primary school in China rewarded 20 excellent students with piglets: మన దేశంలో బాగా చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకై వారిని పై చదువులు చదివించడమే లేక ఉపయుక్తమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తాం. అంతేందుకు మంచి ప్రతిభావంతులైతే ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించడమో లేక ఆర్థిక సహాయం చేయడమో కూడా చేస్తాం. కానీ చైనాలో పేద మెరిట్ విద్యార్థులకు విచిత్రమైన గిఫ్ట్‌లు ఇస్తారు. నిజానికి మనకు అది బహుమతిలా అనిపించదు. పైగా మనం కలలో కూడా ఊహించని విచిత్రమైన గిఫ్ట్ అది.
అసలు విషయంలోకెళ్తే...యునాన్ ప్రావిన్స్‌లోని యిలియాంగ్ కౌంటీలోని జియాంగ్‌యాంగ్ ఎలిమెంటరీ స్కూల్ 20 మంది విద్యార్థులకు పందిపిల్లలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు హౌ చాంగ్లియాంగ్ మాట్లాడుతూ.. "గ్రామీణ విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో షాంఘై జియాంగ్వు ప్రజా సంక్షేమ నిధి ద్వారా పందిపిల్లలను స్పాన్సర్ చేశాం.
ఈ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. నేను నా భార్య లీ యుడాన్‌తో సహా నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మేము అకడమిక్ మెరిట్ ఆధారంగా 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి పంది పిల్లలను బహుమతులుగా ఇచ్చాం. ఈ రకమైన బహుమతుల ద్వారా వారిని ప్రోత్సహించడమే కాక వారి తల్లిదండ్రులకు ఒక విధమైన సాయం అదించగలిగాం" అని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వినియోగదారులు ఇంత చిన్న వయసులో పందిని సంపాదించగలగడం చాలా గొప్ప విషయం అంటూ వ్యగ్యంగా రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు)
Comments
Please login to add a commentAdd a comment