
సాక్షి, నల్గొండ : తెలంగాణలోనే మంచి మనిషి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఓడిపోతే అంతుకు మించి దురదృష్టం మరోటి ఉండదని దర్శకుడు రవిబాబు అన్నారు. ఆయనకు మద్దతుగా నల్గొండ ప్రచార సభలో పాల్గొన్న రవిబాబు పైవిధంగా అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఈ గ్రామంలోనే కాదు తెలంగాణలోనే మంచి మనిషి అని ఆయనకు ఓటేసి గెలిపించండని ప్రజలను అభ్యర్థించారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో ఇరవై ఏళ్ల నుంచి అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారని.. ఆయన అసలు ముఖ్యమంత్రేనా అనే అనుమానం వస్తుందన్నారు. వేలకోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి నిధులు ఎందుకు విడుదల చేయలేదో తన కొడుకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను అడిగి తెలుసుకోమన్నారు. నల్గొండ నుంచి పోటీచేద్దామనుకున్న కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసి పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవాలని కోట్ల రూపాయలు గ్రామాల్లో పంచుతున్నారని.. నల్గొండ ఆత్మగౌరవం గెలుస్తుందా? దోపిడీ చేసిన సొమ్ము గెలుస్తుందో డిసెంబర్ 11న తెలుస్తుందన్నారు. ఈ పోరాటం తనకు టీఆర్‌ఎస్ అభ్యర్థి మధ్య కాదని.. కేసీఆర్ దోపిడీకి నల్గొండ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment