Director Ravi Babu
-
‘ఆయన ఓడిపోతే.. అంతకు మించి దురదృష్టం ఉండదు’
సాక్షి, నల్గొండ : తెలంగాణలోనే మంచి మనిషి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఓడిపోతే అంతుకు మించి దురదృష్టం మరోటి ఉండదని దర్శకుడు రవిబాబు అన్నారు. ఆయనకు మద్దతుగా నల్గొండ ప్రచార సభలో పాల్గొన్న రవిబాబు పైవిధంగా అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఈ గ్రామంలోనే కాదు తెలంగాణలోనే మంచి మనిషి అని ఆయనకు ఓటేసి గెలిపించండని ప్రజలను అభ్యర్థించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో ఇరవై ఏళ్ల నుంచి అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారని.. ఆయన అసలు ముఖ్యమంత్రేనా అనే అనుమానం వస్తుందన్నారు. వేలకోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి నిధులు ఎందుకు విడుదల చేయలేదో తన కొడుకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను అడిగి తెలుసుకోమన్నారు. నల్గొండ నుంచి పోటీచేద్దామనుకున్న కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసి పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని కోట్ల రూపాయలు గ్రామాల్లో పంచుతున్నారని.. నల్గొండ ఆత్మగౌరవం గెలుస్తుందా? దోపిడీ చేసిన సొమ్ము గెలుస్తుందో డిసెంబర్ 11న తెలుస్తుందన్నారు. ఈ పోరాటం తనకు టీఆర్ఎస్ అభ్యర్థి మధ్య కాదని.. కేసీఆర్ దోపిడీకి నల్గొండ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని అన్నారు. -
పందిపిల్ల పళ్లుతోముతున్నాడు..!
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు అవుతోంది. ఈ సందర్భంగా రవిబాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్ సమయంలో బంటీ (పంది పిల్ల)ని దర్శకుడు ఎలా రెడీ చేశారో ఫన్నీగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రవిబాబు పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. -
పంది పిల్లని ఎలా రెడీ చేశారో ...ఫన్నీ వీడియో
-
విజయ్‌కి సినిమా చాన్స్‌లు లేవన్నది అవాస్తవం : రవిబాబు
సాక్షి, హైదరాబాద్ : హాస్యనటుడు విజయ్ సాయి మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నానని దర్శకుడు రవిబాబు అన్నారు. విజయ్‌ని వెతికి పట్టుకుని, నటనలో శిక్షణ ఇచ్చి, సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమా అవకాశాలు రాకనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాణాంతక వ్యాది ఉందని కొందరు అంటుండటం అవాస్తవమని రవిబాబు తేల్చిచెప్పారు. మంగళవారం సాయంత్రం విజయ్ సాయి అంత్యక్రియలకు హాజరైన ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. అతనితో నాది మర్చిపోలేని రిలేషన్ : ‘‘విజయ్ మరణం.. షేర్ చేసుకోలేనంత బాధాకరం. అతను నాకు బేబీ లాంటివాడు. సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే. అతన్ని కనిపెట్టి, యాక్టింగ్ నేర్పించడానికి చాలా కష్టపడ్డాను. నా లైఫ్‌లో చాలా కాలం అతనితో గడిపాను. చాలామందిలో లేని క్వాలిటీ ఒకటి విజయ్‌లో ఉంది.. ఎంత బాధాకరమైన విషయాన్నైనా తను నవ్వుతూ చెప్పేవాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నపిల్లలు కళ్లముందే చనిపోవడం ఏ పేరెంట్కైనా దారుణమైన కడుపుకోత’’ అని రవిబాబు అన్నారు. వాళ్ల నాన్న అడిగితే పేరు మార్చాను : ‘‘తొలిసినిమా అమ్మాయిలు-అబ్బాయిలు హిట్ అయిన తర్వాత విజయ్ వాళ్ల నాన్న మా ఇంటికొచ్చారు. ఇండస్ట్రీలో రాణించేలా తన కొడుక్కి మంచి పేరు పెట్టమని అడిగారు. అప్పుడు నేను.. సాయి భగవాన్ పేరు కలిసొచ్చేలా విజయ్‌సాయి అని పేరు పెట్టాను. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’’ అని రవిబాబు చెప్పారు. ఆత్మ హత్యకు ముందు సెల్ఫీ వీడియో: హాస్య నటుడు కాలే విజయ్‌సాయి(40) సోమవారం యూసుఫ్ గూడలోని సొంత ఫ్లాట్‌లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆత్మ హత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోలో విజయ్ మాట్లాడుతూ.. భార్య వనితతో పాటు ముగ్గురిపై ఆరోపణలు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పందిపిల్లతో ఏటీఎం క్యూలో..!
కొంత మంది సినీ ప్రముఖులు ప్రతీ సందర్భాన్ని తమ సినిమాల ప్రమోషన్లకు వాడేసుకుంటారు. ముఖ్యంగా లో బడ్జెట్‌తో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసే రవిబాబు లాంటి దర్శకులు ఇలాంటి ప్రయోగాలు బాగా చేస్తుంటారు. తాజాగా ఈ దర్శకుడు ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పంది పిల్ల లీడ్ రోల్లో 'అదిగో' సినిమాను తెరకెక్కిస్తున్న రవిబాబు, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా నిర్వహించాడు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూ కడుతున్నారు. అందుకే తన సినిమా ప్రమోషన్‌కు అదే కరెక్ట్ ప్లేస్ అని భావించిన రవిబాబు, తన సినిమా హీరో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూ లైన్లో నిలుచున్నాడు. రవిబాబు లాంటి స్టార్ క్యూ లైన్లో కనిపించడమే షాక్ అనుకుంటే, చంకలో పందిపిల్లతో కనిపించటంతో ఈ వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది.