Adhugo
-
‘అదుగో’ మూవీ రివ్యూ
టైటిల్ : అదుగో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అభిషేక్ వర్మ, నభా నటేష్, రవిబాబు, సాత్విక్ వర్మ సంగీతం : ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం : ఎస్ ఎస్ రాజేష్ దర్శకత్వం : రవిబాబు నిర్మాత : రవిబాబు, సురేష్ బాబు డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. రాజమౌళి ఈగ లాగే.. రవిబాబు పంది కూడా ప్రేక్షకులను మెప్పించిందా..? కథ : దుర్గ అనే రౌడీ రాజధాని ప్రాంతంలోని రైతునుంచి 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మి కోట్లు గడించాలని ప్లాన్ చేస్తాడు. కానీ దుర్గ దగ్గర పని చేసే వ్యక్తి ఆ పొలాల డాక్యుమెంట్స్ కాపీ ఉన్న మెమరీ చిప్‌ను శక్తి అనే మరో రౌడీ మనుషులకు ఇస్తాడు. ఆ చిప్‌ను శక్తి దగ్గరకు తీసుకెళ్లే సమయంలో చంటి పెంచుకునే బంటి అనే పందిపిల్ల దాన్ని మింగేస్తుంది. శంకర్, గంగరాజు హైదరాబాద్‌లో ఉండే రౌడీలు. యానిమల్ రేసింగ్లలో బెట్టింగ్‌లు పెడుతూ దందాలు చేస్తుంటారు. త్వరలో జరిగే ఓ రేసింగ్ కోసం ఓ పందిపిల్ల అవసరం పడుతుంది. పొట్ట మీద మూడు మచ్చల ఉన్న పందిపిల్ల అయితే రేసులో తప్పకుండా గెలుస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పటంతో అలాంటి పందిపిల్లను వెతికే పనిలో పడతారు. అలా నలుగురు గూండాలు బంటీ(పందిపిల్ల) వెంటపడటం మొదలవుతుంది. మరి ఈ రౌడీల మధ్య అభి, రాజీ అనే ప్రేమ జంట ఎలా చిక్కుకుంది.? రౌడీల చేతుల్లో పడ్డ బంటి తిరిగి చంటి దగ్గరకు ఎలా వచ్చింది.? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : అదుగో పూర్తిగా రవిబాబు మార్క్ సినిమా. టైటిల్స్ దగ్గరనుంచే రవిబాబు తనదైన క్రియేటివిటీతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడు వేరు వేరు కథలను ఓ పందిపిల్లకు ముడిపెడుతూ రవిబాబు తయారు చేసుకున్న కథ బాగుంది. కానీ కథనంలో ఏమాత్రం కొత్త దనం లేకపోవటం, రవిబాబు గత చిత్రాల ఛాయలు కనిపించటం కాస్త నిరాశకలిగిస్తుంది. లైవ్ 3డీ యానిమేషన్లో చూపించిన పందిపిల్ల క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సహజంగా అనిపించదు. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో వీలైనంత క్వాలిటీ గ్రాఫిక్స్ ఇచ్చినప్పటికీ సగటు ప్రేక్షకుడికి కూడ పందిపిల్ల గ్రాఫిక్స్ అన్న విషయం అర్ధమైపోతుంది. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ప్రధానంగా కామెడీ నమ్ముకొని తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పండినా... చాలా చోట్ల ఇబ్బంది కరంగా అనిపిస్తుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఎస్ ఎస్ రాజేష్ అందించిన నేపథ్య సంగీతం. ముఖ్యంగా చేజింగ్ సీన్స్‌లో విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్లాంటి విషయాల్లో కూడా రవిబాబు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కాస్త అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో కనిపించిన చాలా మంది నటులు ఈ సినిమాలోనూ రిపీట్ అయ్యారు. హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన అభిషేక్, నభాల పాత్రలు తెరమీద కనిపించేది కొద్ది సేపే. ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశారు. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విజయ్ సాయి, అజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్లస్ పాయింట్స్ : లైవ్ 3డీ యానిమేషన్ చేజింగ్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : క్యారెక్టరైజేషన్స్ కామెడీ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆ కష్టం అలవాటైపోయింది
‘‘అదుగో’ సినిమా కోసం రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా. ఈ గ్యాప్‌లో చాలా అవకాశాలొచ్చినా చేయలేకపోయా. ప్రస్తుతం నన్ను అందరూ మరచిపోయారని కొందరు అంటున్నారు. ‘అదుగో’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేశా’’ అని రవిబాబు అన్నారు. పంది పిల్ల (బంటి) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు చేశారు. నిర్మాత సురేశ్‌బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. రవిబాబు చెప్పిన విశేషాలు. ► డిస్నీ సినిమాల స్ఫూర్తితో ఓ జంతువు లీడ్ రోల్లో సినిమా తీయాలనిపించింది. హాలీవుడ్ మూవీ ‘ప్లా నెట్ ఆఫ్ ఆది ఏప్స్’ సినిమా ఇష్టం. బడ్జెట్ దృష్ట్యా కోతులతో తెలుగులో సినిమా చేయడం సాధ్యం కాదు. ఏనుగు, ఈగ, ఎలుక, జీబ్రాతో పాటు అన్ని జంతువులతో మనవాళ్లు సినిమాలు చేశారు. పందితో హాలీవుడ్లో సినిమాలొచ్చాయి. కానీ, ఇండియాలో రాలేదు. అందుకే పందిని కథా వస్తువుగా ఎంచుకున్నా. ► పెద్దల మాట వినకుండా బయటి ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ పందిపిల్లకు ఒక రోజులో ఎదురైన సంఘటనలను వినోదాత్మకంగా చూపిం చాం. ప్రతి పాత్ర వినోదం పంచుతుంది. కమర్షియల్‌గా ‘అదుగో’ రిస్క్‌తో కూడుకున్నది. ప్రతిసారి కొత్త కథతో తొలి సినిమాలా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకురావడా నికి శ్రమిస్తుండటంతో ఆ కష్టం అలవాటైపోయింది. ► హాలీవుడ్లో జంతువులపై తీసే సినిమాలకు స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. మన వద్ద ఆ సంస్కృతి లేదు. పంది పాత్రకు హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తే ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తుందేమో? రాజేంద్రప్రసాద్‌గారిని అడిగితే బాగోదేమో అన్నారు. ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్ అవుతుందని ఒప్పించా. ► ‘అదుగో’ గ్రాఫిక్స్‌తో తీసిన సినిమాలా అనిపించదు. ప్రస్తుతం చాలా కథలు సిద్ధం చేసుకున్నా. ‘అదుగో’ సినిమాకి ప్రేక్షకుల స్పందన చూసి, మరో నాలుగు భాగాలు చేసే ఆలోచన ఉంది. -
అందుకే దీపావళికి వస్తున్నాం
‘‘అదుగో’ సినిమాకి సహకరించిన అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాతోనే చాలా మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. మా సినిమాని దీపావళి రోజు విడుదల చేయడానికి కారణం ఉంది. ఆరోజైతే సినిమా తప్పకుండా చూస్తారని వస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేశ్ బాబు. పంది పిల్ల(బంటి) ప్రధాన పాత్రలో, అభిషేక్, నభ నటేష్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. సురేశ్ బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్లో ఈ సినిమాని చూపిస్తుండటం విశేషం. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సినిమాలో నటించిన పందిపిల్లతో చిత్ర యూనిట్ అంతా కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పాదయాత్ర చేశారు. రవి బాబు మాట్లాడుతూ– ‘‘ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. మా సినిమాకి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. అందుకే ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమాని తప్పక చూడండి.. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళికి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి’’ అన్నారు. ‘‘నటుడిగా నా ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’. నా 101 వ సినిమా ‘అదుగో’. ‘నచ్చావులే’ సినిమా లాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నటుడు కాశీ విశ్వనాథ్, హీరో అభిషేక్ వర్మ, చిత్ర బృందం పాల్గొన్నారు. -
‘అదుగో’ ప్రమోషన్
-
‘అదుగో’ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు!
పంది పిల్ల ప్రధాన పాత్రలో దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్రశాంత్ విహారి స్వరాలు అందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ లో చూపిస్తుండడం విశేషం.. కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలుగగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... ‘ఈ సినిమా కి సహకరించిన అందరికి చాలా థాంక్స్. ఈ సినిమా తోనే చాల మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. దీపావళి రోజు రిలీజ్ కావడానికి కారణం ఆరోజు సినిమా తప్పకుండ చూస్తారని ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.. దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. ‘నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాలా థాంక్స్.ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేసానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కానీ మా సినిమా కి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరు లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమా ని తప్పక చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. -
అదుగో నటకిరీటి వాయిస్
వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకంపై స్వీయదర్శకత్వంలో రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకొని దీపావళి పండగ కానుకగా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ వాయిస్ ఓవర్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘బంటిగా పందిపిల్ల అందరి మనసులనూ దోచేస్తుంది. తెరపై నిజమైన పంది పిల్లనే చూస్తున్నామనే ఫీల్‌ని ప్రేక్షకులకు కలిగించడం కోసం లైవ్ యాక్షన్ త్రీడి యానిమేషన్ టెక్నాలజీని వాడాం. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆడియన్స్‌కి ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని కూడా తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంతి విహారి స్వరకర్త. -
పందిపిల్లకు రాజేంద్ర ప్రసాద్ వాయిస్
అదుగో.. రవిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా అదుగో టీంతో జత కలిసారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీవాళి సందర్భంగా అదుగో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. పూర్తి ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీలకపాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకే రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఈయన వాయిస్ ఓవర్ అదుగో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. థియేటర్స్ లో ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన అదుగో ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రవిబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా కనిపించడానికి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ టెక్నాలజీని వాడుకున్నారు. తెలుగులో ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాలజీ వాడుకోవడం ఇదే తొలిసారి. అభిషేక్ వర్మ, నభానటాష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థపై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
పూర్ణ.. బంటి... ఓ పాట
‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్ రోల్లో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రశాంత్ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి. -
'అదిగో' ట్రైలర్ లాంచ్...
-
అదుగో సినిమా ట్రైలర్ రిలీజ్
-
‘మనిషిలా మళ్లీ మళ్లీ చెప్పించుకుంటావా?’
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి రవిబాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వర్మ, నభా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్లో సినిమాలో ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. అలాగే బంటీ (పందిపిల్ల) చేసే సాహసాలు, కామెడీని కూడా చూపించారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో అదుగో పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఇతర భారతీయ భాషలన్నింటిలో బంటీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
‘అదుగో’ బంటీని పరిచయం చేశారు..!
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి రవిబాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వర్మ, నభా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. సినిమాలో కీలకమైన బంటీ(పందిపిల్ల)ని ఈ టీజర్లో పరిచయం చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. -
అదుగో సినిమా టీజర్ విడుదల
-
‘అదుగో’ ఫస్ట్ లుక్
రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో ఓ పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని పరిచయం చేసారు దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అందర్నీ అలరిస్తుంది. రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా అదుగో. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్న పిల్లలను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. -
దసరాకి అదుగో
రవిబాబు నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో ఓ పందిపిల్ల కీలక పాత్రలో నటించడం విశేషం. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్లో రవిబాబు నిర్మించిన ఈ సినిమా దసరాకి రానుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘కుటుంబ ప్రేక్షకులు, పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపించబోతున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ కాన్సెప్ట్ కావడంతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా మిగిలిన భాషల్లో ‘బంటి’ పేరుతో విడుదలవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా సెలవుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. అభిషేక్ వర్మ, నభా, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: పశ్రాంత్ ఆర్. విహార్, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
‘అదుగో’ రిలీజ్ అవుతోంది!
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. -
రవిబాబు పందిపిల్లతో ఫిట్నెస్
-
అదుగో : పందిపిల్లతో ఫిట్నెస్ చాలెంజ్
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతోంది. అయితే సినిమా మీద ఆసక్తి కొనసాగించేందుకు రవిబాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా మరోసారి అదే తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిట్నెస్ చాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సందర్భాన్ని తన సినిమా ప్రచారానికి వినియోగించుకున్న రవిబాబు. బంటీ(పందిపిల్ల)తో కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని పుల్అప్స్ చేశారు. ‘ బంటి ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయర’ని ప్రశ్నించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
పందిపిల్ల పళ్లుతోముతున్నాడు..!
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు అవుతోంది. ఈ సందర్భంగా రవిబాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్ సమయంలో బంటీ (పంది పిల్ల)ని దర్శకుడు ఎలా రెడీ చేశారో ఫన్నీగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రవిబాబు పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. -
పంది పిల్లని ఎలా రెడీ చేశారో ...ఫన్నీ వీడియో
-
అదుగో... పంది పిల్ల
రవిబాబు ఎప్పుడు సినిమా ఆరంభిస్తారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. సెలైంట్‌గా మొదలుపెట్టేసి, షూటింగ్ పూర్తి చేసేస్తారు. మరో నెల, రెండు నెలల్లో విడుదల అనగా ఆ సినిమా వివరాలు బయటపెడతారు. ఇప్పుడు ఆయన పందిపిల్ల ముఖ్యపాత్రలో ఓ సినిమా చేశారు. ఇందులో అభిషేక్, నాభ ప్రధాన పాత్రధారులు. ‘ఏనుగు’, ‘కోతి’, ‘ఈగ’లు మనల్ని అలరించాయి. వెండితెర పైన వరాహం ముఖ్యపాత్రలో కనిపించనుండటం ఇదే ప్రథమం. అందుకే టాలీవుడ్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘అదుగో’ అనే టైటిల్ ఖరారు చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘ఇప్పటి వరకూ ఎవరూ తీయని వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల వివరాలు తెలియజేస్తాం’’ అని నిర్మాత పేర్కొన్నారు.