
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. ఇక ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ.400 కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కీలకపాత్రలు పోషించే నటీనటులను జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమాలో విలనిజాన్ని చాలా కొత్తగా చూపించాలని దర్శకుడు భావిస్తున్నారట. ప్రభాస్‌తో పోటీగా సాగే విలన్ పాత్ర కోసం ఒకప్పటి హీరో.. రీఎంట్రీ విలన్ అరవింద్ స్వామి అయితే బాగుంటుందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనతో దర్శకుడు సంప్రదింపులు జరిపినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. అయితే చర్చలు తుదిదశలో ఉన్నాయని త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ చిత్రంలో అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
చదవండి:
విష్ణు టిక్‌టాక్ వీడియో.. అద్భుతః
‘అది వాషింగ్ మెషీన్ కాదు యష్’
Comments
Please login to add a commentAdd a comment