‘అదుగో’ బంటీని పరిచయం చేశారు..! | Ravibabu Adhugo Movie Teaser | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 10:11 AM | Last Updated on Sat, Sep 8 2018 10:16 AM

Ravibabu Adhugo Movie Teaser - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి రవిబాబు స‍్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. సినిమాలో కీలకమైన బంటీ(పందిపిల్ల)ని ఈ టీజర్‌లో పరిచయం చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement