
విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్‌ని ప్రకటించారాయన. అంతేకాదు.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు.
గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘‘ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని రవిబాబు తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment