Noyel EX Wife Ester Noronha Latest Comments On Tollywood Casting Couch Details Inside - Sakshi
Sakshi News home page

Ester Noronha: కమిట్‌మెంట్‌ అడిగారు.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌ వ్యాఖ్యలు

Published Sat, Feb 19 2022 9:04 AM | Last Updated on Sat, Feb 19 2022 10:22 AM

Heroine Ester Noronha Comments On Casting Couch - Sakshi

Noyel EX Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాలో హీరోయిన్‌గా మెప్పించింది హీరోయిన్‌ ఎస్తర్‌ నోరోన్హ. ఆ తర్వాత 'గరం'లో ఓ సాంగ్‌, 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసిన ఆమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. సింగర్‌ నోయల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆరు నెలల్లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తనకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఎస్తర్‌. 

'ఆఫర్స్‌ రావాలంటే కమిట్‌మెంట్‌ అడిగారు. వాటికి ఒప్పుకోకతే కెరీర్‌ ఇక్కడితోనే ముగిసిపోతుంది, ముందుకు వెళ్లలేరని బెదిరించారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ నేను ఎదుర్కొన్నాను. వాళ్లు ఇన్‌డైరెక్ట్‌గా అర్థం అయ్యేలా చెప్తారు. నీకంటే వెనుక వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావు, గతంలో చాలామందికి ఇలానే అయ్యింది అని!

సినిమా అంటే నాకిష్టం కానీ అదే నా జీవితం కాదు. దానికోసం అంత దిగజారడం అవసరం లేదు. అందుకే నో చెప్పాను. ఛాన్స్‌ రావాలంటే ఇదొక్కటే దారి అంటే నాకవసరమే లేదు. ఇంతలో నాకు కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఎవరో ఒక్కరిది తప్పు అని చెప్పలేం. వాళ్లు అడగకపోయినా ఆఫర్‌ చేసేవాళ్లున్నారు, ఆఫర్‌ చేసే వాళ్లు లేకపోయినా అడిగేవాళ్లు ఉన్నారు. నాకు కావాలా? వద్దా? అనేది మాత్రమే చెప్తాను. ఎవరినీ బ్లేమ్‌ చేయలేను' అని చెప్పుకొచ్చింది ఎస్తర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement