‘అదుగో’ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు! | Ravibabu Adhugo Team Different Promotions | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 9:59 AM | Last Updated on Sat, Nov 3 2018 9:59 AM

Ravibabu Adhugo Team Different Promotions - Sakshi

పంది పిల్ల ప్రధాన పాత్రలో ద‌ర్శకుడు ర‌విబాబు తెర‌కెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్రశాంత్‌ విహారి స్వరాలు అందించారు.  ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు.

ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్ లో చూపిస్తుండడం విశేషం..  కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. 

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలుగగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... ‘ఈ సినిమా కి సహకరించిన అందరికి చాలా థాంక్స్. ఈ సినిమా తోనే చాల మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. దీపావళి రోజు రిలీజ్ కావడానికి కారణం ఆరోజు సినిమా తప్పకుండ చూస్తారని ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.. 

దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. ‘నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాలా థాంక్స్.ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేసానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కానీ మా సినిమా కి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరు లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు.  ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమా ని తప్పక చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement