Ravi Babu
-
షూటర్.. ఫస్ట్‌లుక్ చూశారా?
రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం షూటర్. శ్రీ వెంకట సాయి బ్యానర్‌పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారుఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విభిన్న కథా కథనాలతో షూటర్‌ను తెరకెక్కించాము. రవి బాబు, ఆమని, ఎస్తార్, రాశి, సుమన్ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, సమీర్, జీవా నటించారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా ఉంటుంది అన్నారు. -
ఆశలు కల్పించి.. పాతాళానికి నెట్టేశారు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఆకాశమంత ఎత్తున ఆశలు కల్పించారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను పాతాళానికి తోసేశారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మండిపడ్డారు. బడ్జెట్‌పై శాసన మండలిలో గురువారం జరిగిన చర్చలో పాల్గొన్న రవిబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని ప్రజలను మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 76 స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు పూర్తిస్థాయి బడ్టెట్ కూడా పెట్టలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కూటమి ప్రభుత్వం మార్చివేసిందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు అంటే... రూ.11లక్షల కోట్లు అప్పు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పించారని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.6.46లక్షల కోట్లు అని తేల్చారని, చంద్రబాబు నిజాయతీ ఇదేనా? అని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నాడు–నేడు ద్వారా రూ.32వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని, రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని, 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని మెగా డీఎస్సీ ఇస్తున్నామని, రిలయన్స్, టీసీఎస్ వంటి సంస్థలను తెస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సభ్యులు మాట్లాడుతుండగా మధ్యలో మంత్రులు అడ్డుతగలడం సరికాదని, అన్ని వివరాలు నోట్ చేసుకుని చివరిలో సమాధానం ఇవ్వాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హితవుపలికారు. అనంతర రవిబాబు ప్రసంగం కొనసాగిస్తూ ఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదని తప్పుబట్టారు. అనంతరం టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా మాట్లాడారు. -
మా నాన్న చేసింది తప్పే.. రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగులో కొందరు నటులు అప్పుడప్పుడు నోరు జారేస్తుంటారు. హీరో బాలకృష్ణ ఇలా చాలాసార్లు టంగ్ స్లిప్ అయి బుక్కైపోయాడు. అయితే సీనియర్ నటుడు చలపతి రావు కూడా గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అమ్మాయిల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ 'పక్కలోకి వస్తారు' అని ఏదేదో వాగారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దీని గురించి ఇన్నాళ్ల తర్వాత ఆయన కొడుకు దర్శకనటుడు రవిబాబు స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'మా నాన్న చేసిన ఆ కామెంట్స్ గురించి ఇంతవరకు నేను ఎక్కడా స్పందించలేదు. కానీ నేను ఇదివరకే మాట్లాడినట్లు ఎవరో ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి నేను ఆ టాపిక్ గురించి నాన్నతో అస్సలు మాట్లాడలేదు. అలానే బయట మీడియాతో కూడా అస్సలు మాట్లాడలేదు. కానీ నాన్నతో మాత్రం దీని గురించి.. 'మీరు మాట్లాడిన ఈ మాట కొందరిని నొప్పించి ఉంటే వాళ్లకు సారీ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా' అని అన్నాను. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే మనందరం ఎప్పుడో ఓసారి నోరు జారుతుంటాం. లూజ్‌గా మాట్లాడేస్తుంటాం. కానీ వాటిని గుర్తించి సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు టంగ్ స్లిప్ అవ్వడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పేశారు కాబట్టి ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది.ఇకపోతే రవిబాబు విషయానికొస్తే.. తండ్రిలానే తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. కానీ 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా మారాడు. అలా అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ, నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా విజయ్ దేవరకొండ 'ద ఫ్యామిలీ స్టార్'లో విలన్‌గా చేశాడు. తాజాగా 'రష్' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
Ravi Babu : తిరుమల శ్రీవారి సేవలో డైరెక్టర్ రవిబాబు కుటుంబం (ఫొటోలు)
-
ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచించారా ?
-
నా జీవితం ఇలా అవడానికి కారణం రవి బాబు..!
-
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
హారర్.. థ్రిల్లర్
రవిబాబు, సత్యప్రకాష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్’. ఈ చిత్రం ద్వారా సీవీఎస్ఎమ్ వెంకట్ రవీంద్రనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణార్జున మూవీ మేకర్స్‌పై పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ–‘‘గతంలో గ్రామాల్లో మాతంగులు జీవించేవారు. వారి జీవితాల ఆధారంగా అల్లుకున్న కథకి హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఈ మూవీ ద్వారా ముగ్గురు కొత్త అమ్మాయిలను హీరోయి¯Œ ్సగా పరిచయం చేస్తున్నాం. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీకే స్టిల్ రాజ్ కమల్. -
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. కానీ.. : రవిబాబు
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో రవిబాబు దిట్ట. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ హీరోయిన్గా కనిపిస్తుంది. రవిబాబు వరుసగా ఆమెతో సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేసేవి. అదంతా ఏమీ లేదని రవిబాబు గతంలో రూమర్స్‌ను కొట్టిపారేసినప్పటికీ ఆ వదంతుల ప్రచారం ఆగలేదు. తాజాగా రవిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన అసలు మూవీలోనూ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పూర్ణతో రిలేషన్‌షిప్‌పై స్పందించాడు రవిబాబు. ఆయన మాట్లాడుతూ.. 'పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది. దర్శకుడు చెప్పినదానికంటే పూర్ణ 200 శాతం యాడ్ చేసి నటిస్తుంది. నా సినిమాల్లో హీరోయిన్ అనగానే అందరికీ మొదట పూర్ణ గుర్తొస్తుంది. కానీ ఆమె కొన్నింటినే ఓకే చేస్తుంది. మరికొన్నింటికి నో చెప్తుంది. ఈ మధ్య నా కొత్త సినిమా వాషింగ్ మెషీన్ కోసం ఆమెను సంప్రదించాను. తను నిర్మొహమాటంగా చేయనని చెప్పేసింది. తను ఒక పాత్రకు సరిగ్గా సరిపోతాను అనుకుంటే మాత్రమే నటిస్తుంది. అంతేతప్ప నాకోసం ప్రత్యేకంగా ఒప్పుకోదు. అలా ఒప్పుకోకూడదు కూడా! అందువల్లే ఆమెకు నచ్చిన సినిమాల్లోనే పూర్ణ నటించింది' అని రవిబాబు చెప్పుకొచ్చాడు. కాగా హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సెలక్టెడ్‌గా సినిమాలు చేసే రవిబాబు అనసూయ, అవును సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2, లడ్డుబాబు, అదుగో సినిమాల్లో పూర్ణ ప్రధాన పాత్రలు పోషించింది. సీమటపాకాయ్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ అవును సినిమాతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. అఖండ, దసరా చిత్రాల్లోనూ పూర్ణ ముఖ్య పాత్రలు పోషించింది. గతేడాది వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. -
సరదాగా ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు
-
సరదాగా ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు: రవిబాబు
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాన్న(చలపతిరావు)ను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. అనారోగ్యంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సీనియర్ నటుడు చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రవిబాబు మీడియాకు తెలియజేశారు. ‘నాన్న నిన్న రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిని..ఆ ప్లేట్ అలా ఇచ్చి..వెనక్కి వాలిపోయారు. ఇంత సింపుల్‌గా వెళ్లిపోయారాయన. ఈ రోజు అంత్యక్రియలు చేద్దామనుకున్నాం. కానీ మా అక్కలు ఇద్దరూ అమెరికా లో ఉన్నారు. వాళ్ళు మంగళవారం రాత్రి కి వస్తారు. మంగళవారం వరకు మహా ప్రస్థానం లో ఫ్రీజర్ లో ఉంచుతాం. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని రవిబాబు అన్నారు. తన తండ్రికి ఎన్టీఆర్, మంచి భోజనం, జోక్స్ అంటే చాలా ఇష్టమని, ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం తన తండ్రికి దక్కిందని రవిబాబు అన్నారు. -
నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
చలపతిరావు జీవితంలో విషాదాలు : సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్‌గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
బుధవారం చలపతిరావు అంత్యక్రియలు.. అప్పటిదాకా భౌతికకాయం అక్కడే
రెండురోజుల వ్యవధిలోనే టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కొడుకు రవిబాబు నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. 1200కు పైగా సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. చలపతి రావు వయస్సు 78 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు రవిబాబు (నటుడు దర్శకుడు) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న కూమార్తెలు రాగానే బుధవారం మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్ చేయలేరు
‘‘హిట్ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్‌తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నరేశ్ హీరోగా పరిచయమైన ‘అల్లరి’ రిలీజ్ అయి నేటితో ఇరవై ఏళ్లు అవుతోంది. నటుడిగా తాను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయిన సందర్భంగా ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు. ► ‘అల్లరి’ సినిమా షూటింగ్ 2002 జనవరి 24న ఆరంభమైంది. 22న రవిగారు ఫోన్ చేసి, ఫోటోషూట్ చేసి ఎల్లుండి నుంచి షూటింగ్ అన్నారు. ‘నరేశ్ కొత్తవాడు, దర్శకుడిగా నువ్వు కొత్తవాడివే. ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోతో వెళితే బెటర్ ఏమో’ అన్నట్లుగా నాన్నగారు (ప్రముఖ దర్శక– నిర్మాత ఈవీవీ సత్యానారాయణ) కూడా చెప్పారు. కానీ రవిగారు నాపై నమ్మకంతో సినిమాను స్టార్ట్ చేశారు. అలా అక్కడి నుంచి ఈదర పోయి అల్లరి స్టార్ట్ అయ్యింది. నా 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను. ► కెరీర్ మధ్యలో ‘నేను’, ‘ప్రాణం’ వంటి సీరియస్ సినిమాలు చేశాను. ఇవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ‘నేను’ చూసి, దర్శకుడు క్రిష్ ‘గమ్యం’లోని గాలి శీను క్యారెక్టర్‌కు తీసుకున్నారు. గాలి శీనుతో నాకు ‘శంభో శివ శంభో’ సినిమా చేసే అవకాశం వచ్చింది. గమ్యం, శంభో శివ శంభోలో చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎమోషన్‌ను కూడా చేయగలనని మేకర్స్ నన్ను నమ్మారు. ఈ సినిమాల వల్ల ‘మహర్షి’లో చేసే చాన్స్ వచ్చింది. ► నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వస్తున్నాయని చాలా మంది అన్నారు. నిజానికి ‘గమ్యం’ సినిమా నేను ఒప్పుకున్నదే. నాన్నగారు ఈ సినిమా చూశాక ‘‘కథగా చెప్పి ఉంటే ఈ సినిమా చేయవద్దనేవాడిని. బాగా చేశావ్. నీకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్లో ఫ్లాప్స్ రావడం వల్ల ఈవీవీగారు లేకపోవడం వల్లే నా సినిమాలు హిట్స్ కాలేదని అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను చేసిన ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట..’ సినిమాలు హిట్ సాధించాయి. అయితే గత కొంతకాలంగా నాకు సరైన హిట్ రాలేదు. నాన్నగారిని ఓ దర్శకుడిగా కన్నా కూడా నేను ఓ ఫాదర్‌గా బాగా మిస్ అయ్యాను. ‘నాంది’(2021) సినిమా హిట్ సాధించినప్పుడు నాన్నగారు ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ► ‘మహర్షి’ తర్వాత ‘ఇక నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు’ అని ఓ ప్రొడ్యూసర్ అన్నారు. ‘నాంది’ హిట్ తర్వాత ఆయనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప్రొడ్యూసర్ నా మంచి కోసమే చెప్పి ఉండొచ్చు. అయితే ఎవరి కెరీర్ ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ నిర్ణయించలేరు. ఎవరి కెరీర్‌ని ఎవరూ డిసైడ్ చేయలేరు. ► ప్రస్తుతం ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేస్తున్నాను. మరో మూడు కథలను ఓకే చేశాను. నాకు ‘నాంది’తో హిట్ ఇచ్చిన విజయ్‌తో మరో సినిమా చేస్తాను. -
హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు
Ravi Babu Gave Clarity On Rumours Over Affair With Poorna: సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ దర్శకుడు రవిబాబు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆయన డైరెక్షన్లో పూర్ణ హీరోయిన్గా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రవిబాబు వరసగా ఆమెతో సినిమాలు చేయడం చూసి వారిమధ్య ఎదో నడుస్తోందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై పూర్ణ కానీ, రవిబాబులు కానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో నిజంగానే వీరిద్దరికి ఎఫైర్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: ‘మెంటల్’ అంటున్న సమంత, మంటపెట్టేశారన్న సిద్ధార్థ్! ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై నటుడు రవిబాబు స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోయిన్లతో మాట్లాడటం కానీ, వారిని కలవడం కానీ తాను చేయనని చెప్పాడు. విలువలకు తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఇక పూర్ణ అభినయం చూసే ఆమెను మూడు సినిమాల్లో తీసుకున్నానని చెప్పాడు. అంతే తప్పా మరో కారణం వల్ల కాదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా రవిబాబు దర్శకత్వంలో ‘అవును’, ‘అవును 2’, ‘లడ్డుబాబు’ సినిమాల్లో పూర్ణ నటించింది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. చదవండి: బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు! -
‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మా ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. మంగళవారం.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అనంతరం విష్ణు ప్రెస్‌మీట్ పెట్టి ప్రకాశ్ రాజ్ ఆరోపణలను ఖండిస్తూ మండిపడిన సంగతి తెలిసిందే. చదవండి: లీగల్‌గానే మనిషికి రూ.500 ఇచ్చాను : మంచు విష్ణు ఇలా ఎన్నికల వివాదం మరింత ముదురుతున్న తరుణంలో తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అసోసియేషన్ నడపడం మనకు చేత కాదా? ఎవరో వచ్చి నేర్పాలా? అంటూ ధ్వజమెత్తారు. అంతేగాక మన క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకే ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఇతర భాషల నుంచి నటులను తెస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
భగభగ మండిపోతున్నా: రవిబాబు
ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథా చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. మూస సినిమాలకు భిన్నంగా కొత్తదనం కోరుకునే దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు, మహమ్మారి కరోనా ‘పుట్టినరోజు’ సందర్భంగా ‘విషెస్’ చెబుతూనే, గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘‘ మై డియర్ కరోనా.. ఇవాళ నీ బర్త్ యానివర్సరీ అని చాలా హ్యాపీగా ఫీలవుతున్నావు కదా. కానీ నేను మాత్రం భగభగ మండిపోతున్నా. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది. అప్పుడు జనమంతా సంతోషపడతారు.(చదవండి: మహమ్మారి ‘పుట్టిన రోజు’ నేడే..!) అంతా మామూలైపోతుంది. నువ్వు చచ్చిపోతావు. అప్పడు నీ డెత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా’’ అంటూ రవిబాబు ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘క్రష్’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతతి తెలిసిందే. కాగా మానవాళిని గజగజ వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ తొలి కేసు వెలుగులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తైంది. నిజానికి కోవిడ్-19 ఎప్పుడు పురుడు పోసుకుందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వివరాల ప్రకారం 2019 నవంబర్ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు. -
కరోనా ఎఫెక్ట్: ‘క్రష్’ ఫోటోలు వైరల్
టాలీవుడ్లో ప్రయోగాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో నటుడు, దర్శకుడు రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘ఆవిరి’ చిత్రం తర్వాత రవిబాబు తాజాగా చేస్తున్న చిత్రం ‘క్రష్’. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం ప్రారంభించింది. దీనిలో భాగంగా చిత్రానికి సంబంధించిన మరో రెండు పోస్టర్లను మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ‘కరోనా వైరస్’వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్‌లు ధరించాలంటూ సూచిస్తూ వినూత్న ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కరోనా వైరస్‌ను కూడా ఉపయోగించుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవచ్చని రవిబాబుకు మాత్రమే తెలుసు’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక న్యూఇయర్ కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌పై కూడా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఆవిరి ఐడియా అలా వచ్చింది
‘‘హారర్ జానర్లో రకాలు ఉన్నాయి. ‘ఆవిరి’ హారర్ మూవీ కాదు. మంచి ఫ్యామిలీ బేస్డ్ థ్రిల్లర్. గతంలో నేను చేసిన ‘అవును, అనసూయ’ చిత్రాలు కూడా థ్రిల్లర్ మూవీసే. హారర్ కాదు. ప్రేక్షకులను భయపెడితే థ్రిల్ ఫీల్ అవుతారని నేను అనుకోను’’ అని దర్శక–నిర్మాత, రచయిత రవిబాబు అన్నారు. నేహా చౌహాన్, రవిబాబు, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆవిరి’. నవంబరు 1న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిబాబు చెప్పిన విశేషాలు. ► నేను, ‘దిల్’ రాజుగారు ఎప్పట్నుంచో మంచి మిత్రులం. ఆయన నిర్మించిన ‘బొమ్మరిల్లు’ నాకు చాలా ఇష్టం. మేం ఇద్దరం ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ‘ఆవిరి’ సినిమాతో కుదిరింది. ఈ సినిమా తీయడానికి ముందు ‘దిల్’ రాజుగారికి కథ చెప్పాను. సినిమా పూర్తయ్యాక చూపిస్తే, బాగుందన్నారు. నేను ఎవరితో సినిమా తీసినా ఫస్ట్ కాపీ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకుంటాను. ► ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో నెక్ట్స్ ఏ చిత్రం చేయాలి? అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో ఓ స్పిరిట్ ఉందన్న వార్తలు చదివాను. ఈ ఐడియాకు కొన్ని కల్పిత అంశాలు జోడించి ‘ఆవిరి’ కథ రాసుకున్నాను. ‘అదుగో’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని సినిమాల్లో నటించలేకపోయా. ‘సాహో’ వదులుకున్నాను. మళ్లీ నటుడిగా బిజీ అవుతా. ► భారీ బడ్జెట్ సినిమాలు తీయడం కంటే కొత్త ఐడియాలతో ప్రేక్షకుల మెప్పు పొందడమే గొప్పగా భావిస్తాను. ఇప్పటివరకు నేను ప్రయత్నించిన జానర్లు ఎవరూ ప్రయత్నించి ఉండరు. ∙నా దగ్గర నాలుగైదు ఐడియాలు ఉన్నాయి. వాటిలో ఓ ముసలాయన పాత్ర ఆధారంగా ఓ కథ ఉంది. అక్కినేని నాగేశ్వరరావుగారు బతికి ఉండి ఉంటే ఆయన్ను ఈ క్యారెక్టర్ చేయమని రిక్వెస్ట్ చేసేవాడిని. -
‘సూపర్ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు
సినీ అభిమానులకు దీపావళి పండుగు ఒక రోజు ముందే వచ్చేసింది. దీపావళి కానుకగా పలు చిత్రాలు, క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు. టెన్ థౌసెండ్ వాలా పేల్చితే కుర్రకారు ఏ రేంజ్లో ఎగ్జైట్మెంట్కు గురవుతారో.. శనివారం ‘సరిలేరు నీకెవ్వరు’లో భారతిగా కనిపించనున్న విజయశాంతి ఫస్ట్‌లుక్ చూసి అంతకుమించి ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఇక విజేత ఫలితం తర్వాత మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ ఇంట్రస్టెంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ‘సూపర్ మచ్చి’నే టైటిల్‌గా ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. జోరు వానలో చిరునవ్వులు చిందిస్తూ నయా లుక్‌లో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘తూనీగ తూనీగ’ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్గా నటిస్తోంది. Machis.... it is #SuperMachi Title & First look! pic.twitter.com/W3Uml0TKM9 — Kalyaan Dhev (@IamKalyaanDhev) October 26, 2019 ఆది పినిశెట్టి కథానాయకుడిగా కొత్త డైరెక్టర్ పృథ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా దీపావళి కానుకగా చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. నో కట్.. రిలీజ్ డేట్ ఫిక్స్ రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా దీపావళి కానుకగా చిత్ర రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 1న థియోటర్లో కలుద్దామంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్ర టైటిల్, టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చుకోవడంతో ‘ఆవిరి’ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘కనితన్’ సినిమాను ‘అర్జున్ సురవరం’ గా రిమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు. నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు ‘అర్జున్ సురవరం’రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. -
‘ఆవిరి’పై సూపర్‌స్టార్ కామెంట్స్
ఈ మధ్య మన హీరోలు టాలీవుడ్లో వస్తున్న మంచి చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలు వచ్చిన సమయంలో.. పెద్ద హీరోలు వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. టీజర్, ట్రైలర్స్ విడుదలైన సమయంలో.. వారికి నచ్చితే వాటిని ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. తాజాగా ఆవిరి సినిమాపై సూపర్‌స్టార్ మహేష్ బాబు కామెంట్ చేశారు. రవిబాబు తనదైన శైలిలో మరో హారర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాడు. సినిమా టైటిల్స్‌తోనే ఆసక్తిని రేకెత్తించే రవిబాబు.. ఈసారి ఆవిరి అనే చిత్రంతో మనముందుకు రానున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చూసిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అన్ని సినిమాల్లోకెల్లా హారర్ జానర్లో వచ్చే వి ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు మాష్టర్.. అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఆవిరి’చిత్ర బృందాన్ని, దర్శకుడు రవిని ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ విష్ చేశాడు. -
అతిథే ఆవిరి అయితే?
‘‘మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక ఆత్మ అతిథిగా మీతో పాటే ఉంటే? ఆ అతిథే ఆవిరైతే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. ‘దిల్’ రాజు సమర్పణలో రవిబాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. శనివారం ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. టీజర్‌లోని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. రవిబాబు గత చిత్రాల్లానే భినంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, సంగీతం: వైది. -
భయపెట్టే ఆవిరి
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సంద ర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్. ఈ రెండు జోనర్స్లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకునితో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆవిరి’ ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు. రవిబాబు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుతో ఓ సినిమా చేయాలని 15 సంవత్సరాలుగా అనుకుంటున్నా కుదరలేదు కానీ, ఇప్పుడు కుదిరింది. ‘ఆవిరి’ సినిమాకు ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: వైధి. -
దిల్ రాజు బ్యానర్లో ‘అల్లరి’ దర్శకుడు
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తున్నాడు. ఒకవైపు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల చిత్రాలను నిర్మిస్తూనే మరో వైపు రాజ్ తరుణ్ లాంటి హీరోలతో చిన్న సినిమాలను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. . విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాను దిల్ రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు తెరకెక్కిస్తున్న రవిబాబు భారీ కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నారు. తాజాగా అంతా కొత్తవారితో ‘ఆవిరి’ అనే టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించాడు రవిబాబు. ఈసినిమాను దిల్ రాజు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్ బ్యాటరీ
సాక్షి, కొత్తగూడెం: ఓ చిన్నారి గొంతులో వాచ్ బ్యాటరీ ఇరుక్కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన తేజావత్ హర్యా కూతురు (10 నెలలు) శుక్రవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో పాడైపోయిన చేతి గడియారం బ్యాటరీని మింగగా అది గొంతులో ఇరుక్కుంది. శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు కొత్తగూడెంలోని సురక్ష ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ రవిబాబు నాయక్ ఎక్స్‌రే తీసి గొంతులో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేసి తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ రవిబాబు తెలిపారు.