పోరాటాల ఖిల్లా... ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ. తెలంగాణలో నల్గొండ జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. అలాంటి జిల్లాలో విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదుగుతూ అందరి నోటా వెంకన్నగా పిలిపించుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సొంత పార్టీ నాయకత్వంపైన అయినా సరే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారు. నల్గొండ రాజకీయాల్లో ఇప్పుడు వెంకన్న తనదైన ముద్రను వేసుకున్నారు. తొలి నుంచి గమనిస్తే విభిన్న రాజకీయాలకు, అందులోనూ కమ్యూనిస్టుల కంచుకోట నల్గొండ నియోజకవర్గంలో నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు.
1994 వరకు కమ్యూనిస్టులదే నల్గొండ నియోజకవర్గం, కానీ 1999 నుంచి పరిస్థితి మారింది. అప్పటినుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తూవస్తున్నారు. 1999 నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే పట్టం కట్టారు. అప్పటి నుంచి ఈ సెగ్మెంట్‌లో ఆయనదే హావా. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గం ప్రతీ ఓటరుతో సత్సంబంధాలు ఉండటం ఆయనకు తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిందని సన్నిహితులు చెబుతుంటారు. వెంకన్న విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉత్సాహాంగా పాల్గొనేవారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయటం ఆయనకు కలిసొచ్చిన అంశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐ.టీ మంత్రిగా ఛక్రం తిప్పారు. ప్రస్తుతం ఐదవసారి ఇదే నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రతీక్ ఫౌండేషన్
ఎదిగిన కుమారుడు ప్రమాదంలో మరణించడం వెంకట్ రెడ్డికి జీవితంలో మరిచిపోలేని బాధను విగిల్చింది. అలాంటి బాధను మరెవరూ అనుభవించరాదని ఆ తర్వాత కాలంలో ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. 2012 ప్రతీక్ రెడ్డి మరణానంతరం కోమటి రెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలగా మార్చారు. 3.5 కోట్లను వెచ్చించి బాలికల వొకేష్‌నల్ జూనియర్ కళాశాలను పుననర్నిర్మాన పనులు చేపట్టారు. ఫౌండేషన్ తరఫున ప్రతిఏటా టాపర్స్‌కు బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకాలు, జాబ్ మేళాలు, నిరుద్యోగులకు ఉపాది కల్పన, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య, రక్తదాన సేవలనందించటం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపడుతున్నారు.
రాజకీయ నేపథ్యం :
► తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
► తెలంగాణ కోసం 2010 మరియు 2011 అక్టొబర్‌లో రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా
► 1999 లో ఎన్నికవ్వగానే ఉదయ సముద్రం ప్రాజెక్టుకు పూనుకున్నారు
► 1999, 2004, 2009, మరియు 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ కేబినేట్ లో ఐటీ మంత్రిగా పనిచేశారు.
కుటుంబం నేపథ్యం :
నియోజకవర్గం : నల్గొండ అసెంబ్లీ
తల్లిదండ్రులు : పాపి రెడ్డి (రైతు)
పుట్టిన తేది : 23 మే 1965 బ్రాహ్మాణ వెల్లెమ్లా గ్రామం, నార్కెట్‌పల్లి, నల్గొండ జిల్లా
కుటుంబం : ఒక కూతురు, కుమారుడు (2011లో హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కుమారుడు ప్రతీక్ రెడ్డి చనిపోయాడు)
సోదరుడు : కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, (మాజీ ఎంపీ,ప్రస్తుతం మునుగోడు బరిలో ఉన్నారు)
ఉద్యోగం : నల్గొండ ఎమ్మెల్యే
నివాసం : నల్గొండ, తెలంగాణ
చదువు : 1986 లో బీఈ - సీబీఐటి, హైదరాబాద్.
- జీ. రేణుక
Comments
Please login to add a commentAdd a comment