రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం షూటర్. శ్రీ వెంకట సాయి బ్యానర్‌పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విభిన్న కథా కథనాలతో షూటర్‌ను తెరకెక్కించాము. రవి బాబు, ఆమని, ఎస్తార్, రాశి, సుమన్ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, సమీర్, జీవా నటించారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా ఉంటుంది అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment