‘ఆవిరి’ ఫస్ట్ లుక్
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సంద ర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్. ఈ రెండు జోనర్స్‌లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.
అలాంటి ప్రతిభ ఉన్న దర్శకునితో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆవిరి’ ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు. రవిబాబు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుతో ఓ సినిమా చేయాలని 15 సంవత్సరాలుగా అనుకుంటున్నా కుదరలేదు కానీ, ఇప్పుడు కుదిరింది. ‘ఆవిరి’ సినిమాకు ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: వైధి.
Comments
Please login to add a commentAdd a comment