ester noronha
-
షూటర్.. ఫస్ట్‌లుక్ చూశారా?
రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం షూటర్. శ్రీ వెంకట సాయి బ్యానర్‌పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారుఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విభిన్న కథా కథనాలతో షూటర్‌ను తెరకెక్కించాము. రవి బాబు, ఆమని, ఎస్తార్, రాశి, సుమన్ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో అన్నపూర్ణమ్మ, సత్యప్రకాష్, సమీర్, జీవా నటించారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా ఉంటుంది అన్నారు. -
#EsterNoronha : చీరకట్టులో హాట్ ఫోజులతో ఎస్తర్ నోరాన్హా.. (ఫొటోలు)
-
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
కన్నడలో పలు సినిమాల్లో నటించి ఆపై తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్ కాలనీ,డెవిల్,టనెంట్ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో కూడా మెప్పించిన ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపింది.టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్‌ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ తన గ్లామర్‌తో కుర్రకారును అదరగొట్టింది. రెక్కి, సంస్కార్ కాలనీ చిత్రాలలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నారు. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. రెండో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
‘మాయ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Ester Noronha: అదిరే అందాలతో కవ్విస్తోన్న ఎస్టర్ నోరోన్హా లేటెస్ట్ ఫొటోలు
-
ఐరావతం మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
తప్పుగా చిత్రీకరించాడు, యాసిడ్ పోస్తానని బెదిరించాడు : నోయెల్ మాజీ భార్య
'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్నానంటోంది ఎస్తర్. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆమె మరోసారి నోయెల్‌పై కామెంట్స్ చేసింది. అతనితో విడిపోయాక నాపై నెగిటివ్ ప్రచారం చేశాడు. విడాకుల తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నోయెల్ ఆ ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అప్పుడు అర్థమయ్యింది. నేనేదే తప్పు చేసినట్లుగా చిత్రీకరించాడు. దీంతో సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఒకతను అయితే నువ్వు హైదరాబాద్‌కి వస్తే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. మంచితనం అనే ముసుగులో నోయెల్ సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. కానీ నిజం ఏంటన్నది నాకు తెలుసు కదా.. పెళ్లయిన 16రోజులకే అతని నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే విడాకులు తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చొంది. -
అదేంటి.. నేను బాగా లేనప్పుడు అందరికీ బాగా కనిపిస్తాను: నటి ఎస్తేర్
-
ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను : హీరోయిన్
Noel Ex Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో కనిపించినా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’ మూవీలో నటించింది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎస్తర్ కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'ఇండస్ట్రీలో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా చూశాను. సినిమా ఆఫర్లతో పాటు ఈ ఆఫర్లు కూడా వచ్చేవి.. వాళ్లని ఇంప్రెస్ చేయమని వీళ్లని ఇంప్రెస్ చేయమని అనేవాళ్లు. ఆఫర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ సోకాల్డ్ హీరోయిన్స్ చాట్స్ స్క్రీన్ షాట్స్ కూడా నేను చూశాను. కెరీర్ కోసం ఏదైనా చేస్తాం అంటారు. అలా ఆడవాళ్లే స్వయంగా ఆఫర్స్ ఇవ్వడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది. క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను' అని చెప్పుకొచ్చింది. -
బోల్డ్ కంటెంట్ అని వాళ్లు సినిమా చేయలేదు: డైరెక్టర్
‘‘సినిమా బలమైన మీడియం. రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులైనా ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమా ఆ సంకల్పంతో చేసినదే. ‘69 సంస్కార్ కాలనీ’ కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది’’ అన్నారు సునీల్‌కుమార్ రెడ్డి. ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, సమాజంలో జరుగుతున్న వింత పోకడలను చెప్పే సినిమా ఇది. ఓ టీనేజ్ కుర్రాడికి, పెళ్లయిన అమ్మాయికి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమకథ. వారి బంధానికి అనుకూలించిన కారణాలు, వాటి వల్ల వచ్చే సమస్యలను చూపించాం. పరిణతి చెందిన ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. వైశాలి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసినా కుదరలేదు. కొందరు బోల్డ్ కంటెంట్ అని చేయలేదు. 33 సినిమాలు చేసిన ఎస్తేర్ కూడా ఆడిషన్ ఇచ్చింది. తను క్యారెక్టర్‌కి బాగా సరిపోతుందని తీసుకున్నాం. అజయ్‌గారు ఎస్తేర్ భర్త పాత్ర చేశారు’’ అన్నారు. జూలైలో వెల్కమ్ టు తీహార్ కాలేజ్: ‘‘మా నిర్మాత బాపిరాజుగారు నా సినిమాలన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ తర్వాత నా ‘రొమాంటిక్ క్రిమినల్స్, 69 సంస్కార్ కాలనీ’ చిత్రాలు నిర్మించారు. నా దర్శకత్వంలో డాక్టర్ ఎల్ఎన్ రావు, యక్కలి రవీంద్ర బాబు నిర్మించిన ‘వెల్కమ్ టు తీహార్ కాలేజ్’ చిత్రం జూలైలో విడుదల కానుంది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా చేస్తున్న ‘మా నాన్న నక్సలైట్’ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. -
చీరకట్టులో చూడముచ్ఛటగా ఎస్తేర్ (ఫోటోలు)
-
Ester Noronha: ఆ పాత్ర చేయడం గర్వంగా ఉంది
‘‘69 సంస్కార్ కాలనీ’ కథ బాగా నచ్చింది. వైశాలి (ఎస్తర్ పాత్ర పేరు) అనే ఒక సాధారణ గృహిణి జీవితంలో ఎక్స్ట్రార్డినరీ లైఫ్ స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది? తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథ. వైశాలి లాంటి బలమైన పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అని ఎస్తర్ నోరోన్హా అన్నారు. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎస్తర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ సింగర్‌గా ప్రారంభమయింది. ‘69 సంస్కార్ కాలనీ’ చిత్రంలో ‘రా రా..’ అనే పాట పాడాను. ఒక వేడుకలో కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌గారు నన్ను చూసి ‘సినిమాలో నటిస్తారా?’ అని అడిగారు. హిందీలో మూడు సినిమాలు చేశాను. తర్వాత డైరెక్టర్ తేజగారు తెలుగులో ‘1000 అబద్ధాలు’ సినిమాకి హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ‘69 సంస్కార్ కాలనీ’ సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమా. తెలుగులో నేను చేసిన ‘ఐరావతం’ రిలీజ్‌కి రెడీ అయింది. జీ 5కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ‘రుద్ర’ చిత్రం షూటింగ్లో ఉంది. మూడు భాషల్లో రూపొందుతున్న ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. చదవండి: (నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా) -
నోయల్‌తో విడాకుల తర్వాత రెట్టింపు సంతోషంగా ఉన్నా: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత 'గరం'లో ఓ సాంగ్, 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. చదవండి: Manchu Family: ఆ పోస్టులు డిలీట్ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’ మూవీలో నటించింది. మార్చి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎస్తర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. అలాగే నోయల్‌తో విడాకులపై కూడా స్పందించింది. విడాకుల అనంతరం రెట్టింపు సంతోషంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విడాకుల సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఎప్పుడైతే అన్నింటికీ సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు ఫ్రీ అయ్యా. ఎందుకంటే దీనిపై నా ఫ్యామిలీకి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలని భయపడ్డాను. కానీ ఎప్పుడైతే వారికి తెలిసిందో నా తల్లిదండ్రులు కూడా నాకు అండగా నిలబడ్డారు. దీంతో నాకు రెట్టింపు ధైర్యం, ఎనర్జీ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది ఎస్తర్. చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్ ఇక ‘ఎక్కడో బయటి వ్యక్తులు విడాకులు తీసుకున్నారనే వార్తలు వినడమే కానీ ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను ఆ పరిస్థితికి వస్తానని ఊహించుకోలేదు. మా కుటుంబంలో కూడా ఇలాంటివి లేవు. అలాంటి పరిస్థితుల్లో విడాకుల నిర్ణయంతో సతమతమయ్యాను. కానీ ఎప్పుడైతే విడాకుల పోస్ట్ షేర్ చేశానో కంటిన్యూస్‌గా నా ఫోన్ రింగ్ అయ్యింది. అందులో కొందరూ ఈమె కూడా జీవితం చెడగొడ్డుకుంది నాలాగే అంటూ సంతోషించారు.. మరికొందరెమో నీకు మేమున్నామంటూ ధైర్యమిచ్చారు’ అని చెప్పింది ఎస్తర్. -
కమిట్మెంట్ అడిగారు, నో చెప్తే కెరీర్ ఖతమన్నారు: నోయల్ మాజీ భార్య
Noyel EX Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాలో హీరోయిన్గా మెప్పించింది హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత 'గరం'లో ఓ సాంగ్, 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసిన ఆమెకు టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాలేదు. సింగర్ నోయల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆరు నెలల్లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తనకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఎస్తర్. 'ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ అడిగారు. వాటికి ఒప్పుకోకతే కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోతుంది, ముందుకు వెళ్లలేరని బెదిరించారు. క్యాస్టింగ్ కౌచ్ నేను ఎదుర్కొన్నాను. వాళ్లు ఇన్‌డైరెక్ట్‌గా అర్థం అయ్యేలా చెప్తారు. నీకంటే వెనుక వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావు, గతంలో చాలామందికి ఇలానే అయ్యింది అని! సినిమా అంటే నాకిష్టం కానీ అదే నా జీవితం కాదు. దానికోసం అంత దిగజారడం అవసరం లేదు. అందుకే నో చెప్పాను. ఛాన్స్ రావాలంటే ఇదొక్కటే దారి అంటే నాకవసరమే లేదు. ఇంతలో నాకు కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎవరో ఒక్కరిది తప్పు అని చెప్పలేం. వాళ్లు అడగకపోయినా ఆఫర్ చేసేవాళ్లున్నారు, ఆఫర్ చేసే వాళ్లు లేకపోయినా అడిగేవాళ్లు ఉన్నారు. నాకు కావాలా? వద్దా? అనేది మాత్రమే చెప్తాను. ఎవరినీ బ్లేమ్ చేయలేను' అని చెప్పుకొచ్చింది ఎస్తర్. -
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా?
యువ గాయకుడు, నటుడు, ‘బిగ్‌బాస్’ ఫేమ్ నోయల్ సేన్ ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి అందరికి తెలిసిందే. హీరోయిన్ ఎస్తర్‌తో ప్రేమలో పడిన నోయల్.. 2019లో ఆమెను వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే వారు విడిపోయారు. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఈ ఇద్దరూ కూడా తమ విడాకుల విషయాన్ని 2020 బహిర్గతం చేశారు. అనంతరం నోయల్ బిగ్‌బాస్ షోకి వెళ్లి, అనారోగ్యం కారణంగా అర్థాంతరంగా బయటకు వచ్చారు. అయితే బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నది కొద్ది రోజులే అయినా.. తనదైన ముద్ర వేసుకున్నాడు నోయల్. సినిమాల్లో చూసిన నోయల్‌కి.. బిగ్‌బాస్‌లో చూసిన నోయల్‌కి చాలా తేడా కనిపించింది. ఒకనొక దశలో మరీ ఇంత మంచితనం పనికి రాదని కూడా నోయల్‌పై కామెంట్లు చేశారు నెటిజన్లు. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన నోయల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఆయన చేసిన ట్వీట్లు, పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నోయల్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా’అంటూ ట్వీట్ చేశాడు నోయల్. దీంతో ఇది పక్కా పెళ్లి విషయమే అని నెటిజన్లు ఫిక్సయ్యారు. ‘మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే.. సినిమాకి సంబంధించిన అప్డేట్ అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకి ఆ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటో తెలియాలంటే.. నోయల్ చెప్పే వరకు ఆగాల్సిందే. Am Gonna Share An Exciting News Soonnnn!!!! Can't Wait For It!!! pic.twitter.com/XqjAofXZrA — Noel (@mrnoelsean) June 5, 2021 -
హీరోయిన్; పోర్న్ స్టార్‌గా నటి ఎస్తేర్..
1000 అబద్దాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి ఎస్తేర్ ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. సునీల్‌తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు చిత్రం ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. అనంతరం గరం, జయ జానకి నాయక వంటి ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళ, కన్నడ భాషలపు దృష్టి సారించింది. 2019లో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఎస్తేర్.. వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఏడాదికే అతనితో విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అయితే ఢిఫరెంట్ పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు ఎస్తేర్ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్ చెప్పిన మాట ప్రకారమే తాజాగా ఓ తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఇంతకముందెప్పుడూ చేయని బోల్డ్ క్యారెక్టర్‌ను ఎస్తేర్ పోషించనున్నారు. ‘హీరోయిన్’ అనే టైటిల్‌తో ఫోర్న్ స్టార్ కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో కనిపించనుది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఏస్తేర్ పోర్న్ స్టార్‌గా నటించనుంది. ‘ఉత్తర’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ తన రెండో ప్రయత్నంగా ‘‘హీరోయిన్’’ అనే సినిమాను రూపొందించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘ప్రపంచం కీర్తించే ఇండియా సాంప్రదాయం ముసుగులో మలినం ఉంది. సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది” అని అంటున్నారు దర్శకుడు ఎస్ఆర్ తిరుపతి. ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్తేర్ కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ సన్నాహాల్లో ఉన్నామని, త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎస్తేర్ కెరీర్లో ఈ సినిమా ఓ మలుపు తిరగనుందని అభిప్రాయపడుతున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. చూడండి: ఎస్తేర్ గ్లామర్ ఫొటోస్ -
యాక్టర్ నుంచి కలెక్టర్ అవ్వాలని...
సినిమా నటులు చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. నిజంగా కూడా కొందరు డాక్టర్ చదవాలనుకొని యాక్టర్‌గా వచ్చేసినవారు ఉన్నారు. కొందరైతే డాక్టర్లు అయిన తరువాత యాక్ట్లర్లు అయిన వారు కూడా ఉన్నారు. ఇది మరీ రొటీన్‌గా ఉందని అనుకుందో ఏమో,ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ యాక్టర్ అయిన తరువాత కలెక్టర్ కావాలని అనుకుంటోంది. ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? 1000 అబ్దాలు సినిమాతో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయమైన ఎస్తేర్ నరోన్హ. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే అట్టర్ ఫ్లాఫ్ కావడంతో ఈ అందాల బొమ్మ నీరసపడిపోయింది. ఫ్లాప్ చిత్రం తరువాత కూడా ఈ చిన్నదానికి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో అవకాశం లభించింది. మంచి దర్శకుడి చేతిలో పడింది. అయినా ఫలితంలేదు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ సునీల్ సరసన నటించింది. ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో తన దశ తిరుగుతుందని ఈ భామ భావించింది. ఇది కూడా నిరాశే మిగిల్సింది. టాలీవుడ్‌లోని అందరు హీరోలతో నటించాలనుకున్న ఈ అమ్మడికి నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఏంచేయాలో తోచలేదు. అదీగాక చర్చలు జరుగుతున్న చిత్రాలు కూడా వెనక్కుపోయాయి. తేజ, ఉదయభాస్కర్ వంటి దర్శకులు చిత్రాలలో నటించినప్పటికీ ఎస్తేర్ కు కలిసిరాలేదు. ఈ పరిస్థితులలో తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఆ కోరిక ఏంటని అనుకుంటున్నారా? కలెక్టర్ కావాలన్నది ఈ అందాల ముద్దుగుమ్మ కోరికట. అందుకే ఐఏఎస్ పూర్తి చేయాలని అనుకుంటోంది. నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో వదిలివేసిన పిజి కోర్సును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఎస్తేర్ నరోన్హ ఇంత తొందరగా మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల సినీవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. -
భీమవరం బుల్లోడు ప్లాటీనమ్ డిస్క్ ఫంక్షన్
-
భీమవరం బుల్లోడు మూవీ స్టిల్స్