దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు | Dil Raju Releasing Aviri Movie Directed By Ravi Babu | Sakshi
Sakshi News home page

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

Published Tue, Sep 10 2019 11:55 AM | Last Updated on Tue, Sep 10 2019 11:55 AM

Dil Raju Releasing Aviri Movie Directed By Ravi Babu - Sakshi

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌ రాజు క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తున్నాడు. ఒకవైపు మహేష్‌ బాబు లాంటి సూపర్‌ స్టార్‌ల చిత్రాలను నిర్మిస్తూనే మరో వైపు రాజ్‌ తరుణ్‌ లాంటి హీరోలతో చిన్న సినిమాలను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. .

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాను దిల్‌ రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు తెరకెక్కిస్తున్న రవిబాబు భారీ కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నారు. తాజాగా అంతా కొత్తవారితో ‘ఆవిరి’ అనే టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించాడు రవిబాబు. ఈసినిమాను దిల్‌ రాజు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement