పందిపిల్లతో ఏటీఎం క్యూలో..! | Director Ravi Babu standing with Piglet in ATM Queue | Sakshi
Sakshi News home page

పందిపిల్లతో ఏటీఎం క్యూలో..!

Published Wed, Nov 23 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

పందిపిల్లతో ఏటీఎం క్యూలో..!

పందిపిల్లతో ఏటీఎం క్యూలో..!

కొంత మంది సినీ ప్రముఖులు ప్రతీ సందర్భాన్ని తమ సినిమాల ప్రమోషన్లకు వాడేసుకుంటారు. ముఖ్యంగా లో బడ్జెట్తో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్లతో సినిమాలు చేసే రవిబాబు లాంటి దర్శకులు ఇలాంటి ప్రయోగాలు బాగా చేస్తుంటారు. తాజాగా ఈ దర్శకుడు ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పంది పిల్ల లీడ్ రోల్లో 'అదిగో' సినిమాను తెరకెక్కిస్తున్న రవిబాబు, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్ను వినూత్నంగా నిర్వహించాడు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూ కడుతున్నారు. అందుకే తన సినిమా ప్రమోషన్కు అదే కరెక్ట్ ప్లేస్ అని భావించిన రవిబాబు, తన సినిమా హీరో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూ లైన్లో నిలుచున్నాడు. రవిబాబు లాంటి స్టార్ క్యూ లైన్లో కనిపించడమే షాక్ అనుకుంటే, చంకలో పందిపిల్లతో కనిపించటంతో ఈ వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement