రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ ఆ రంగంలో అడుగుపెట్టాక తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తండ్రి, భర్త రాజకీయాల్లో అరితేరినవారే అయినప్పటికీ కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకోగలిగారు. గద్వాల సంస్థానం నిజాం పాలనలో రాజకీయంగా ప్రత్యేక స్థానం పొందింది. నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి గద్వాల కోటపై డీకే కుటుంబం తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది. అక్కడి నుంచి అరుణ వరుసగా మూడుసార్లు విజయం సాధించి నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఆమె మహబూబ్‌నగర్ రాజకీయాలలో ఫైర్‌బ్రాండ్‌గా నిలుస్తున్నారు. ఆమెను అభిమానించే వారు జేజమ్మ అని పిలుచుకుంటారు. ఆమె పుట్టింటి వారు, మెట్టినింటి వారు రాజకీయాలలో ఉన్నప్పటికీ అనేక ఓటముల తర్వాత గెలుపు రుచి చూశారు. పాన్‌గల్ మండలం జెడ్‌పీటీసీగా మొదటిసారి గెలిచిన ఆమె ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గద్వాల జిల్లా సాధన కోసం పోరాటం చేసి విజయం సాధించానని చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా ఎదిగిన అరుణ ఇప్పుడు మరోసారి గద్వాలలో పతాకం ఎగురవేయడానికి తాపత్రయపడుతున్నారు.
పేరు : ధర్మవరపు కొట్టం అరుణ
తల్లిదండ్రులు : చిట్టెం సుమిత్రమ్మ, నర్సిరెడ్డి, నలుగురు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముల్లు
పుట్టిన తేదీ : మే 4,1960
కుటుంబం : భర్త భరతసింహా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) ముగ్గురు కుమార్తెలు (స్రవంతి, శ్రుతి, స్నిగ్ధారెడ్డి)
పుట్టింది : ధన్వాడ, నారాయణపేట
అభిరుచి : కారు నడుపుతూ దూర ప్రయాణాలు చేయడం, సమాజ సేవ
చదువు : ఇంటర్మీడియట్ (7వ తరగతి ధన్వాడ, 8వ తరగతి నుంచి మాడపాటి హన్మంతరావు స్కూల్)
డీకే అరుణ కుమార్తె సిగ్నారెడ్డి ఎంగెజ్‌మెంట్‌లో వైఎస్ జగన్
రాజకీయ నేపథ్యం :
-పాన్‌గల్ మండలం జెడ్‌పీటీసీగా పనిచేశారు.
1996 - మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్ధి మల్లికార్జున్ పై ఓడిపోయారు.
1998 - మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు.
1999 - గద్వాల అసెంబ్లీ నుంచి పోటి చేసి గట్టు భీముడు చేతిలో ఓడిపోయారు
2004 - కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సమాజ్ వాది పార్టీ నుంచి పోటీ చేసి గట్టు భీముడుపై భారీ మెజారిటీతో గెలుపొందారు
2007 - పిబ్రవరి లో సమాజ్ వాది పార్టీ బహిష్కరించింది
2009 - అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై గెలుపు.
రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చిన్నతరహ పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు
2014 - గద్వాల నుంచి హ్యట్రిక్ విజయాన్ని అందుకున్నారు
2016 - సెప్టెంబర్‌లో ప్రత్యేక జిల్లా సాధన కోసం జములమ్మ ఆలయం నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్ర చేశారు
- విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ఎస్ జే)
Comments
Please login to add a commentAdd a comment