అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎ‍స్తర్‌ | Ester Noronha Comments On Second Marriage | Sakshi
Sakshi News home page

అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎ‍స్తర్‌

Published Wed, May 15 2024 11:47 AM | Last Updated on Wed, May 15 2024 12:46 PM

Ester Noronha Comments On Second Marriage

కన్నడలో పలు సినిమాల్లో నటించి ఆపై తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఎ‍స్తర్‌ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్‌ కాలనీ,డెవిల్,టనెంట్‌ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో  ఐటెం సాంగ్స్‌లో కూడా మెప్పించిన ఎస్తర్‌ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపింది.

Ester Noronha And Noel

టాలీవుడ్‌ సింగర్‌, నటుడు నోయల్‌ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్‌.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్‌ తన గ్లామర్‌తో కుర్రకారును అదరగొట్టింది. రెక్కి, సంస్కార్‌ కాలనీ చిత్రాలలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో  తన పెళ్లి గురించి ఎస్తర్‌ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు.  నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నారు. 

Ester Noronha

అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్‌ చెప్పుకొచ్చింది.  రెండో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement