ATM Queue
-
క్యూ లైన్లలో లొల్లి లేకుండా..
మొరాదాబాద్: బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కొనసాగుతున్నాయి. క్యాష్ కొరతతో ఏటీఎంలలో బ్యాంకు సిబ్బంది డబ్బు నింపడం లేదు. అందువల్ల ఎక్కువ శాతం ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏటీఎంలలో డబ్బు నింపినా.. ఆ పక్కనే ఉన్నవారికి తెలిసేలోపే క్యాష్ అయిపోతుంది. దీంతో బ్యాంకు సిబ్బంది డబ్బు నింపేలోపే ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల క్యూ లైన్లలోని జనంలో పెరిగిపోతున్న అసహనం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. చాలా చోట్ల ఘర్షణలు నివారించేందుకు పోలీసులు క్యూలను నియంత్రిస్తున్నారు. అయితే.. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌లోని ఏటీఎంల వద్ద ఉద్రిక్తతలకు తావు లేకుండా జనం కొత్త పద్దతిని అనుసరిస్తున్నారు. క్యూలో నిలుచున్న జనం చేతిపైనే వారి సీరియల్ నంబర్‌ను మార్కర్‌తో రాస్తున్నారు. దీంతో క్యూ లైన్లలో తలెత్తే ఘర్షణలను నివారిస్తున్నామని స్థానికులు వెల్లడించారు. -
ఏటీఎం క్యూలో స్టార్ హీరో..!
ముంబై: సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. కొందరు బాలీవుడ్ తారలు చేతిలో డబ్బు లేక అప్పుగా తీసుకున్నట్టు వార్తలు రాగా.. తాజాగా హీరో అనిల్ కపూర్ కరెన్సీ కోసం ఓ ఏటీఎం ముందు క్యూలో నిల్చున్నాడు. అనిల్ రాకతో క్యూలో నిల్చున్నవారు ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోను దగ్గరగా చూసినందుకు, తమతో కలసి క్యూలో ఉన్నందుకు సంతోషపడ్డారు. క్యూలో ఉన్న కొందరు యువతులు అనిల్ కపూర్‌తో సెల్ఫీ దిగారు. వారు ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ సంఘటన జరిగింది. ఏటీఎం ముందు క్యూలో అనిల్ ఉన్నప్పటి ఫొటోను ఆయన అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అనిల్ కపూర్ సంతోషం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశాడు. -
బ్యాంకు క్యూలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
-
పందిపిల్లతో ఏటీఎం క్యూలో..!
కొంత మంది సినీ ప్రముఖులు ప్రతీ సందర్భాన్ని తమ సినిమాల ప్రమోషన్లకు వాడేసుకుంటారు. ముఖ్యంగా లో బడ్జెట్‌తో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసే రవిబాబు లాంటి దర్శకులు ఇలాంటి ప్రయోగాలు బాగా చేస్తుంటారు. తాజాగా ఈ దర్శకుడు ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పంది పిల్ల లీడ్ రోల్లో 'అదిగో' సినిమాను తెరకెక్కిస్తున్న రవిబాబు, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా నిర్వహించాడు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూ కడుతున్నారు. అందుకే తన సినిమా ప్రమోషన్‌కు అదే కరెక్ట్ ప్లేస్ అని భావించిన రవిబాబు, తన సినిమా హీరో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూ లైన్లో నిలుచున్నాడు. రవిబాబు లాంటి స్టార్ క్యూ లైన్లో కనిపించడమే షాక్ అనుకుంటే, చంకలో పందిపిల్లతో కనిపించటంతో ఈ వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఎటీఎం క్యూలైన్ తపారని చితకబాదారు