దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘కాంత(Kantha)’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని ఓ లీడ్ రోల్ చేశారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ డాక్యుమెంటరీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్‌ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.
నటుడిగా దుల్కర్ పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కాంత’లోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘1950 నాటి మద్రాస్(చెన్నై) నేపథ్యంలో ‘కాంత’ ఉంటుంది. అప్పటి మానవీయ సంబంధాలు, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో ఈ మూవీ కొత్తగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాను.
Comments
Please login to add a commentAdd a comment