అదుగో నటకిరీటి వాయిస్‌ | Rajendra Prasad Voice over for Adugo | Sakshi
Sakshi News home page

అదుగో నటకిరీటి వాయిస్‌

Published Sun, Oct 28 2018 5:48 AM | Last Updated on Sun, Oct 28 2018 5:48 AM

Rajendra Prasad Voice over for Adugo - Sakshi

రవిబాబు, రాజేంద్రప్రసాద్‌

వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఫ్లైయింగ్‌ ఫ్రాగ్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకొని దీపావళి పండగ కానుకగా నవంబర్‌ 7న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ వాయిస్‌ ఓవర్‌ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘బంటిగా పందిపిల్ల అందరి మనసులనూ దోచేస్తుంది. తెరపై నిజమైన పంది పిల్లనే చూస్తున్నామనే ఫీల్‌ని ప్రేక్షకులకు కలిగించడం కోసం  లైవ్‌ యాక్షన్‌ త్రీడి యానిమేషన్‌ టెక్నాలజీని వాడాం. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆడియన్స్‌కి ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని కూడా తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంతి విహారి స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement