Aswani Dutt
-
Kalki 2898 AD Bujji Event Photos: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్ (ఫొటోలు)
-
అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు
అవినీతిలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి చంద్రబాబు జైలుకెళ్లినా.. ఆయన వల్ల ఏదో రూపంలో లబ్ధి పొందిన కొందరు సినీ ప్రముఖులు బ్రహ్మాండం బద్దలైపోయినట్లు లోకమంతా అన్యాయమైపోయినట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. తాము అభిమానించే చంద్రబాబును విడుదల చేయాలని కోరితే ఓకే అనుకోవచ్చు. కానీ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిన ఏపీ ప్రభుత్వాన్ని అర్జంట్‌గా రద్దు చేసేసి, రాష్ట్రపతి పాలన పెట్టేయాలంటూ కొందరు ఉన్మాద డిమాండ్లు చేస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబే చెప్పలేకపోతున్నారు. ఆయన తరపు న్యాయవాదులూ ఈ మాట అనడం లేదు. కానీ కొందరు సినీ మనుషులు మాత్రం కణ్వమహర్షిని అరెస్ట్ చేసినట్లు తెగ బాధపడిపోతున్నారు. దీన్ని చూసి మేథావులు ఏవగించుకుంటున్నారు. రూ.371 కోట్ల లూటీ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో పట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆధారాలు చూసిన తర్వాతనే గౌరవ న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కుంభకోణంలో తాను డబ్బులు తినలేదని కానీ, తన షెల్ కంపెనీలకు డబ్బులు రాలేదని కానీ చంద్రబాబు అనలేదు. ఆయన కోర్టులో వాదించిందల్లా తనను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో హాజరు పరచలేదని ఫిర్యాదు చేశారు. అయితే సీఐడీ పోలీసులు నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని ఏసీబీ కోర్టు భావించింది. అందుకే చంద్రబాబు నాయుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా కూడా కొంతమందికి మాత్రం ఆయన్ను అరెస్ట్ చేయడం నచ్చడం లేదు. అందులోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా ఆర్ధికంగా పదవుల పరంగా లబ్ధి పొందిన కొందరు సినీ రంగ ప్రముఖులయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం మహా అపరాధం అన్నట్లు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబునే అరెస్ట్ చేస్తారా? అంటూ పళ్లు పటపట కొరికేస్తున్నారు. సినీ నిర్మాత, టిడిపి కార్యకర్త, చంద్రబాబు హయాంలో భూముల పరంగా లబ్ధిపొందిన కొద్ది మంది అస్మదీయుల్లో ఒకరు అయిన అశ్వనీదత్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన వారిలో ఏ ఒక్కరికీ పుట్టగతులుండవని శపించేశారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు అశ్వనీదత్‌కు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆయన శాపాలు నిజం అయిపోయేవేమో! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వంలో పదవి అనుభవించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహజంగానే రుణం తీర్చుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అన్యాయం అన్నారు. అది రాజకీయ కక్ష సాధింపే అని కూడా అన్నారు. ఆయన్ను విడుదల చేయాలని కోరారు. అందులో ఎలాంటి తప్పూ లేదు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తూ దొరికిపోయినట్లు లోకంలో ప్రతీ ఒక్కరికీ తెలిసినా బాబు అభిమానులు ఇలాంటి డిమాండ్లతో కాలక్షేపం చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు మేధావులు. ఇక మరో నిర్మాత కె.ఎస్.రామారావు అయితే చాలా క్రియేటివిటీ చూపించారు. కమర్షియల్‌గా చంద్రబాబు వల్ల ఆయన ఏం లబ్ధి పొందారో తెలీదు కానీ చంద్రబాబుపై ఉన్న కేసులో ఆధారాలు లేవని రామారావు అనేశారు. ఆధారాలు లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేస్తున్నాయి?.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ బాబును ఎందుకు అరెస్ట్ చేసింది? ఆధారాలు లేకపోతే ఎందుకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు? ఆధారాలు లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు న్యాయస్థానంలో దాన్ని సవాల్ చేయలేదు? చంద్రబాబు అరెస్ట్ మీకు తెలీకుండానే జరిగిందా? అంటూ కె.ఎస్.రామారావు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. అంత వరకు ఫర్వాలేదు. చంద్రబాబు నాయుడు చాలా నిజాయితీ పరుడు అని అభిప్రాయపడ్డారు. పోనీలే అది ఆయన అభిప్రాయం అనుకోవచ్చు. కానీ ఓ పిచ్చి డిమాండ్ కూడా చేశారు రామారావు. ఉన్నట్లుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలట. జగన్మోహన్ రెడ్డిని దింపేసి రాష్ట్రపతి పాలన విధించేయాలట? రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనా, ప్రజాస్వామ్యంపైనా కేఎస్ రామారావుకు ఎంత గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. బయటకు వచ్చినపుడు పైన చెప్పినోళ్లంతా మనుషుల్లా మాట్లాడాలి అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు అవినీతి చేశాడా? లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని కోర్టు నమ్మితే ఆయన్ను విడుదల చేస్తాయి. ఆయన తప్పునకు దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఆధారాలు సరైనవే అని భావిస్తే చంద్రబాబు నాయుడికి చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు. ఈ లోగా చంద్రబాబు నాయుడి దగ్గరో ఆయన పార్టీ నేతల దగ్గరో లేదంటే చంద్రబాబు కొమ్ము కాసే పత్రికల దృష్టిలో పడాలనో.. ఇలాంటి సినీ ప్రముఖులు నోటికెంతొస్తే అంతా మాట్లాడ్డం మాత్రం క్షమించరాని నేరమే అంటున్నారు విశ్లేషకులు. :::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
అశ్వనీదత్.. నోరు అదుపులో పెట్టుకో
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ చౌదరి చేసిన వ్యాఖ్యలను అమరావతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి అంజిబాబు గురువారం ఖండించారు. ముద్రగడపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అశ్వనీదత్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడను వాడు, వీడు అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. కుల అహంకారంతో ముద్రగడను దూషించిన అశ్వనీదత్‌కు కాపుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాపులది పిచ్చి ఉద్యమమని వ్యాఖ్యానించి.. కాపు జాతిని అవమానించారని మండిపడ్డారు. -
ప్రభాస్ చిత్రంలో స్టైలిష్ విలన్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. ఇక ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు రూ.400 కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కీలకపాత్రలు పోషించే నటీనటులను జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమాలో విలనిజాన్ని చాలా కొత్తగా చూపించాలని దర్శకుడు భావిస్తున్నారట. ప్రభాస్‌తో పోటీగా సాగే విలన్ పాత్ర కోసం ఒకప్పటి హీరో.. రీఎంట్రీ విలన్ అరవింద్ స్వామి అయితే బాగుంటుందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనతో దర్శకుడు సంప్రదింపులు జరిపినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. అయితే చర్చలు తుదిదశలో ఉన్నాయని త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ చిత్రంలో అరవింద్ స్వామి స్టైలిష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చదవండి: విష్ణు టిక్‌టాక్ వీడియో.. అద్భుతః ‘అది వాషింగ్ మెషీన్ కాదు యష్’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_831249961.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏపీ రాజధానిలో భూ సంతర్పణ
-
అమ్మ ఎదిగిన తీరును బాగా చూపించారు
-
సినీ పరిశ్రమ తరఫున మద్దతు ఇవ్వడానికి మీరు ఎవరు.?
-
ఆ ఐదుగురిపై పోసాని కృష్ణమురళి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఉంటుందని సినీ పెద్దలు ప్రకటన చేయడాన్ని ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి మీరు ఎవరు అంటూ ఆయన నిలదీశారు. అశ్వనీదత్, కేఎల్ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్రావు, కిరణ్ తదితరులు చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటన చేసినట్టు ఓ పత్రికలో వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలని పోసాని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయని, వారి ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోందని, చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఇది ఉందని ఆయన మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. ‘హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు అంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకేతాటిపైకి వచ్చి సీఎంగారు చేస్తున్న ఉద్యమానికి బాసటగా ఉంటామని ఆ పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చిత్ర పరిశ్రమలో 33ఏళ్లకుపైగానే ఉన్నా. ఈ విషయం గురించి నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. మీటింగ్ పెట్టి అందర్నీ ఎవరూ పిలువలేదు. అలాంటప్పుడు మీరు నలుగురైదుగురు సీఎంకు వద్దకు వెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం మీకు మద్దతుగా ఉంటుందని ఎలా చెప్తారు. సీఎం చంద్రబాబును అశ్వనీదత్, కేఎల్ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్రావు, కిరణ్ కలిశారు. వీళ్లు ఐదుగురు మాత్రమే సినీ పరిశ్రమ మొత్తం తరఫున వకాల్తా పుచ్చుకొని ఎలా హామీ ఇస్తారు? ఇది పత్రికలో వచ్చిన అబద్ధమా? అయితే ఈ వార్త అబద్ధమని, మేం వ్యక్తిగతంగానే సీఎంను కలిశాం. కానీ ఇండస్ట్రీ తరఫున రాలేదని మీరు వివరణ ఇచ్చి ఉండాలి? ఇప్పటివరకు ఎందుకు వివరణ ఇవ్వలేదు? కేఎల్ నారాయణ జెంటిల్మెన్. క్యాస్ట్ రంగు పులుముకొని తిరగరు. కిరణ్‌గారు కూడా అంతే. వారందరూ అంటే నాకు గౌరవ ఉంది. కానీ ఎఇలా ప్రకటన చేయడం బాగాలేదు’ అని పోసాని అన్నారు. నేను చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం లేదు! ‘సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు హోదా ఉద్యమానికి మద్దతుగా ఉంటుందని వారు చెప్పారు. కానీ నేను మద్దతు ఇవ్వడం లేదు. వీళ్లు సినీ పరిశ్రమ తరఫున ఎలా సీఎంకు హామీ ఇస్తారు? అని కొందరు నన్ను అడుగుతున్నారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోంది. చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టు అన్నట్టుగా ఇది ఉంది. మమ్మల్ని అడగకుండా ఎలా మొత్తం సినీ పరిశ్రమ తరఫున మద్దతు ఇస్తారు? ఇండస్ట్రీ అంటే ఆ ఐదుగురేనా? మీరు ఇలాంటి సేట్మెంట్ ఇచ్చి ఉండకుంటే.. పేపర్ వాళ్లు తప్పు రాశారని ప్రకటన ఇవ్వండి’ అని పోసాని కోరారు. ‘చంద్రబాబు వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఆయన ఒకసారి ప్రత్యేక హోదా కావాలన్నారు. తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీ చాలు అన్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరం కోసం ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారు. అందుకే మద్దతు ఇచ్చేందుకే మీరు వచ్చారా? మీకు అభిమానం ఉంటే.. వ్యక్తిగతంగా వెళ్లి చంద్రబాబుకు మద్దతు ఇచ్చుకోండి. అంతేకానీ సినీ పరిశ్రమలోని వేలమంది తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే హక్కు మీకు ఉండదు. ఈ ప్రభుత్వం తప్పులు చేస్తోంది. ఈ ముఖ్యమంత్రి తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వెళ్లలేదు. పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడం వల్లే ఒక్కశాతం ఓట్లు అధికంగా వచ్చి తెలుగుదేశం గెలిచింది. అందుకే మీరు పవన్‌కు సన్మానం చేశారు. ఆయన కొంచెం విమర్శించడంతో ఇప్పుడు ఆయనపై మండిపడుతున్నారు’ అని అన్నారు. ప్రత్యేక హోదా మీద మీకు ప్రేమ ఉంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు ఎందుకు మద్దతు తెలుపలేదు. ఢిల్లీలో ఎంపీలు అన్నాపానాలు మరిచి దీక్ష చేశారు. పెద్ద వయస్సులో ఉన్నప్పటికీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా దీక్ష చేశారు. మరి మీరు ఢిల్లీకి వెళ్లి.. ఎందుకు ఆ ఐదుగురు ఎంపీలకు సానుభూతి తెలుపలేదు. కేవలం చంద్రబాబుకు మాత్రమే మద్దతు ఇస్తారా? వైఎస్ జగన్‌ది ఉద్యమం కాదా? వామపక్షాలది ఉద్యమం కాదా? కాంగ్రెస్ పార్టీది ఉద్యమం కాదా? చలసానిది ఉద్యమం కాదా?’ అని ప్రశ్నించారు. ‘హోదాపై చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో మీకు తెలియదా? మీరు పెద్దమనుషులు.. ఇలాంటి తప్పులు చేయకూడదు. కానీ మా తరఫున ఇలా వకాల్తా తీసుకొని మాట్లాడకూడదు’ అని సినీ పెద్దలకు పోసాని సూచించారు. ఒకవేళ ఈ ప్రకటన చేసి ఉండకుంటే.. ఇలాంటి ప్రకటన తాము చేయలేదని ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్న అందరికీ కళాకారుల తరఫున మద్దతు ఇవ్వాలని సూచించారు. -
మహేష్ సినిమా నిర్మాతలెవరంటే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమాను ఎనౌన్స్ చేసింది. అయితే పీవీపీ ఎనౌన్స్ చేసినా.. ఈ ప్రాజెక్ట్‌పై మహేష్ వర్గం నుంచి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఆ సమయంలో మహేష్ అనుమతి తీసుకోకుండానే పీవీపీ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిందన్న టాక్ కూడా వినిపించింది. అందుకే మహేష్ వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టేశాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేష్ బాబు 25వ సినిమాను తాను డైరెక్టర్ చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాను అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తారని తెలిపాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న మహేష్, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసే సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. It's my pleasure to announce my next film with The Superstar @urstrulyMahesh. #MB25 — Vamshi Paidipally (@directorvamshi) 17 December 2016 .This film will be produced by Aswani Dutt garu and Dil Raju garu. #MB25. — Vamshi Paidipally (@directorvamshi) 17 December 2016 -
విజయ్ హీరోగా రవిబాబు సినిమా
మెగాస్టార్ సినిమా ఇస్తాడన్ననమ్మకంతో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. ఇప్పట్లో ఆ అవకాశాలు కనిపించకపోవటంతో యంగ్ హీరోతో సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. అశ్వనిదత్ కూతురు నిర్మాతగా తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమాకు విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించనున్నాడు. రవిబాబు ప్రస్తుతం పంది పిల్ల ప్రధాన పాత్రలో అదుగో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2017లో ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఆ తరువాత విజయ్, రవిబాబు కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. -
త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్..?
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. హీరో క్యారెక్టర్‌కు సూట్ అవుతాడా అన్న అనుమాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, యంగ్ లుక్‌లో వావ్ అనిపిస్తున్నాడు. కుర్ర హీరోలకు పోటి ఇచ్చేలా ఉన్న చిరు లుక్స్ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. లుక్స్ విషయంలోనే కాదు స్పీడులో కూడా కుర్రహీరోలను సవాల్ చేస్తున్నాడు మెగాస్టార్. చిరు హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన చేయబోయే 151, 152 సినిమాలపై కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ 151వ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు 152వ సినిమాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల చిరంజీవితో త్వరలో సినిమా నిర్మిస్తానంటూ మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రకటించిన నేపథ్యంలో.., అది చిరు 152వ సినిమానే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ రూమర్స్‌పై మెగా క్యాంప్ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఖండించకపోవటంతో ఈ న్యూస్ నిజమే అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.