తప్పు చేస్తే తప్పించుకోలేరు.. | tappinchukoleru movie starts post productions | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే తప్పించుకోలేరు..

Published Thu, Apr 22 2021 6:07 AM | Last Updated on Thu, Apr 22 2021 7:51 AM

tappinchukoleru movie starts post productions - Sakshi

ఆదర్శ్, హరీష్, ట్వింకిల్‌ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘తప్పించుకోలేరు’. రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి) దర్శకత్వం వహించారు. రుద్రాపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి)–తలారి వినోద్‌ కుమార్‌ ముదిరాజ్‌– శ్రీనివాస్‌ మామిడాల–లలిత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

విలేకరుల సమావేశంలో తలారి వినోద్‌ కుమార్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ– ‘‘తప్పు చేస్తే తప్పించుకోలేరు అనేది చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రం విడుదల తర్వాత దర్శకుడు ఆర్‌.వి.జికి మంచి పేరు వస్తుంది. వి.ఎస్‌.పి. తెన్నేటి మాటలు–పాటలు, రాజేష్‌ రాజ్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఆర్‌.వి.జి దర్శకత్వంలోనే  మరో సినిమాకు శ్రీకారం చుట్టాం’’ అన్నారు.

చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌: చిట్టిబాబు చింపేశాడుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement