‘‘సినిమా బలమైన మీడియం. రెండు గంటల సినిమా కనీసం రెండు రోజులైనా ఆలోచింపజేయాలి. నా ప్రతి సినిమా ఆ సంకల్పంతో చేసినదే. ‘69 సంస్కార్ కాలనీ’ కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది’’ అన్నారు సునీల్‌కుమార్ రెడ్డి. ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, సమాజంలో జరుగుతున్న వింత పోకడలను చెప్పే సినిమా ఇది.
ఓ టీనేజ్ కుర్రాడికి, పెళ్లయిన అమ్మాయికి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమకథ. వారి బంధానికి అనుకూలించిన కారణాలు, వాటి వల్ల వచ్చే సమస్యలను చూపించాం. పరిణతి చెందిన ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. వైశాలి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసినా కుదరలేదు. కొందరు బోల్డ్ కంటెంట్ అని చేయలేదు. 33 సినిమాలు చేసిన ఎస్తేర్ కూడా ఆడిషన్ ఇచ్చింది. తను క్యారెక్టర్‌కి బాగా సరిపోతుందని తీసుకున్నాం. అజయ్‌గారు ఎస్తేర్ భర్త పాత్ర చేశారు’’ అన్నారు.
జూలైలో వెల్‌కమ్ టు తీహార్ కాలేజ్: ‘‘మా నిర్మాత బాపిరాజుగారు నా సినిమాలన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ తర్వాత నా ‘రొమాంటిక్ క్రిమినల్స్, 69 సంస్కార్ కాలనీ’ చిత్రాలు నిర్మించారు. నా దర్శకత్వంలో డాక్టర్ ఎల్‌ఎన్ రావు, యక్కలి రవీంద్ర బాబు నిర్మించిన ‘వెల్‌కమ్ టు తీహార్ కాలేజ్’ చిత్రం జూలైలో విడుదల కానుంది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా చేస్తున్న ‘మా నాన్న నక్సలైట్’ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment