
ఏటీఎం క్యూలో స్టార్ హీరో..!
ముంబై: సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. కొందరు బాలీవుడ్ తారలు చేతిలో డబ్బు లేక అప్పుగా తీసుకున్నట్టు వార్తలు రాగా.. తాజాగా హీరో అనిల్ కపూర్ కరెన్సీ కోసం ఓ ఏటీఎం ముందు క్యూలో నిల్చున్నాడు.
అనిల్ రాకతో క్యూలో నిల్చున్నవారు ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోను దగ్గరగా చూసినందుకు, తమతో కలసి క్యూలో ఉన్నందుకు సంతోషపడ్డారు. క్యూలో ఉన్న కొందరు యువతులు అనిల్ కపూర్‌తో సెల్ఫీ దిగారు. వారు ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. ఏటీఎం ముందు క్యూలో అనిల్ ఉన్నప్పటి ఫొటోను ఆయన అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అనిల్ కపూర్ సంతోషం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశాడు.