
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మా ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. మంగళవారం.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అనంతరం విష్ణు ప్రెస్‌మీట్ పెట్టి ప్రకాశ్ రాజ్ ఆరోపణలను ఖండిస్తూ మండిపడిన సంగతి తెలిసిందే.
చదవండి: లీగల్‌గానే మనిషికి రూ.500 ఇచ్చాను : మంచు విష్ణు
ఇలా ఎన్నికల వివాదం మరింత ముదురుతున్న తరుణంలో తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అసోసియేషన్ నడపడం మనకు చేత కాదా? ఎవరో వచ్చి నేర్పాలా? అంటూ ధ్వజమెత్తారు. అంతేగాక మన క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకే ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఇతర భాషల నుంచి నటులను తెస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.