విజయ్ హీరోగా రవిబాబు సినిమా | Ravi Babu Movie with Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

విజయ్ హీరోగా రవిబాబు సినిమా

Published Sat, Oct 22 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

విజయ్ హీరోగా రవిబాబు సినిమా

విజయ్ హీరోగా రవిబాబు సినిమా

మెగాస్టార్ సినిమా ఇస్తాడన్ననమ్మకంతో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. ఇప్పట్లో ఆ అవకాశాలు కనిపించకపోవటంతో యంగ్ హీరోతో సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. అశ్వనిదత్ కూతురు నిర్మాతగా తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను నిర్మించే ప్లాన్లో ఉన్నాడు.

ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమాకు విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించనున్నాడు. రవిబాబు ప్రస్తుతం పంది పిల్ల ప్రధాన పాత్రలో అదుగో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2017లో ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఆ తరువాత విజయ్, రవిబాబు కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement