ఓడితే కుంగిపోవాలా.. బ్రదర్? | Komati Reddy Venkat Reddy Has No Regrets  For His Loss in Nalgonda | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 8:53 AM | Last Updated on Wed, Dec 12 2018 11:10 AM

Komati Reddy Venkat Reddy Has No Regrets  For His Loss in Nalgonda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అనూహ్య పరాజయంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఈ సారి ఓటమి చవిచూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన వెంకట్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే నల్గొండ ప్రజలు మాత్రం ఈ సారి వెంకట్‌ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా మార్పును కోరుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డిని 23,698 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.

ఓడితే కుంగిపోవాలా.. ప్రజాస్వామ్యంలో  గెలుపు ఓటములు సహజం.. విజయం ఒక్కోసారి ఒక్కొక్కరిని వరిస్తుంది... గత 20 ఏళ్లుగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని భావించిన వెంకట్‌ రెడ్డి.. ఏ మాత్రం కుంగిపోకుండా రోజువారిలాగే తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం హైదారాబాద్‌లోని జిమ్‌కి వెళ్లి ఉల్లాసంగా అందరితో కలిసి వ్యాయామం చేశారు. ఇక ఫలితాలపై ఈ రోజు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు అధిష్టానం ముందు పట్టుబట్టి సాధించుకున్న మునుగోడు, నకిరేకల్ సీట్లలో ఆయన తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి, ప్రధాన అనచరుడు చిరుమర్తి లింగయ్యలు గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement