పందిపిల్ల పళ్లుతోముతున్నాడు..! | Ravi Babu Gets Piglet Ready For Shooting | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 11:20 AM | Last Updated on Tue, May 29 2018 12:24 PM

Ravi Babu Gets Piglet Ready For Shooting - Sakshi

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు అవుతోంది. ఈ సందర్భంగా రవిబాబు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

షూటింగ్ సమయంలో బంటీ (పంది పిల్ల)ని దర్శకుడు ఎలా రెడీ చేశారో ఫన్నీగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రవిబాబు పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement