‘‘69 సంస్కార్ కాలనీ’ కథ బాగా నచ్చింది. వైశాలి (ఎస్తర్ పాత్ర పేరు) అనే ఒక సాధారణ గృహిణి జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది? తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథ. వైశాలి లాంటి బలమైన పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అని ఎస్తర్ నోరోన్హా అన్నారు. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఎస్తర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ సింగర్‌గా ప్రారంభమయింది. ‘69 సంస్కార్ కాలనీ’ చిత్రంలో ‘రా రా..’ అనే పాట పాడాను. ఒక వేడుకలో కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌గారు నన్ను చూసి ‘సినిమాలో నటిస్తారా?’ అని అడిగారు. హిందీలో మూడు సినిమాలు చేశాను. తర్వాత డైరెక్టర్ తేజగారు తెలుగులో ‘1000 అబద్ధాలు’ సినిమాకి హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక ‘69 సంస్కార్ కాలనీ’ సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమా. తెలుగులో నేను చేసిన ‘ఐరావతం’ రిలీజ్‌కి రెడీ అయింది. జీ 5కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ‘రుద్ర’ చిత్రం షూటింగ్‌లో ఉంది. మూడు భాషల్లో రూపొందుతున్న ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
చదవండి: (నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment