో ప్రముఖ నటుణ్ణి సంప్ర దించారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్సుంది’’ అని కోలీవుడ్ టాక్. మరి, రవితేజ ఈ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? రెడ్ సిగ్నల్ చూపిస్తారా? వెయిట్ అండ్ సీ. -
త్వరలోనే నేర్చుకుంటా!
నటి రితికాసింగ్‌కు కలిగిన ఆశ ఏమిటో తెలుసా? ఇరుదు చుట్రు చిత్రంతో ఏక్ ధమ్‌గా హిందీ, తెలుగు భాషల్లో కథానాయకిగా, అదీ తన చుట్టూ తిరిగే కథా పాత్రతో పరిచయమైన ఉత్తరాది లక్కీ నటి రితికాసింగ్. అంతే కాదు తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును పొందడంతో పాటు, అదే చిత్ర రీమేక్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి అవకాశం ఎంతమందికి దక్కుతుంది. రితికాసింగ్ నటించిన తెలుగు చిత్రం గురు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇక తమిళంలో రాఘవ లారెన్స్‌తో జత కట్టిన శివలింగ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో అరవిందస్వామి కి జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా రితికాసింగ్‌ను పలకరిస్తే బోలెడు కబుర్లు చెప్పుకొచ్చింది. అవేమిటో చూద్దాం. నా జీవితం బాక్సింగ్ మైదానంలోనే మగ్గిపోతుందని భావించాను. అలాంటిది భగవంతుడు శుభ (ఇరుదు చుట్రు చిత్ర దర్శకురాలు)అనే దేవతను పంపి నా జీవితాన్ని మార్చేశాడు. నాకు తమిళ భాష నేర్చుకోవాలనే ఆసక్తి బాగా పెరిగింది. అందుకు తమిళ చిత్రాలు అధికంగా చూస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో లంగా ఓణి ధరించిన అమ్మాయిలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను అలా జీవించలేకపోయినా కనీసం అలాంటి పాత్రల్లో లంగా ఓణి ధరించి నటించాలని ఆశపడుతున్నాను. అంతగా తమిళ సంస్కృతి, ఇక్కడి ప్రజలు నచ్చారు. ఇకపోతే తమిళ భాషను నేర్చుకుంటున్నాను. సాధ్యమైనంత వరకూ సహచరులతో తమిళంలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అలా తప్పుల తడకతో మాట్లాడడానికి కష్టపడుతున్నా త్వరలోనే తమిళ భాషను నేర్చుకుని పక్కాగా మాట్లాడతాననే నమ్మకం ఉంది. అదేవిధంగా తొలి చిత్రమే నన్ను జాతీయ అవార్డు స్థాయికి తీసుకెళ్లడంతో పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. -
మణి సినిమాలో ధృవ కాంబినేషన్
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఎప్పటి నుంచో కలలు కంటున్నట్టుగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్రేజీ కాంబినేషన్ అనిపించుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. మణిరత్నం వెండితెరకు పరిచయం చేసిన మిల్కీ బాయ్ అరవింద్ స్వామి.. రామ్ చరణ్, మణిల సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ధృవ సినిమాలో ఆకట్టుకున్న చెర్రీ, అరవింద్ స్వామిలు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. -
లాఠీ పట్టనున్న సిమ్రాన్..!
జస్ట్ టెన్ ఇయర్స్ వెనక్కి వెళితే... అప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన తారల్లో సిమ్రాన్ గుర్తుకు మానరు. అటు నార్త్, ఇటు సౌత్‌లో కలిపి ఇప్పటివరకూ ఆమె కథానాయికగా చేసిన చిత్రాలు 70పైనే ఉంటాయి. అతిథి పాత్రలతో కలుపుకుంటే దాదాపు 85 సినిమాలుంటాయి. ఈ 85 సినిమాల్లో 18 సినిమాల్లో సిమ్రాన్ గెస్ట్ రోల్స్ చేశారు. 2003లో దీపక్‌ని పెళ్లి చేసుకున్నాక స్లో అయ్యారామె. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నాయికగా చేసినా అవి అంతగా క్లిక్ కాలేదు. అందుకే మనసుకు నచ్చిన గెస్ట్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఆ విధంగా గడచిన నాలుగేళ్లల్లో తమిళంలో ఆమె నాలుగు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఐదో గెస్ట్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘రోజా’ ఫేం అరవింద్ స్వామి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సిమ్రాన్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. సిమ్రాన్ పోలీస్ పాత్ర చేయడం ఈ చిత్రానికి ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుందని చిత్రబృందం అంటోంది. ఇది పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర అట. మేజిక్ బాక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సెల్వా దర్శకత్వం వహించనున్నారు. రితిక హీరోయిన్గా ఎంపికైంది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఆ సంగతలా ఉంచితే.. ఎప్పటి నుంచో నిర్మాతగా మారాలని సిమ్రాన్ అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆ కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారట. -
సెల్వా చిత్రంలో సిమ్రాన్
టీనగర్ : సెల్వా దర్శకత్వంలో అరవింద్ స్వామి, రిత్తికా సింగ్ నటిస్తున్న చిత్రంలో నటి సిమ్రాన్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. మేజిక్ బాక్స్ బ్యానర్‌పై నిర్మాత గణేశ్ నిర్మిస్తున్న చిత్రం మేజిక్ బాక్స్ ప్రొడక్షన్ నంబర్–3. దీనికి సెల్వా దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్‌స్వామి హీరోగా, రిత్తికా సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం గతవారం పూజతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నటి సిమ్రాన్ పోలీసు కథా పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నందిత నటిస్తున్నారు. అంతేగాకుండా ఇతర పాత్రల్లో తంబిరామయ్య, చాందిని, హాసిని, హరీష్ ఉత్తమన్, రాజ్‌కపూర్, నాగినీడు, రమేష్ పండిట్, ఓఏకే సుందర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పేరున్న నటీనటులంతా నటిస్తుండడంతో చిత్ర వ్యాపారం ఇప్పటి నుంచే ఊపందుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ‘వనంగాముడి’గా పలువురు పేర్కొంటున్నారని, అయితే ఇది వాస్తవ విరుద్ధమని, త్వరలో ఈ చిత్రం టైటిల్‌ను చిత్ర యూనిట్ తరఫున విడుదల చేస్తామని నిర్మాత గణేశ్ తెలిపారు. ఈ చిత్రానికి గోకుల్ ఛాయాగ్రహణం చేపడుతుండగా, ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నారు -
నేను సినిమాల్లో నటించాలనుకోలేదు
‘‘దళపతి, రోజా సినిమాల్లో నటించేటప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అప్పట్లో నేను సినిమాల్లో నటించాలనుకోలేదు. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అయితే నటించడం మొదలు పెట్టాక వరుసగా సినిమాలు చేశా’’ అన్నారు అరవింద్ స్వామి. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి, మెప్పించిన అరవింద్ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను సినిమాలే లోకం అనుకోలేదు. మధ్యలో బ్రేక్ తీసుకుని బిజినెస్‌లు చేశా. ‘ధృవ’ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘తని ఒరువన్’లో నేను చేసిన పాత్రే ‘ధృవ’లో చేయడంతో పెద్ద కష్టం అనిపించలేదు. సిద్ధార్థ అభిమన్యు పాత్రలో తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. భవిష్యత్తులోనూ నెగటివ్ రోల్స్ చేస్తా. వచ్చే ఏడాది చివర్లో డైరెక్షన్ చేయాలను కుంటున్నా. కథలు రెడీ చేసుకున్నా. అయితే, నా చిత్రంలో నేను నటించను. దర్శకులు మణిరత్నం గారితో పని చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే. ‘తని ఒరువన్’ తర్వాత ‘జయం’ రవి, నేను నటించిన తమిళ చిత్రం∙‘బోగన్’ షూటింగ్ పూర్తయింది. ‘సదురంగ వేటై్ట’ సీక్వెల్, ‘వనంగా ముడి’, ‘భాస్కర్ ది రాస్కెల్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అని చెప్పారు. -
నా స్వార్థంతోనే ధృవ తీశా..
‘‘చాలా మంది హీరోలు సెట్స్‌కి వచ్చామా.. డైరెక్టర్ చెప్పినట్లు చేశామా.. వెళ్లిపోయామా.. అన్నట్టు ఉంటారు. కానీ, చరణ్‌లో నాకు నచ్చే విషయం ఏంటంటే... సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ కూలంకషంగా డిస్కస్ చేస్తాడు. అందువల్ల కంటెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. అవుట్‌పుట్ కూడా బాగుంటుంది. నిర్మాతకు ఏ విధమైన అభద్రతాభావం ఉండదు. మా ‘ధృవ’ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి అల్లు అరవింద్ పలు విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో హీరో పాత్రతో సమానంగా విలన్ (అరవింద్ స్వామి) పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకో హీరో అయితే నా పాత్ర పరిధి పెంచండి, నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండాలి అనేవారేమో. కానీ, చరణ్ మాత్రం ఎటువంటి డిస్కషన్స్ పెట్టలేదు. ‘తని ఒరువన్’ ఒరిజినల్లో పెద్ద మార్పులేమీ చేయొద్దన్నాడు. అందుకే సినిమాలో అరవింద్‌స్వామి పాత్రకూ అంత ఇంపార్టెన్స్ ఉంది. యాక్టింగ్, మేకోవర్ పట్ల చరణ్ ఎంతో శ్రద్ధ తీసుకుని సినిమా బాగా రావాలనే తపనతో వర్క్ చేశాడు. టీమ్ అందర్నీ కలుపుకుని వర్క్ చేయించాడు. దర్శకుడు సురేందర్ రెడ్డిని ఎంత బాగా ఎంకరేజ్ చేశాడో నాకు తెలుసు. ► ‘మగధీర’, ఇప్పుడు ‘ధృవ’.. చరణ్‌తో రెండు సినిమాలు నిర్మించా. తన కెరీర్ గ్రాఫ్ చూస్తే.. అందులో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు సినిమాలూ నావే ఉండాలనే స్వార్థంతో ‘ధృవ’ తీశా. ఈ సినిమా ప్లాన్ చేసినప్పుడు ‘మగధీర’ కంటే ఎక్కువ వసూలు చేయాలనీ, చరణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన మరో సినిమా కావాలనీ అనుకున్నా. సినిమా సూపర్‌హిట్. వసూళ్లు గురించి ఈ వారాంతం తర్వాత మాట్లాడితేనే బాగుంటుంది. శని, ఆదివారాల్లో వసూళ్లు బాగుంటాయి కదా. ► ‘ధృవ’కు కంటెంట్ ఈజ్ కింగ్. కథా బలం ఉండటంతో నోట్ల రద్దు కలెక్షన్స్‌పై ప్రభావం చూపదని నా బలమైన నమ్మకం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం కూడా కథా బలంతోనే బాగా ఆడింది. ‘ధృవ’ విడుదల తర్వాత అన్ని చోట్లా వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఓవర్సీస్లోనూ వసూళ్లు చాలా బాగున్నాయి. ‘ఏ’ సెంటర్లలో వసూళ్లపై నోట్ల రద్దు ప్రభావం అంత లేకపోయినా, ‘బి, సి’ సెంటర్లలో మాత్రం కచ్చితంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి మా సినిమా కలెక్షన్స్ చూస్తే 10 నుంచి 20 శాతం నోట్ల రద్దు ప్రభావం ఉందని అర్థమైంది. లేకపోతే, వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవనడంలో సందేహం లేదు. ► ‘ధృవ’ విడుదల గురించి నేను, చరణ్ చాలా డిస్కస్ చేసుకున్నాం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పుడు సినిమా విడుదల చేస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందేమో? అన్నాడు చరణ్. పోనీ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే అప్పుడు చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ వస్తుంది. ఆ తర్వాత అంటే సమ్మర్లోనే. అంత గ్యాప్ తీసుకోవడం ఇష్టం లేక డిసెంబర్లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం. ► ‘వసూళ్లపై ప్రభావం పడితే.. ఆ రిస్క్ ఏదో నేనే పడతాను’ అని చరణ్‌కి చెప్పా. ముందుగా డిసెంబర్ 2న రిలీజ్ అనుకున్నాం. అయితే, నెల మొదట్లో అంటే జనాలకు డబ్బుల ఇబ్బంది ఉంటుంది. 9న అయితే వారం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉండదని చరణ్ చెప్పడంతో.. నిజమే కదా అనిపించి 9న విడుదల చేశాం. అయితే ఒకటి మాత్రం చెప్పాలి.. చరణ్ మానిటరింగ్ లేకపోతే ఈ సినిమా తీసేవాణ్ణి కాదు. -
యస్...అంటున్నారా?
సౌతిండియాలో సోనాక్షి సిన్హా ఒక్కటంటే ఒక్క సినిమా ‘లింగ’లో నటించారు. అది కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జోడీగా నటించే అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ‘యస్’ అనేశారు. మరి, ఇప్పుడూ ‘యస్’ అంటున్నారా? లేదా? అనేది ఎదురు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడీ బాలీవుడ్ బ్యూటీని ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, అందగాడు అరవింద్ స్వామికి జోడీగా నటించమని అడిగారు. సిద్ధిఖీ దర్శకత్వంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన మలయాళ సినిమా ‘భాస్కర్ ద రాస్కెల్’ను తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులో అరవింద్ స్వామి హీరో. మొదట రజనీకాంత్‌ను ఈ రీమేక్‌లో నటించమని సంప్రదించారు. ఆయన ‘నో’ చెప్పేసరికి, అరవింద్ స్వామికి అవకాశం వచ్చింది. మాతృక తీసిన సిద్ధిఖీనే ఈ తమిళ రీమేక్‌కీ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో కూడా నయనతారను నటించమని అడగ్గా.. ఓసారి చేసిన పాత్రలో రెండోసారి నటించే ఉద్దేశం లేదని చెప్పారట! దాంతో సోనాక్షి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆమె కూడా కథ వినడానికి అంగీకరించారట. మరి, విన్నాక సోనాక్షి ఏమంటారో? వెయిట్ అండ్ సీ. -
అరవిందస్వామితో మిల్కీబ్యూటీ
చిన్న విరామం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు అరవిందస్వామి అటు విలన్‌గా, ఇటు హీరోగా యమ బిజీ అరుు పోయారు. మణిరత్నం కడలి చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేసిన ఈ నటుడు ఆ తరువాత తనీఒరువన్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో దుమ్మురేపారు. ఆ తెలుగు రీమేక్‌లోనూ రామ్‌చరణ్‌కు విలన్‌గా మారారు. దీంతో మళ్లీ కథానాయకుడిగా అవకాశాలు వరుస కడుతున్నారుు. ఇప్పటికే చతురంగవేటై్ట-2 చిత్రంలో హీరోగా నటిస్తున్న అరవిందస్వామికి తాజాగా మరో అవకాశం తలుపుతట్టినట్టు సమాచారం. ఇక అవకాశాలు తెరమరుగయ్యారుు అనుకున్న నటి తమన్నాను బాహుబలి చిత్రం అనూహ్యంగా ఆకాశానికి ఎత్తేసింది. అదే విధంగా తోళా, ధర్మదురై, దేవి చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో ముఖ్యంగా కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను పెంచుకున్న తమన్న విశాల్‌తో నటించిన కత్తిసండై పొంగల్ రేస్‌కు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2, తమిళంలో శింబుకు జంటగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలోనూ నటిస్తున్నారు.తాజాగా అరవిందస్వామితో రొమాన్‌సకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరు జంటగా దర్శకుడు సెల్వ ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు నాన్ అవనిల్లై, దానికి సీక్వెల్ అంటూ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు మరోసారి అదే తరహా రొమాంటిక్ చిత్రాన్ని రూపొందిండానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఐదుగురు కథానారుుకలు ఉంటారట. అందులో లీడ్ పాత్రకు నటి తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ప్రతినాయకి పాత్రలో నటి ఇనియ నటించనున్నారట. మరో ముగ్గురు నారుుకల ఎంపిక జరుగుతోందని, చిత్రాన్ని జనవరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. -
అవును.. హీరోలం మారుతుండాలి!
‘‘ఎప్పుడూ ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహంలా కాకుండా.. మేము (హీరోలం) మారుతుండాలి. గత సినిమాల ఇమేజ్, విజయాలను పట్టించుకోకూడదు. కథను బట్టి ముందుకు వెళ్లాలి’’ అన్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మించిన ‘ధృవ’ రిలీజ్ రేపు. రామ్‌చరణ్ చెప్పిన విశేషాలు... ► ప్రతి సినిమా విడుదల ముందు టెన్షన్ పడడం సహజమే. రీమేక్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పడుతున్నా. అల్రెడీ తమిళంలో హిట్టయిన సినిమా అయినా, అలవాటైన హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు కదా! ► ఎన్వీ ప్రసాద్‌గారు చెప్పడంతో ‘తని ఒరువన్’ చూశా. కొత్తగా ఉంటుందనుకున్నా. పైగా, పక్కా మాస్ ఏరియా అయిన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ (ఎన్వీ ప్రసాద్) నన్ను కొత్తగా చూడాలనుకుంటున్నారు. దాంతో ఓకే చేశా. కథను నమ్మాను. నా క్యారెక్టర్, స్క్రీన్‌ప్లే డిఫరెం ట్‌గా ఉంటాయి. రీమేక్, పోలీస్ పాత్ర- అవేవీ ఆలోచించలేదు. కథలో చాలా మార్పులు చేశాం. ► అరవింద్‌స్వామి పాత్ర నిడివి తగ్గుతోంది. కానీ, ఆయన తప్ప సిద్ధార్థ్ అభిమన్యు పాత్రకు మరో ఆప్షన్ కనిపించలేదు. ఆయనతో మంచి బాండింగ్ ఏర్పడడం వల్ల సీరియస్ సీన్స్ చేయడం నాకు కష్టమైంది. ► ‘మళ్లీ రకులే హీరోయిన్ కదా’ అని అడుగుతున్నారు. హీరోయిన్లు ఎవరున్నారు చెప్పండి. ‘నాన్నకు ప్రేమతో’, ఇతర సినిమాల్లో రకుల్ బాగా నటించింది కదా! ►నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. ప్రతి సినిమా ఓ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. సిక్స్‌ప్యాక్ ఎప్పుడో చేయాల్సింది. ► పెద్ద నోట్ల ఉపసంహరణ వల్లే ఈ నెల 2 నుంచి 9కి విడుదల తేదీని మార్చాం. ప్రస్తుతం రిలీజవుతోన్న పెద్ద సినిమా మాదే. ఆ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో చూడాలి! ►సుకుమార్ సినిమా సంక్రాంతి తర్వాత, బాబాయ్ (పవన్‌కల్యాణ్) నిర్మాతగా చేసే సినిమా వచ్చే ఏడాది ఉంటాయి. ముందు ఇద్దరి చేతిలోనూ ఉన్న సినిమాలు పూర్తవ్వాలి. దర్శకులు మణిరత్నం, కొరటాల శివలతో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ► ప్రస్తుతానికి తెలుగులోనే చేస్తా. హిందీలో నటించే ఆలోచన ఏదీ లేదు. డాడీతో మళ్లీ డ్యాన్స్ చేశా! ‘ఖైదీ నంబర్ 150’లో తళుక్కున మెరుస్తా. నాన్నగారి (చిరంజీవి) తో కలసి ఓ పాటలో డ్యాన్స్ చేశా. ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క్రిస్మస్కి పాటల్ని విడుదల చేస్తాం. జనవరి 11.. 12 తేదీల్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. -
చతురంగ వేటై్ట-2 చిత్రానికి శ్రీకారం
చతురంగ వేటై్ట-2 చిత్రానికి పూజా కార్యక్రమాలతో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు సీనియర్ నటుడు మనోబాలా నిర్మించిన చిత్రం చతురంగవేటై్ట. నటుడు నటరాజ్(నట్టి) హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా చతురంగవేటై్ట-2 పేరుతో తాజా చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చతురంగవేటై్ట చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలనే ఈ చిత్రాన్ని కూడా తన పిక్చర్ హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అరవిందస్వామి కథానాయకుడిగానూ, ఆయనకు జంటగా నటి త్రిష నాయకిగానూ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, నాజర్, ప్రకాశ్‌రాజ్, పూర్ణ, మనోబాల, మయిల్సామి, ఆర్ఎన్ఆర్.మనోహర్, శ్రీమాన్, కమారవేల్ నటిస్తున్నారు. అశ్వమిత్ర సంగీతాన్ని, కేజీ.వెంకటేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని ఎన్వీ.నిర్మల్‌కుమార్ నిర్వహిస్తున్నారు. చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. -
మహా జాదూ జోడీ!
అరవింద్ స్వామి హీరోగా నటించిన ‘బొంబాయి’ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు దాటింది. అప్పుడు త్రిషకి పదమూడేళ్లు. ఇద్దరి మధ్య వయసులో వ్యత్యాసం కూడా పదమూడేళ్లే. అప్పటికి ఆమె హీరోయిన్ కూడా కాలేదు. ‘జోడీ’తో యాక్టర్‌గా త్రిష కెరీర్ స్టార్ట్ చేసే టైమ్‌కి అరవింద్ స్వామి ఆల్మోస్ట్ సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సినిమాల నుంచి దూరంగా వెళ్లారు కూడా. నటుడిగా రీ-ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి, పదమూడేళ్లుగా హీరోయిన్గా కంటిన్యూ అవుతున్న త్రిష ఇప్పుడు జంటగా నటిస్తున్న సినిమా ‘సదురంగ వేట్టై-2’. బుధ వారం చిత్రీకరణ మొదలైంది. మీరు చూస్తున్న ఫొటో ఈ సినిమా ఫస్ట్ లుక్కే. హ్యాండ్సమ్ అరవింద్ స్వామితో షూటింగ్ చేయడం హ్యాపీగా ఉందని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘సలీమ్’ ఫేమ్ నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ మహా జాదూ జోడీగా కనిపించనున్నారట. టెక్నాలజీ సహాయంతో ఓ ఘరానా దొంగ ఎటువంటి మోసాలు చేశాడనేది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది. -
హీరోగా దూకుడు
మంచి కథలు వస్తే చేసుకుంటూ వెళ్లడమే’ అన్నట్లుంది. వారం రోజుల్లో మూడు తమిళ సినిమాలకు సంతకం చేశాఅరవింద్ స్వామి స్పీడు చూస్తుంటే.. ‘లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. రాయన. ఆ మూడింటిలోనూ హీరో ఆయనే. ‘తని ఒరువన్’లో విలన్‌గా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన ప్రస్తుతం హీరోగా దూకుడు చూపిస్తున్నారు. అరవింద్ స్వామి, త్రిష జంటగా తమిళ చిత్రం ‘సదురంగ వెట్టై’కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా నయనతారకు జోడీగా మలయాళ హిట్ సినిమా ‘భాస్కర్ ది రాస్కెల్’ తమిళ రీమేక్‌లో నటించనున్నారనే వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండూ కాకుండా రమణ అనే తమిళ దర్శకుడితో ఓ చిత్రం చేయడానికి అంగీకరించారాయన. ఇందులో అరవింద్ స్వామికి జంటగా మలయాళీ కథానాయిక మంజు వారియర్ నటించనున్నారు. ఓ చిత్రం తర్వాత మరొకటి ఈ మూడూ సెట్స్‌పైకి వెళ్లనున్నాయట. ఈ చిత్రాల కోసమే అన్నట్టు ప్రస్తుతం అరవింద్ స్వామి జిమ్‌లో కండలు పెంచే పనిలో బిజీగా ఉన్నారు. -
జోడీ కుదిరింది
ఓ పదేళ్ల క్రితం అందంగా ఉన్న కుర్రాళ్లను అరవింద్ స్వామిలా ఉన్నావనేవారు. ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత వ్యాపారంపై దృష్టి సారించిన అరవింద్ స్వామి దశాబ్దం తర్వాత మణిరత్నం ‘కడలి’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘తని ఒరువన్’లో విలన్‌గా అందర్నీ మెప్పించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రామ్‌చరణ్ ‘ధృవ’లోనూ ఆయనే విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు అరవింద్ స్వామి హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ‘సదురంగ వెట్టై’ అనే తమిళ సినిమా సీక్వెల్లో ఆయన హీరోగా నటించనున్నారు. అరవింద్ స్వామికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. 2014లో విడుదలైన ‘సదురంగ వెట్టై’తో హెచ్.వినోద్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సీక్వెల్‌కి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘సలీమ్’ ఫేమ్ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఓ ఘరానా మోసగాడు ఏం చేశాడనే కథాంశంతో ఈ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందట. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. -
అరవిందస్వామితో రొమాన్స్‌కు సై
అరవిందస్వామితో రొమాన్స్‌కు త్రిష సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రోజా చిత్రం తరువాత ఆ చిత్ర హీరో అరవిందస్వామికి యువత ఫాలోయింగ్ ముఖ్యంగా అమ్మాయిల మధ్య ఎంతగా క్రేజ్ పెరిగిందో తెలిసిందే.అలాంటి అరవిందస్వామి కొంత కాలం సినిమాలకు దూరం కావడం చాలా మంది తట్టుకోలేక పోయారు. అయితే కడల్ చిత్రంతో రీఎంట్రీ అయిన ఈ చార్మింగ్ నటుడు ఇటీవల తనీఒరవన్ చిత్రంలో జయం రవికి విలన్‌గా మారి తనదైన స్టైల్ నటనతో మెప్పించారు.కాగా తాజాగా మరో సారి హీరోగా అవతారమెత్తనున్నట్లు సమాచారం.2014లో తరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రం చదురంగ వేట్టై.ఈ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ తాజాగా దానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. చదురంగ వేట్టై చిత్రాన్ని నిర్మించిన నటుడు,దర్శకుడు మనోబాలానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.కాగా తొలి భాగంలో హీరోగా నటించిన నట్టి(నటరాజ్) కు బదులు దాని సీక్వెల్లో అరవిందస్వామి నటించనున్నారని తెలిసింది. చదురంగ వేట్టై చిత్రం కంటే మరింత భారీగా తెరకెక్కించనున్న ఈ సీక్వెల్లో టాప్ నటిని హీరోయిన్గా ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటి త్రిషను నటింపజేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం త్రిష చేతిలో మోహినీ చిత్రం మాత్రమే ఉంది. దీంతో అరవిందస్వామితో రొమాన్స్ సై అంటారనే టాక్ వినిపిస్తోంది.కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన త్వరలో వెలువడనుంది. -
అరవిందస్వామి, తమన్నా జంటగా..
అరవిందస్వామి, తమన్నా జంటగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'శతురంగ వేట్టై' అనే థ్రిల్లర్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడి గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతూ జీవించే ఓ వ్యక్తి కథే 'శతురంగ వేట్టై'. త్రివిక్రమ్ 'అఆ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణ్యం ఆ సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు అరవిందస్వామి, తమన్నాలు ప్రధాన పాత్రల్లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ రియల్ ఇన్సిడెంట్ను తెరపై చూపించనున్నారట. 'తనీ ఒరువన్' హిట్ తర్వాత అరవింద్ స్వామి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అరవిందస్వామికి జోడీగా తమన్నా నటిస్తుందనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ సినిమా విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
రెడీ... స్టార్ట్...యాక్షన్!
ఇక నాలుగు రోజులు మాత్రమే రామ్‌చరణ్ ఖాళీగా ఉంటారు. ఆ తర్వాత ఫుల్ బిజీ. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రం తాజా షెడ్యూల్ ఈ 22న హైదరాబాద్‌లో మొదలు కానుంది. తమిళ చిత్రం ‘తని ఒరువన్’కి రీమేక్‌గా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో అరవింద్ స్వామి కనిపించే కొన్ని దృశ్యాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రవిశేషాలను అల్లు అరవింద్ చెబుతూ- ‘‘క్యారెక్టర్ పరంగా స్టన్నింగ్ లుక్‌తో రామ్‌చరణ్ అభిమానులను అలరించనున్నాడు. సురేందర్‌రెడ్డి స్టైలిష్ మేకింగ్‌ని మరోసారి చూస్తారు. అరవింద్‌స్వామి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రకుల్ ప్రీత్‌సింగ్ నటన, అందచందాలు అదనపు ఆకర్షణ. రామ్‌చరణ్, రకుల్ ఆల్రెడీ మంచి పెయిర్ అనిపించుకున్నారు. ఈ చిత్రంతో మరోసారి ఆకట్టుకుంటారు. చరణ్, సురేందర్‌రెడ్డి, నా కాంబినే షన్లో వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. హైదరాబాద్ షెడ్యూల్లో యాక్షన్, టాకీ తీస్తాం. జూన్ 20 నుంచి కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అని తెలిపారు. నాజర్, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: అసీమ్ మిశ్రా, సంగీతం: ‘హిప్ హాప్’ ఆది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వీవై ప్రవీణ్ కుమార్, సహ నిర్మాత: ఎన్వి ప్రసాద్. -
విలన్‌గా యమ క్రేజ్
మణిరత్నం ‘రోజా’, ఆ తరువాత ‘బొంబాయి’ హీరోగా అందరికీ దగ్గరైన అరవింద్ స్వామి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి బిజీ. ఆయన విలన్‌గా, ‘జయం’ రవి హీరోగా నటించిన లేటేస్ట్ తమిళ హిట్ ‘తని ఒరువన్’ తాజాగా రామ్‌చరణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ అరవిందే విలన్ పాత్రధారి. ఇలా ఉండగా, తమిళంలో ఇప్పుడు అరవింద్‌స్వామి, ‘జయం’ రవి కాంబినేషన్‌కు భలే క్రేజ్ ఉంది. ‘రోమియో-జూలియట్’ తమిళ చిత్ర దర్శకుడు లక్ష్మణన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో మళ్ళీ వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ మళ్ళీ విలన్, హీరోలుగా చేస్తున్నారట! -
సోలో హీరోగా అరవింద్‌స్వామి
తనీ ఒరువన్ సినిమాతో విలన్‌గా మెప్పించిన అరవింద్ స్వామి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి, ప్రస్తుతం విలన్‌గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి మరోసారి సోలో లీడ్‌గా కనిపించనున్నాడు. కోలీవుడ్ లో రియలిస్టిక్ దర్శకుడిగా పేరున్న బాల దర్శకత్వంలో అరవింద్ స్వామి ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం శశికుమార్, వరలక్ష్మీల కాంబినేషన్లో 'తారై తప్పట్టై' సినిమా చేస్తున్న బాల, ఈ సినిమా పూర్తయిన తరువాత అరవింద్ స్వామి లీడ్ రోల్లో సినిమా కోసం వర్క్ చేయనున్నాడు. సాఫ్ట్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించే అరవింద్ స్వామి, బాల లాంటి దర్శకుడితో కలిసి పనిచేయగలడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అరవింద్ స్వామి, బాలల కాంబినేషన్లో సినిమా దాదాపుగా కన్ఫామ్ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
13 ఏళ్ల తర్వాత..!
1990ల్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన హీరోల్లో అరవింద్‌స్వామి ఒకరు. ఆరడగులుంటారో లేదో తెలియదు కానీ.. ఈ అందగాడితో ఏడడుగులు వెయ్యాలని చాలామంది అమ్మాయిలు కలలు కన్నారు. అప్పట్లో ఆయన పాపులార్టీ అలా ఉండేది మరి. ఈ హ్యాండ్సమ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా, బోల్డంత క్రేజ్ సంపాదించుకున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని, వ్యాపారంలో నిమగ్నమయ్యారు అరవింద్‌స్వామి. ‘కడలి’ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించారారు. ఇప్పుడాయన ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నారు. మరాఠీ చిత్రం ‘కక్స్పర్ష్’ చిత్రానికి రీమేక్ ఇది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ మంజ్రేకరే ఈ హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా ఉత్తరాది తెరపై కనిపించబోతున్నానని అరవింద్‌స్వామి పేర్కొన్నారు. ఇది కాకుండా మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించబోతున్నారట. 2015లో ఈ చిత్రాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.