voice over
-
డోరెమాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ వాయిస్ మూగబోయింది
ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్స్‌లో డోరెమాన్ ఒకటి. చిన్నారులు ఎంతో ఇష్టపడే డోరెమాన్‌కు చాలా క్రేజ్ ఉంది. డోరెమాన్ కార్టూన్ సిరీస్ చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఈ సిరీస్‌లో డోరెమాన్, షుజుకా, నోబితా, జియాన్, సునియో క్యారెక్టర్స్‌ను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఈ డోరెమాన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఇచ్చిన జపనీస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా మృతి చెందారు. ఈ కార్టూన్ సిరీస్‌లో 1979-2005 వరకు డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా (90) వయోభారంతో సెప్టెంబర్ 29న మరణించారు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించకపోవడంతో బయటికి రాలేదు. తాజాగా శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్లుగా పేర్కొన్నారు. ఈ వార్తను ఆలస్యం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపారు. నోబుయోపై చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. 1933లో టోక్యోలో జన్మించిన నోబుయో ఒయామా వాయిస్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సినిమాలు, షోలు, సిరీస్‌లలో వివిధ పాత్రలకు ఆమె డబ్బింగ్ చెప్పేవారు. సూపర్ మ్యాన్ జాంబోట్- 3లో కప్పే జిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. 1964లో సహ నటుడైన కీసుకే సగావాను వివాహం చేసుకున్నారు. 1979లో డోరెమాన్ ప్రారంభమైనప్పటి నుంచి 2005 వరకు నిరంతరాయంగా తన వాయిస్ అందించారు. -
టీనేజ్ గుర్తొచ్చింది!
టీనేజ్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని సంబరపడిపోతున్నారు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే. హఠాత్తుగా అనన్యా పాండేకు టీనేజ్ జ్ఞాపకాలు గుర్తుకు రావడానికి కారణం ‘ఇన్సైడ్ అవుట్ 2’ అనే అమెరికన్ యానిమేటెడ్ ఫిల్మ్. కెల్సీ మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ తారలు అమీ పోహ్లర్, ఫిలిస్ స్మిత్, లూయిస్ బ్లాక్, టోనీ హేల్ వంటి వారు ఈ సినిమాలోని హ్యాపీ, సాడ్‌నెస్, యాంగర్ వంటి ఎమోషన్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.రిలే ఆండర్సన్ అనే ఓ 13 ఏళ్ల టీనేజ్ అమ్మాయి పాత్రకు హిందీ వెర్షన్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు అనన్యా పాండే. సినిమాలో కెన్సింగ్టన్ తాల్మన్ ఈ పాత్ర చేసింది. రిలే ఆండర్సన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సందర్భంగా అనన్యా పాండే మాట్లాడుతూ– ‘‘పిక్సర్ అండ్ డిస్నీ స్టూడియోల యానిమేషన్ చిత్రాలకు నేను అభిమానిని. ఈ సంస్థల నుంచి వస్తున్న ‘ఇన్సైడ్ అవుట్ 2’కి వాయిస్ ఓవర్ ఇవ్వడం హ్యాపీగా ఉంది. రిలే పాత్రకు వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు నాకు నా టీనేజ్ గుర్తొచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా ‘ఇన్సైడ్ అవుట్ 2’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
భైరవకి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో మహేశ్‌బాబు భాగం కానున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్‌లో మహేశ్‌బాబు నటించరట. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఎపిసోడ్‌కి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ‘జల్సా’, ‘బాద్ షా’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి.. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మహేశ్ వాయిస్ వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
చైనా గోడ దూకినా తప్పు లేదు...
‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా, మరో హీరోయిన్ రుక్సార్ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించిన భాస్కర్ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే: నాపై ట్రోలింగ్, బెదిరింపులు
టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ షో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ మలయాళం సహా ఏడు భాషల్లో ఎంత పాపులర్ అందరికీ తెలుసు. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో బాగా జనాదరణ పొందింది. హిందీలో తొలి సీజన్ 2006, నవంబరులో మొదలైంది. ముఖ్యంగా ఈ షోలో వినిపించే వాయిస్‌లు ఈ షోకేపెద్ద ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అయితే హిందీ బిగ్ బాస్‌కి వాయిస్ ఇచ్చే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ , నటుడు విజయ్ విక్రమ్ సింగ్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ప్రముఖ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ప్రకటించిన తర్వాత తనను చాలా ఇబ్బందులు పడుతున్నానంటూ వాపోయారు. కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని విజయ్ విక్రమ్ సింగ్ వెల్లడించారు. అలాగే తమ పిల్లల్ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించమంటూ ఫోర్స్ చేస్తుంటారని తెలిపాడు బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విజయ్ విక్రమ్ సింగ్ బిగ్ బాస్‌లో అధికారిక వ్యాఖ్యాతగా తన వాయిస్‌ని ఇవ్వడం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. ఈ షోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం తనకు పెద్ద డిస్‌అడ్వాంటేజ్‌గా మారిపోయిందనీ, విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపాడు. ముఖ్యంగా కీలకమైన పోటీదారుల ఎలిమినేట్ అయినపుడు మరీ దారుణంగా ఉంటుందని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. తన కుటుంబానికి కొన్ని ప్రత్యక్ష బెదిరింపులు కూడా వస్తుంటాయని పేర్కొన్నాడు. విన్నర్‌కు అసలు అర్హత లేదు అంటూ చాలా సార్లు కమెంట్లు వినిపిస్తుంటాయి.. కానీ, ఇది టాలెంట్ షో కాదు.. కేవలం జనం మెచ్చిన వాళ్లు విజేతలు - విజయ్ విక్రమ్ సింగ్ అసలు కంటెస్టెంట్స్‌ను తొలగించేంది తాను కాదని, ఎలిమినేషనకు తనకూ ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నా, పట్టించుకోరన్నారు. ప్రజల ఓట్లే పోటీదారుల తొలగింపునకు దారితీస్తుందని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదని వ్యక్తం చేశాడు. ఆ వాయిస్ తనది కాదన్నా వినరని తెలిపాడు. ప్రస్తుత సీజన్‌కు విజయ్ బదులుగా మరో నటుడు వాయిస్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్ వాయిస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ చాహ్తే హై' అంటూ హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సంభాషణల వాయిస్ అతుల్ కపూర్, విజయ్ సింగ్లదే. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ అతుల్ కపూర్ అయితే, షోను వివరించే వాయిస్, షో రీక్యాప్ లాంటి వాటికి వాయిస్ ఇచ్చేవారు విజయ్. కాగా 2010లో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌పై వాయిస్ ఓవర్‌తో పాపులర్ అయ్యాడు విజయ్. ఆతరువాత బీబీకి వాయస్‌తో కొన్ని, వెబ్ షో, సినిమా ఆఫర్లను దక్కించుకున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జ్‌తోపాటు, సుస్మితాసేన్ లీడ్ రోల్లో నటించిన తాలి, విక్కీకౌశల్ మూవీలోకూడా అవకాశాలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Vijay Vikram Singh (@vijayvikram77) -
ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి మృతి.. తొలి మహిళగా ఆమె పేరిట రికార్డు..
బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో).. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇస్రో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇస్రో ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా కౌంట్‌డౌన్ చదువుతూ ఒక మహిళ గొంతు వినపడుతుంది. కాగా, ఆ స్వరం మూగబోయింది. ఇస్రో ప్రతీ ప్రాజెక్ట్‌లో కౌంట్‌డౌన్ వినిపించే గొంతు ఇక మళ్లీ వినపడదు. కౌంట్‌డౌన్ చదివే ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. వరుస విజయాలతో ఎంతో ఆనందంతో ఉన్న ఇస్రో శాస్త్రవేతల బృందంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇస్రో ప్రయోగాలకు కౌంట్‌డౌన్ వాయిస్ అందించే శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూశారు. గుండెపోడుతో వలర్మతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల సంతాపం.. అయితే, శాస్త్రవేత్త వలర్మతి.. చంద్రయాన్-3 లాంచ్ సమయంలోనూ ఆమెనే స్వరాన్ని అందించారు. అదే ఆమె వాయిన్ వినిపించిన చివరి మిషన్. ఇస్రోలో ఆమెను వలర్మతి మేడం అని పిలుస్తారు. వలర్మతి మరణం నేపథ్యంలో ప్రముఖులు, ఇస్రో శాస్త్రవేత్తలు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు. కాగా, వలర్మతి మృతిపై ఇస్రో మాజీ డైరెక్టర్ పీవీ వెంకటకృష్ణన్ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భవిష్యత్తులో శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టి ప్రాజెక్ట్స్ కౌంట్డౌన్లలో వలర్మతి మేడం గొంతు వినిపించదు. చంద్రయాన్-3నే ఆమె చివరి కౌంట్‌డౌన్. ఆమెది ఆకస్మిక మరణం. బాధగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ISRO scientist Valarmathi, who lent her voice on countdowns for rocket launches, has died due to cardiac arrest. Her last countdown was during the launch of Chandrayaan-3. pic.twitter.com/UwaFKN8EUG — Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) September 4, 2023 అబ్దుల్ కలాం అవార్డు పొందిన తొలి మహిళ.. శాస్త్రవేత్త వలర్మతి.. తమిళనాడులోని ఆరియలూర్లో 1959 జులై 31న జన్మించారు. కోయంబత్తూర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఇస్రోలో శాస్త్రవేత్తగా జాయిన్ అయ్యారు. ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. తొలి దేశీయ రాడార్ ఇమేజింగ్ సాటిలైట్ (ఆర్‌ఐఎస్‌ఏటీ-1) మిషన్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. తమిళనాడు ప్రభుత్వం.. 2015లో ఆమెకు అబ్దుల్ కలామ్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వలర్మతి కావడం విశేషం. ఇది కూడా చదవండి: చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి? -
ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?
స్మార్ట్‌ఫోన్‌లా పుణ్యమా అని మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా..లేదా దారి తెలియకపోయినా ఏ మాత్రం భయం లేకుండా హాయిగా వెళ్లిపోతున్నాం. జస్ట్ అలా ఫోన్లో మ్యాప్ ఓపెన్ చేసి చెవిలో అలా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని..అందులో జీపీఎస్ ఆన్ చేసి..టెక్స్ట్ వాయిస్‌తో ఇచ్చే డైరెక్షన్‌ని బేస్ చేసుకోవడంతో.. జర్నీ ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఆలోచించామా ఆ వాయిస్ ఎవ్వరిది? ఏ మహిళ మాట్లాడుతుంది అని. ప్రపంచం నలుమూలల ఆమె వాయిస్ అందరికీ సుపరిచితమే. ఇంతకి ఆమె ఎవరంటే.. ఆమె పేరు కరెనా జాకబ్సెన్. ఆస్ట్రేలియన్ మహిళ. స్మార్ట్ ఫోన్లో ఉండే జీపీఎస్ ఫీచర్లో ఉండే సిరి అనే వర్చువల్ వాయిస్‌కి స్వరాన్ని అందించిందే కరెనా. ఇంతకీ ఆమె 'జీపీఎస్ గర్ల్'గా ఎలా మారింది. ఆమె నేపథ్యం ఏమిటి? అంటే..కరెనా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మాకేలో జన్మించింది. ఏడు సంవత్సరాల వయసులో పాటలు రాయడం, పాడడం వంటివి చేసింది. ఆమె ఆస్ట్రేలియాలో ప్రముఖ సింగర్ అయిన ఒలివియా న్యూటన్-జాన్లా అవ్వలనేది కరెన్ డ్రీమ్. అందుకోసం అని సూట్‌కేస్ చేత పట్టుకుని న్యూయార్క్ వచ్చేసింది. తాను అనుకున్నట్టుగానే ఎన్నో పాటలు రాసింది, పాడింది. ఇలా ఎన్నో ఆల్బమ్‌లు రిలీజ్ చేసి కెరియర్ మంచి ఊపులో ఏ చీకుచింత లేకుండా సాగిపోతోంది. అంతేగాదు ఆమె పాటలు యూఎస్ నెట్వర్క్స్ టెలివజన్ లైసెన్స్ పొందడం విశేషం. ఎన్నో ప్రముఖ థియోటర్లో ప్రదర్శించబడ్డాయి. మాకే టు మాన్హాటన్ వరకు కరెన్ తన సంగీతంతో ప్రజలను అలరించింది. జీపీఎస్ గర్ల్‌గా టర్నింగ్.. నూయార్క్‌లో ఒక రోజు కరెన్ టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ సిస్టమ్‌ను రికార్డ్ చేయడానికి ఆడిషన్‌కి వెళ్లింది. అది తన వాయిస్‌ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తుందని ఊహించలేదు. ఆ ఒక్కసారి ఇచ్చిన వాయిస్ ఓవర్ కాస్త జీపీఎస్ గర్ల్‌గా బ్రాండ్ నేమ్‌ను తెప్పించింది. ఇక వెనుదిరిగి చూసుకోకుండా అన్ని రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టేలా చేసింది ఆమె గాత్రం. ఒకరకంగా ఆమెను ఇంటర్నేషనల్ స్పీకర్ మార్చింది. ఆమె గాత్రం ఎన్నో యూనివర్సిటీలో టెడ్ఎక్స్ స్పీకర్‌గా ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్, రియల్ ఎస్టేట్‌తో సహా ఎన్నో బహుళ పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన స్వరాన్ని అందించింది. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్స్ ఎన్బీసీ టుడే షో, ఏబీసీ వరల్డ్ న్యూస్ టునైట్, సీబీఎస్ ఎర్లీ సో, సన్‌రైజ్, ఎన్వై డైలీ న్యూస్, ది గార్డియన్, గ్లామర్ మ్యాగజైన్, పీపుల్ మ్యాగజైన్ తదితర ఛానెల్స్ ఆమెను శక్తిమంతమైన మహిళగా కీర్తించాయి. కస్టమైజ్డ్ వాయిస్ సిస్టమ్స్‌లో, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లలో కరెన్ వాయిస్ ఓవర్‌కి ఎంతో డిమాండ్ ఉంది. ఓ పాప్ సింగర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులతో ప్రభంజనం సృష్టించి కెరియర్ మంచి పీక్‌లో దూసుకుపోతుందనంగా చేసిన టెక్స్ట్ టు స్పీచ్ మరో సెలబ్రేటీ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. ఆమె స్వరం ఓ వరంలా మారి ఆమెకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
నాగేశ్వరరావు కోసం ఐదుగురు స్టార్స్
హీరో రవితేజ సినిమాకి రెండోసారి మాట ఇచ్చారు హీరో వెంకటేశ్. రవితేజ నటించిన ‘క్రాక్’ (2021)కి వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేశ్.. తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి ఇచ్చారు. వంశీ దర్శకత్వంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ‘‘అది 70వ దశకం. బంగాళాఖాతం తీరప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. దడదడ మంటూ వెళ్లే రైలు ఆప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనబడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని.. ‘స్టూవర్టుపురం’. ఆప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది.. ‘టైగర్ జోన్’. ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు..’ అంటూ టైగర్ నాగేశ్వరరావు చరిత్రని తన వాయిస్‌తో వెంకటేశ్ పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోకు హిందీలో జాన్ అబ్రహాం, కన్నడలో శివ రాజ్‌కుమార్, తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగగా ముద్రపడిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
సొంత సినిమా కాదు.. అయినా సరే స్టార్ యాక్టర్స్ అలా
ఒక సినిమా గురించి ఒక స్టార్ పరిచయం చేస్తే ఆ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమావైపు మళ్లేలా చేస్తాయి. ఆ మాటలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. అందుకే కొన్ని చిత్రాలకు స్టార్స్‌తో ‘వాయిస్ ఓవర్’ చెప్పిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో ‘వాయిస్ ఓవర్’ ఇచ్చిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. దళపతికి ఉలగ నాయగన్ మాట ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాకి ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్‌హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ‘మాస్టర్’ తర్వాత విజయ్–లోకేష్ కాంబినేషన్లో ‘లియో’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్గా, సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ రిలీజ్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌కి కమల్‌హాసన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారని టాక్. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథి ΄పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. అక్టోబర్ 19న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సాలే గురించి చెప్పిన టిల్లు ‘డీజే టిల్లు’ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రత్యేకించి యూత్‌లో అతని ఫాలోయింగ్ రెట్టింపయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా ‘భాగ్ సాలే’ చిత్ర యూనిట్ సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ చెప్పించింది. తన వాయిస్‌తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తారు సిద్ధు. కేడీ కోసం మల్టీ స్టార్స్ యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్. శిల్పా శెట్టి, సంజయ్ దత్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌కి కన్నడలో చిత్ర దర్శకుడు ప్రేమ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీలో సంజయ్ దత్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చారు. ఇంకా తెలుగు వాయిస్ ఓవర్ పూర్తి కాలేదట. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
లియోకి వాయిస్
ఇళయ దళపతి విజయ్ అభిమానులకు లోక నాయకుడు కమల్‌హాసన్ ఓ స్వీట్ షాక్ ఇవ్వనున్నారని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ అంటోంది. వార్తల్లో ఉన్న ప్రకారం విజయ్ నటిస్తున్న ‘లియో’ చిత్రం టీజర్‌కి కమల్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి యాక్షన్ టీజర్‌ని రెడీ చేస్తున్నారట చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్. విజయ్ ΄ాత్ర పరిచయంతో ఈ టీజర్ సాగుతుందని, ఈ పరిచయం కమల్ మాటల్లో వినబడుతుందని భోగట్టా. కమల్ డబ్బింగ్ చెప్పేశారని, ఆ వాయిస్‌తో టీజర్ రెడీ చేసే పని మీద చిత్ర యూనిట్ ఉందని టాక్. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ ΄ాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
New Parliament Building: షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్శిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం గురించి మీ వాయిస్ ఓవర్లతో కూడిన వీడియోలతో సామాజిక మాధ్యమంలో భాగస్వామ్యం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఈ మేరకు మోదీ మే 26న తొలిసారిగా కొత్త పార్లమెంట్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఈ భవనంపై మీ ఆలోచనల తెలియజేస్తూ..వాయిస్ ఓవర్ వీడియోలను షేర్ చేయాలని, వాటిలో కొన్నింటిని మళ్లీ ట్వీట్ చేస్తానని చెప్పారు. మోదీ ప్రత్యేక అభ్యర్థన మేరకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తమ వాయిస్ ఓవర్లతో కూడిన వీడియోలను షేర్ చేశారు. ఆయా పోస్టులను శనివారం ప్రధాని మోదీ.. తాను చెప్పినట్లుగానే కొన్నింటిని రీట్వీట్ చేశారు. అందులో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు పోస్ట్ చేసిన వాయిస్ ఓవర్ వీడియోలను మోదీ రీట్వీట్ చేశారు.మోదీ.. ఆయా వీడియోలో భవనం గురించి వ్యాఖ్యానం లేదా నేపథ్య సంగీతం ఉండాలనే నియమం ఏమిలేదని, కేవలం మీ ఆలోచనలు తెలుసుకునేందుకేనని పేర్కొన్నారు. ఈ మేరకు షారూఖ్ షేర్ చేసిన వీడియాలో.. మన రాజ్యంగాన్ని సమర్థించే ప్రజలకు కొత్త ఇల్లు అని పిలిచారు. ఇది మన ఆశల కొత్త ఇల్లు. 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా మారిన మన రాజ్యంగాన్ని సమర్థించే ప్రజల ఇల్లు. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉండనివ్వండి.. ఎదుకంటే ప్రతి గ్రామం, నగరం, దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తగినంత చోటు ఉంటుంది. ఈ కొత్త ఇల్లు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఆలింగనం చేసుకుంటుందని చెబుతూ..న్యూ ఇండియా కోసం కొత్త పార్లమెంట్ భవనం అనే క్యాప్షన్ జోడిస్తూ వాయిస్ ఓవర్ వీడియోని పోస్ట్ చేశారు షారుఖ్. Beautifully expressed! The new Parliament building is a symbol of democratic strength and progress. It blends tradition with modernity. #MyParliamentMyPride https://t.co/Z1K1nyjA1X — Narendra Modi (@narendramodi) May 27, 2023 అంతేగాదు దీన్ని పురాతన సంప్రదాయ మేళవికతో భారతదేశ కీర్తిని మరింత అందంగా ఇనుమడింప చేశారంటూ మోదీని కొనియాడాడు షారూఖ్. అలాగే అక్షయ్ కుమార్ వాయిస్ ఓవర్ వీడియోని కూడా రీట్వీట్ చేశారు మోదీ. ఆ వీడియోలో..అక్షయ్ కుమార్ కొత్త పార్లమెంటు భవనాన్ని భారతదేశ వృద్ధి కథకు ఐకానిక్ సింబల్‌గా అభివర్ణించారు. ఈ భవనం మన గొప్ప వారసత్వానికి ప్రతీక అన్నారు. అక్షయ్ మాటలతో ఏకభవిస్తూ మోదీ ఈ వీడియోని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడానికి ఒక్క రోజు వ్యవధి ఉందనంగా.. కొన్ని గంటల ముందు మోదీ ఆ వాయిస్ ఓవర్ వీడియోలను నెటిజన్లతో పంచుకున్నారు. You have conveyed your thoughts very well. Our new Parliament is truly a beacon of our democracy. It reflects the nation's rich heritage and the vibrant aspirations for the future. #MyParliamentMyPride https://t.co/oHgwsdLLli — Narendra Modi (@narendramodi) May 27, 2023 వీడియోల తోపాటు మోదీ అనుపమ్ ఖేర్, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సహా ప్రముఖుల, రాజకీయ నాయకులు కొత్త పార్లమెంట్ భవనంపై పంచుకున్న తమ ఆలోచనలను రీట్వీట్ చేశారు. ఇకపోతే అనుపమ్ ఖేర్ పద్యాలతో పార్లెమంట్ భవనం విశిష్టతను ప్రశంసించగా, మోదీ మీ కవితలు ప్రజలకు ఈ భవనం పట్ల మరింత విశ్వాసాన్నిపెంచుతాయని అనుపమ్‌ని మెచ్చుకున్నారు. The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride. pic.twitter.com/yEt4F38e8E — Narendra Modi (@narendramodi) May 26, 2023 ఉండగా, తమిళనాడు ప్రముఖ సిని హిరో రజనీకాంత్ సైత మోదీ సెంగోల్‌ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..తమిళులు గర్వపడేలా చేశారన్నారు. అందుకు మోదీ కొత్త పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతి గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. రజనీకాంత్‌కు సమాధానమిచ్చారు. కాగా, అధీనం సీర్స్ ప్రధాని మోదీకి సెంగోల్‌ను అందజేశారు. దీన్ని కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్లో మే 28న ప్రధాని మోదీ ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. లైవ్ అప్ డేట్స్) -
తండ్రీకూతుళ్ల అనుబంధం
హీరో నాని కొత్త సంవత్సరం కొత్త సినిమా కబురు చెప్పారు. నాని హీరోగా శౌర్యువ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, వైర ఎంటర్టైన్మెంట్ పతాకంపై చెరుకూరి వెంకట మోహన్, డా.విజయేందర్‌రెడ్డి, మూర్తి కలగర ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రకటించి, నాని వాయిస్ ఓవర్‌తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నాని కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. ఈ సినిమాకు కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్. -
సాయి ధరమ్ తేజ్‌కు ఎన్టీఆర్ సాయం.. అప్డేట్ వదిలిన మేకర్స్
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SDT 15 వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. డిసెంబర్7న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది మూవీ యూనిట్. అయితే తాజాగా ఈ టైటిల్ గ్లింప్స్‌కు జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తుండటం విశేషం. ఈ మేరకు మేకర్స్ అప్డేట్ను వదిలారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ మొదలైంది. మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. More love to you Tarak @tarak9999 ❤️ Thank you is a small word for the way you received me when I came to you. It felt like the old days when I came to meet you before becoming an actor. Your voice has made our #SDTitleGlimpse magical#NTRforSDT will always be special for me 🤗 pic.twitter.com/UxYhXSbNE7 — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 5, 2022 -
Batman: ఆ స్వరం మూగబోయింది
హాలీవుడ్ న్యూస్: డీసీ కామిక్స్‌లో బ్యాట్‌మన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ క్యారెక్టర్ని ఆడియొన్స్కి అంతలా కనెక్ట్ చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్. గంభీరమైన స్వరంతో ‘ఐ యామ్ వెన్జెన్స్.. ఐ యామ్ ది నైట్.. ఐ యామ్ బ్యాట్మన్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్.. చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక లేరు. బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్‌లో బ్యాట్మన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ అందించిన కెవిన్ కాన్రాయ్ Kevin Conroy గురువారం కన్నుమూశారు. ప్రేగు క్యాన్సర్ బాధపడుతున్న ఆయన.. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు శుక్రవారం వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఆయనకు నివాళిగా సోషల్ మీడియాలో RIP Legend హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నడుస్తోంది. Thank you. 🦇❤️ pic.twitter.com/hB4XUy8Gw1 — Batman (@Batman) November 11, 2022 కామిక్స్ పోర్షన్ తర్వాత.. 1992-96 మధ్య బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్‌లు విపరీతంగా జనాదరణను సంపాదించుకున్నాయి. అందులో 15 చిత్రాలు, 400 టీవీ ఎపిసోడ్స్, 20కిపైగా వీడియోగేమ్స్, బ్యాట్మన్:ఆర్ఖామ్ అండ్ ఇన్జస్టిస్ ఫ్రాంచైజీలకు వాయిస్ ఓవర్ అందించారు కాన్రాయ్. తద్వారా బ్యాట్మన్ క్యారెక్టర్‌కు జనాల్లో విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారాయన. RIP LEGEND @RealKevinConroy 🦇 Thank you for bringing Batman to life with your Iconic voice 🙏#KevinConroy #Batman pic.twitter.com/dMUgnBteqL — DC World Telugu (@DCWorldTelugu) November 11, 2022 న్యూయార్క్ వెస్ట్బ్యూరీలో జన్మించిన కెవిన్ కాన్రాయ్.. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1980 నుంచి టీవీ యాడ్స్ ద్వారా నటనలోకి అడుగుపెట్టి.. చాలాకాలం బుల్లితెర ప్రజలను అలరించారు. ఆపై కొన్ని చిత్రాలు, టీవీ సిరీస్‌ల్లోనూ మెరిశారు. 1991లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆండ్రియా రొమానో ద్వారా బ్యాట్మన్ సిరీస్‌కు వాయిస్ ఓవర్ అందించడం ప్రారంభించారు. కామిక్స్‌పై ఏమాత్రం అవగాహన లేని కాన్రాయ్.. బ్రూస్ వేన్(బ్యాట్మన్) పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు. హాలీవుడ్లో ‘గే’ సెలెబ్రిటీగా ఈయనకు పేరుంది. చివరిరోజుల్లో ఆయన వాన్ సి. విలియమ్స్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం గమనార్హం. Kevin Conroy was an idol to me. I looked up to him growing up. I watched the animated series, watched the animated movies, shorts and played all the Arkham games. I'm glad I was even able to meet him this year. He was an awesome guy. RIP legend. You will be missed Batman 🦇❤ pic.twitter.com/noGLyWVLvn — Dan 🦇 (@Sandwich_Rock_) November 11, 2022 ఇదీ చదవండి: ఇది.. మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా! -
డైలాగ్ కింగ్‌కి మెగా వాయిస్
మంచు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హీరో సూర్య సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌కు ప్రముఖ నటులు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ‘‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’’ అని మోహన్‌బాబు పాత్రను పరిచయం చేశారు చిరంజీవి. ఇంకా మోహన్‌బాబు చెప్పిన ‘నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ డైలాగ్స్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘టీజర్‌కు చిరంజీవి అంకుల్ వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందని విష్ణు అన్నాడు. చిరంజీవికి ఫోన్ చేసి అడిగితే, ‘వాయిస్ ఓవర్ మ్యాటర్ పంపు’ అన్నాడు. ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ నేను అడిగిన మూడు రోజులకే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి డబ్బింగ్ చెప్పి, పంపాలనుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసి విష్ణుబాబును పంపాను. ‘నిన్ను (విష్ణును ఉద్దేశిస్తూ) ఎవరు రమ్మన్నారు. డబ్బింగ్ పూర్తి చేసి మీ నాన్నకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను’ అని విష్ణుతో చిరంజీవి అన్నాడు. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించినందుకు చిరంజీవికి ధన్యవాదాలు. అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్యకు ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో వస్తాం’’ అని అన్నారు. -
మోసగాళ్ల కథ చెబుతా!
విష్ణు మంచు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించగా, విష్ణుకి జోడీగా రుహీ సింగ్ నటించారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్‌ను అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్ చేస్తారు వెంకటేశ్. ‘‘అల్లు అర్జున్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన లభించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ని విడుదల చేసిన వెంకటేష్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం ఈ చిత్రానికి మరింత ఆకర్షణ’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, కెమెరా: షెల్డన్ చౌ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
మేఘన్ మార్కెల్ కొత్త అవతారం
లండన్ : ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రటిన్ రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ అప్పుడే ఆ పనిలో పడినట్టు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని మేఘన్ తిరిగి చేపట్టారు. ఇందుకోసం డిస్నీ లండన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీనియర్ రాయల్స్ పదవి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని వెల్లడించిన మేఘన్ డిస్నీ లండన్‌తో వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు వారాల విరామం కోసం కెనడాకు బయలుదేరే ముందే నవంబర్‌లో ఆమె వాయిస్ఓవర్ను రికార్డ్ చేశారట. 2017లో హ్యారీతో నిశ్చితార్థం తరువాత నటనకు గుడ్ బై చెప్పిన మాజీ నటి మేఘన్ తాజాగా డిస్నీతో ఒప్పందం చేసుకున్నారు. ఎనుగుల పరిరక్షణకు, వేటగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన పరిరక్షణా బృందం ‘ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా స్టూడియోతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. కాగా బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే సమయంలో రాణికి (ఎలిజిబెత్-2)సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్‌కు అవగాహన కల్పించడంతోపాటు, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించే వీలవుతుందని చెప్పారు. మరోవైపు హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్‌హాం ప్యాలస్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘సైరా’కు పవన్ వాయిస్ ఓవర్; వీడియో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇంతకుముందే ఫొటోలు రిలీజ్ చేసింది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ పవన్ ఆవేశంగా నినదించడం వీడియోలో ఉంది. హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గరుండి పవన్‌తో డబ్బింగ్ చెప్పించడం వీడియో దృశ్యాల్లో కనబడుతోంది. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలకానుంది. టీజర్‌కు వాయిస్ ఓవర్ అందించిన తన బాబాయ్ పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ సుధీర్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు. -
నేనూ జీనీ లాంటి వాణ్ణే
‘‘డిస్నీ సినిమాలు అందరికీ తెలుసు. వాళ్ల యానిమేషన్ చిత్రాలు చాలానే చూశాను. ‘అలాద్దీన్’ చిత్రంలో వాయిస్ ఇవ్వాలని సంప్రదించినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. ఇలాంటి సినిమాలు తెలుగువాళ్లు కూడా చూడాలని అంగీకరించాను’’ అని వెంకటేశ్ అన్నారు. విల్‌స్మిత్ ముఖ్యపాత్రలో రూపొందిన చిత్రం ‘అలాద్దీన్’. డిస్నీ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో జినీ పాత్రకు వెంకటేశ్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఫన్‌గా ఉంది. క్రేజీ పాత్ర ఇది. చాలెంజింగ్‌గా ఉంది. డబ్బింగ్ చెబుతూ చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో అలాద్దీన్ కోరుకుంటే నేను నెరవేరుస్తుంటాను. జనరల్‌గా కూడా కోరుకున్నది నెరవేర్చడం చాలా బావుంటుంది. ‘ఎఫ్ 2’ తర్వాత మళ్లీ వరుణ్ని గైడ్ చేసే పాత్ర రావడం అనుకోకుండా జరిగింది. మా పిల్లలకు నేను జీనీలాంటి వాణ్ణే. అడిగింది ఇస్తుంటాను’’ అన్నారు. వరుణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నేను, చెల్లి(నిహారిక) డిస్నీ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు డిస్నీ సినిమాలకే డబ్బింగ్ చెప్పడం లక్కీగా ఫీల్ అవుతున్నా. అలాద్దీన్‌లా మూడు కోరికలు వస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అన్నారు. -
రానా కథ చెబితే...
ఓ సినిమాలో బ్యాగ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ఎలా అవుతుంది? అంటే కొన్ని చిత్రాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటున్నారు ‘సుబ్రహ్మణ్యపురం’ టీమ్. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్, సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రానికి రవితేజ వాయిస్, ఇదే రవితేజ నాని ‘ఆ’ చిత్రానికి ఇచ్చిన వాయిస్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో రానా చేరారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రకథను నడిపించటానికి తన వాయిస్‌తో నడుం కట్టారు రానా. సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంతోశ్ జాగర్లమూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతోంది. ‘‘భగవంతుడు ఉన్నాడా? లేదా? అనేది మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం లేని మనిషి భగవంతునిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణ అని, యస్పీబీ పాడిన థీమ్ సాంగ్ ఓ హైలైట్ అని, రానా వాయిస్ ఓ ఎస్సెట్ అని కూడా చెప్పారు. -
మాట సాయం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ మోహన్ లాల్ ‘ఒడియన్’ సినిమాకు మాట సాయం చేయనున్నారని టాక్. మోహన్‌లాల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘ఒడియన్’. కేరళలోని పూర్వకాలంలో నివసించిన ఒడియన్ల తెగకు సంబంధించిన వ్యక్తి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో మోహన్‌లాల్ వివిధ గెటప్స్‌లో కనిపిస్తారు. దానికోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు కూడా. యంగ్ లుక్‌లో కనిపించడానికి సుమారు 18 కిలోలకు పైగా బరవు తగ్గారాయన. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింట్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. దాంతో ఆయా భాషల హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించి, క్రేజ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో ఈ చిత్రం పరిచయ డైలాగ్స్‌ను రజనీకాంత్ చెబుతారట. అలాగే తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ అందిస్తారని టాక్. ఆల్రెడీ ఎన్టీఆర్, మోహన్‌లాల్ కలసి ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే అడిగితే కాదనకుండా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెబుతారని ఊహించవచ్చు. -
అదుగో నటకిరీటి వాయిస్
వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకంపై స్వీయదర్శకత్వంలో రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకొని దీపావళి పండగ కానుకగా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ వాయిస్ ఓవర్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘బంటిగా పందిపిల్ల అందరి మనసులనూ దోచేస్తుంది. తెరపై నిజమైన పంది పిల్లనే చూస్తున్నామనే ఫీల్‌ని ప్రేక్షకులకు కలిగించడం కోసం లైవ్ యాక్షన్ త్రీడి యానిమేషన్ టెక్నాలజీని వాడాం. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆడియన్స్‌కి ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని కూడా తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంతి విహారి స్వరకర్త. -
ద్రౌపదిగా వినిపిస్తా!
మహాభారతంలో ద్రౌపది పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ పాత్రలో వినిపించడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి. వావ్.. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? పాండవులుగా నటించేదెవరు? కౌరవుల మెయిన్ టీమ్ కౌన్? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లోకి వస్తే వెంటనే ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే.. ఇది సినిమానో, టీవీ సీరియలో, వెబ్ సిరీసో కాదు. రేడియోలో ‘మహాభారతం’ వినబోతున్నాం. ఇందులో ద్రౌపది పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు శిల్పా శెట్టి. ‘‘నాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. చిన్నప్పుడు బీఆర్ చోప్రా మహాభారతం మాత్రమే టీవీలో చూసే చాన్స్ ఉండేది. అందులో ద్రౌపది పాత్ర చాలా బాగుంటుంది. ఈ పాత్రకు వాయిస్ అందిచ బోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శిల్పా. వెండితెరపై హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అలాగే బుల్లితెరపై కూడా సత్తా చాటారు శిల్పా. ఇప్పుడు రేడియో ప్లాట్ఫామ్లోకి ద్రౌపది పాత్రతో ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఆప్నే’ సినిమా తర్వాత శిల్పాశెట్టి మరో ఫుల్ లెంగ్త్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. -
వెంకటేశ్ వాయిస్‌తో...
వెంకటేశ్ సూపర్ హిట్ సినిమాల్లో కచ్చితంగా గుర్తుకు వచ్చేది ‘శ్రీనివాస కళ్యాణం’. 30 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో పెళ్లి గొప్పతనాన్ని, విశిష్టతని తెర మీద అందంగా చూపించడానికి రెడీ అయ్యారు ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న. ఇప్పుడు ఈ శ్రీనివాస కళ్యాణానికి ఆ ‘శ్రీనివాస కళ్యాణం’ హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమా వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ కానుందట. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా వెంకీ కంప్లీట్ చేశారు. ‘‘వెంకటేశ్‌గారి వాయిస్ ఓవర్‌తో మా సినిమా మొదలవుతుంది. మా సినిమా కోసం మీ వాయిస్ వినిపించినందుకు చాలా థ్యాంక్స్ సార్’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్రాజŒ , జయసుధ, నరేశ్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్. చిన్నోడికీ పెద్దోడికీ థ్యాంక్స్ ‘‘మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుంచి శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌తో వెంకటేశ్, మహేశ్‌కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అందులో వెంకటేశ్, మహేశ్ పెద్దోడు, చిన్నోడుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే మా బ్యానర్లో వెంకటేశ్ ‘ఎఫ్ 2’, మహేశ్ బాబు 25వ సినిమా రూపొందుతున్నాయి. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు వాయిస్ ఓవర్‌ను పెద్దోడు వెంకటేశ్, చిత్రం ట్రైలర్‌ను చిన్నోడు మహేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిన్నోడు, పెద్దోడికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
ప్రకాశ్ రాజ్ మాటే సాక్ష్యం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నటుడు ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కథాగమనానికి వాయిస్ ఓవర్ చాలా కీలకం. అందుకే ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాయిస్ ఓవర్ చెబితే బాగుంటుందని భావించిన శ్రీవాస్ స్వయంగా ప్రకాశ్‌రాజ్‌గారిని సంప్రదించగా ఆయన సమ్మతించారు. ఆయన మాట సినిమాలో చాలా కీలకపాత్ర పోషించనుంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వరన్, కెమెరా: ఆర్థర్ ఏ. విల్సన్. -
మాట సాయం!
మాట్లాడేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ఏమంటున్నారు బాస్..! ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కంగనాకు స్పీచ్‌లో ట్రైనింగా అంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఆమె కొత్త మాటలు నేర్చుకుంటున్నది సినిమా కోసం. ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు జరుగుతుంది. ఇందులో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రొఫెషనల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారట. మాట్లాడటం చేత కాక కాదు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే.. మంచి మాడ్యులేషన్‌తో మాట్లాడాలి కదా. రియల్ లైఫ్‌లో మాటలతో చెడుగుడు ఆడే కంగనా ఈ సినిమాలో భాష రాని వారికి మాట సాయం చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. -
అక్క కోసం మహేష్ మరో సాయం
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి డైరెక్టర్‌గా మారిన మంజుల ఘట్టమనేనికి టాలీవుడ్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ఆ వరుసలో ముందున్న సోదరుడు మహేష్ బాబు తన వంతుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై ‘అక్క.. సక్సెస్ కొట్టాలి’ అంటూ కోరుకున్నాడు. అయితే మహేష్ తన సాయాన్ని ఇక్కడితోనే సరిపెట్టలేదు. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ‘ఐ లవ్ యూ టూ.. ఇప్పుడే కాదు. ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాను. నన్ను ప్రేమ అనోచ్చు.. ప్రకృతి అని కూడా అనొచ్చు. నువ్వు నన్ను ఎలాగైనా పిలవొచ్చు. ఎందుకంటే నీ చుట్టూ ఎటు చూసినా నేనే. ఆఖరికి నువ్వు కూడా నేనే. నువ్వు-నేనూ వేరు కాదు. నువ్వు ప్రేమ, నేనూ ప్రేమే. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఫీలవ్వటమే. నిన్ను నిద్ర లేపే పక్షి గొంతులో నేనున్నాను. చెట్టు పూల రంగులో నేనున్నాను. నువ్వు పీల్చే గాలిలో నీ ఊపిరినై నేనున్నాను. నీ ప్రతీ శ్వాస నేనే. ఐ యామ్ ఫీల్ యువర్ లవ్’ అంటూ మహేష్ వాయిస్ ఓవర్ ను అందించాడు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనందీ ఆర్ట్స్, మంజుల సొంత బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాధన్ సంగీతం సమకూర్చాడు. ఫిబ్రవరి 16న మనసుకు నచ్చింది ప్రేక్షకుల ముందుకు రానుంది. #ManasukuNachindi #TrailerWithATwist @urstrulyMahesh https://t.co/seFdtwg60d — Manjula Ghattamaneni (@ManjulaOfficial) February 15, 2018 -
ఎన్టీఆర్, రాజమౌళి... ఓ సైబర్ క్రైమ్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో బ్లాక్ బస్టర్లను అందించిన విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత జక్కన్న కొత్త చిత్రం ఏది? అన్న ప్రశ్న మొదలైనప్పుడు ఎన్టీఆర్ తో కూడా అన్న పేరు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఓ సదుద్దేశం కోసం వీరిద్దరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రాను రాను పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు, వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగర క్రైమ్ బ్రాంచ్ సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించబోయే షార్ట్ ఫిల్మ్‌లలో ఈ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలిద్దరూ భాగస్వాములు కాబోతున్నారు. లఘు చిత్రాలకు ఎన్టీఆర్, రాజమౌళిలు స్వచ్ఛందంగా వాయిస్ ఓవర్ అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే తారక్ తన పని పూర్తి చేయగా, తన గొంతుకను అందించటంతోపాటు ఆయా చిత్రాల్లో చిన్న చిన్న మార్పులను సూచించేందుకు రాజమౌళి రెడీ అయిపోయాడు. వీటిని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, షాపింగ్ మాల్, టీవీలలో త్వరలో ప్రదర్శితం చేయనున్నారు. -
ఓన్లీ..ఇన్కమింగ్
►కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు కాల్స్ పంపలేవు ►సూత్రధారి మతీన్‌పై గతంలోనూ పలు కేసులు ►హార్డ్‌డిస్క్ పునరుద్ధరించాకే స్పష్టత: సీసీఎస్ డీసీపీ సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను బయటి దేశాలకు పంపలేవని (ఔట్ గోయింగ్) అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటికి లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి అందించగలవని (ఇన్కమింగ్) వివరిస్తున్నారు. కాల్ రూటింగ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన తండ్రీకొడుకులు అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీలను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లోని ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మతీనుద్దీన్పై అనేక కేసులు హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆఘాపురలో అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీలతో కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్ను ఏర్పాటు చేయించింది రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మతీనుద్దీన్ అలియాస్ మతీన్‌గా పోలీసులు నిర్థారించారు. ఇతను గతంలోనూ ఇలాంటి దందాలు చేసి పోలీసులకు చిక్కాడు. సీసీఎస్లోనూ మతీన్‌పై కాల్ రూటింగ్ ఆరోపణలతో కేసు నమోదై ఉంది. కొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అహ్మద్ సిద్ధిఖీ, ఫహద్ అహ్మద్ సిద్ధిఖీ ఇంటిపై దాడులు నిర్వహించేందుకు వెళ్లగా పోలీసులు ఇంట్లోకి రాకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు ఆపారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్థానిక పోలీసులు, బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు అప్రమత్తమైన నిందితులు తమ ల్యాప్‌టాప్‌తో పాటు ఓ కంప్యూటర్ను ధ్వంసం చేశారు. వీటి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరికి చేరాయి? అనే దానిపై స్పష్టత వస్తుందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిందితుల నుంచి 64 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో సహకరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ) సహకారం తీసుకుంటున్నామన్నారు. ఆ కారణంగానే ప్రాధాన్యం... పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. ఇందుకుగాను వారు వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల అధికారులకు కొన్ని రకాలైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ బ్యాక్ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్ ద్వారానే దీనికి పాల్పడ్డారు. అలాంటి రూటింగ్ కాల్స్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఆరా తీస్తున్న సమయంలోనే ఈ గ్యాంగ్ చిక్కింది. దీనికితోడు అహ్మద్ సిద్ధిఖీ రెండు పాస్పోర్ట్స్ కలిగి ఉండటం, ఒకదాన్ని వినియోగించి 2004లో పాకిస్థాన్‌కు వెళ్ళి రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిని లోతుగా విచారించడానికి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
చిరంజీవిగారా...అవన్నీ పుకార్లే: రాజమౌళి
బాహుబలి-2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఆ సినిమా మీద ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఆ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు వస్తున్న పుకార్లను ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి స్పందించారు. చిరంజీవి వాయిస్ ఇస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఈ మేరకు రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టం చేశారు. కాగా గత రెండురోజులుగా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు భారీగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆ రూమర్లకు ఫుల్‌స్టాఫ్ పడింది. బాహుబలి టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్ పనులు కూడా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక విడుదలకు ముందే బాహుబలి-2 దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ చేసినట్లు చిత్ర వర్గాల అంచనా. తొలి భాగం కంటే సెకండ్ పార్ట్ మరింత ఆసక్తి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంలో కూడా ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి-2 విడుదలైతే కానీ ఆ అనుమానానికి నివృత్తి దొరకదు మరి. Chiranjeevigaru giving voice over for Baahubali2 is false news.. — rajamouli ss (@ssrajamouli) 6 March 2017 -
నీకు పులి దొరికిందని చరణ్ అన్నాడు!
పెళ్లి తర్వాత నా లైఫ్‌లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు టైమ్‌కి ఇంటికి వెళ్తున్నాను. పెళ్లి విషయంలో నేను లక్కీ. నా బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నా. ‘నేను ఆర్టిస్ట్‌ని. నాకు డబ్బు సేవ్ చేయడం రాదు. రేపు పరిస్థితి తేడా వస్తే.. చేయి చాచి ఒకర్ని డబ్బులు అడగను. చిన్న అపార్ట్మెంట్, గుడిసెకు వెళ్లాలంటే రెడీనా?’ అని పెళ్లికి ముందు ప్రణతిని అడిగా. ‘నీతో ఎక్కడికైనా వస్తా’ అని చెప్పింది. ప్రణతి మూవీ లవర్. ఓ ఫ్రెండ్‌లా సలహాలు ఇస్తుంది. ‘‘చిన్నప్పట్నుంచీ డాడీ సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు చూస్తూ, పెరిగా. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అప్పుడు మేమంతా నాన్నగారి వెనకాలే ఉన్నాం.హిట్ వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఎన్ని కార్లున్నాయి? ఫ్లాప్ టైమ్‌లో ఎన్ని ఆగాయనేది తెలుసు. ఆ వాతావరణంలో పెరిగినోళ్లపై జయాపజయాల ప్రభావం ఏముంటుంది?’’ అన్నారు మంచు మనోజ్. ఆయన హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ మార్చి 3న విడుదలవుతోంది. మనోజ్ చెప్పిన ముచ్చట్లు... ► ‘గుంటూరోడు’ పక్కా హీరోయిజమ్ ఉన్న సినిమా. హీరోకి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేడు. కళ్ల ముందు అన్యాయం జరిగితే వాడి చేతికి దురద వస్తుంది. సింపుల్ కథకు మాంచి యాక్షన్ జోడించి సత్య అద్భుతంగా తీశాడు. వెంకట్ సూపర్ ఫైట్స్ కంపోజ్ చేశాడు. ► వాయిస్ ఓవర్ ఇవ్వమని ముందు రామ్ చరణ్‌ని అడిగా. తనప్పుడు వేరే ఊరిలో ఉన్నాడు. హైదరాబాద్ రావడానికి పది రోజులు పడుతుందన్నాడు. తర్వాతి రోజు చిరంజీవి అంకుల్ వాళ్లింటికి నాన్నగారు బ్రేక్ ఫాస్ట్‌కి వెళుతుంటే నేనూ వెళ్లాను. ‘అంకుల్.. నేనో మాస్ కమర్షియల్ సినిమా చేశా. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాల’ని అడగ్గానే ఓకే చెప్పారు. నెక్స్›్టడే కాల్ చేసి ‘మను... డబ్బింగ్ చెప్పేశా. ఓసారి చూసుకో. కరెక్షన్స్ ఉంటే మళ్లీ చెబుతా’ అన్నారు. ఆయన చెప్తే కరెక్షన్స్ ఏముంటాయి! ‘చిన్న బిడ్డ కోసం వచ్చావు. నీకు పులి దొరికింది’ అని రామ్‌చరణ్ అన్నాడు. ► సినిమా హిట్టూ ఫ్లాపులకు ఈరోజుల్లో కారణాలెన్నో ఉంటాయి. ఉదాహరణకు... పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు బ్లాక్ చేసి, మా థియేటర్లలో మా సినిమాలు వేసుకుంటామంటారు. బాగున్న చిన్న సినిమాకు ఇవ్వమన్నా ఇవ్వరు. పండగలు, మంచి సీజన్లు పెద్దోళ్లు తీసుకుని, ఎగ్జామ్స్ టైమ్‌ను చిన్న సినిమాలకు ఇస్తున్నారు. సరైన విడుదల తేదీ దొరక్క కొన్ని చిన్న సినిమాలు ఆడడం లేదు. ‘గుంటూరోడు’ను ఈ నెల 24న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, సరిపడా సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. సినిమా కూడా రెడీ కాలేదు. మార్చి 3న పోటీ ఉన్నప్పటికీ మేలో నా ‘ఒక్కడు మిగిలాడు’ విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే, మార్చి 3న రిలీజ్ చేస్తున్నాం. ► నటి భావన ఘటన తర్వాత ఆడవాళ్లకు జరుగుతోన్న అన్యాయాలపై ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నారులపై అఘాయిత్యాలు అనే వార్తలు చూస్తుంటే కత్తితో కోయాలనిపిస్తుంది. అమ్మాయిలంటే మా ఫ్యామిలీకెంతో ప్రేమ. అందుకే, దేవుడు మాకు ఎక్కువ ఆడపిల్లల్ని ఇచ్చాడనుకుంటున్నా. -
గుంటూరోడుకి చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాట సాయం చేశారు. రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాజీ’ చిత్రానికి చిరు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరోడు’ చిత్రానికి మెగాస్టార్ తన మాట ఇచ్చారు. ‘చిత్ర కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు చిరంజీవిగారు తనదైన మాస్ స్టయిల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు’ అని దర్శకుడు తెలిపారు. ‘చిరంజీవిగారు మా చిత్రానికి మాట సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని మనోజ్ అన్నారు. మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపైశ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ చిత్రం మార్చి 3న విడుదలవుతోంది. రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృధ్వీ, కాశీ విశ్వనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రభు తేజ. -
రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న ఈ మ్యాన్లీ స్టార్ నటిస్తున్న బహు భాషా చిత్రం ఘాజీ. భారత్ పాక్ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఓ సబ్ మెరైన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు జోడించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. అదే వాయిస్‌ను తెలుగు వర్షన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందించేందుకు అంగీకరించాడు. త్వరలోనే ఈ వాయిస్ ఓవర్లతో కూడిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఎన్టీఆర్ కి మరోసారి!
ఓ స్టార్ హీరో సినిమాకు, మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. అలా పవన్‌కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రాలకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. దర్శక-నిర్మాతలు, హీరోలతో ఉన్న అనుబంధం దృష్ట్యా మహేశ్ ఆ సినిమాలకు తన గొంతు వినిపించారు. ఇటీవలే తన తండ్రి కృష్ణ కథానాయకునిగా నటించిన ‘శ్రీశ్రీ’ చిత్రానికి కూడా మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే వార్త ఫిలింనగర్లో జోరుగా షికార్లు చేస్తోంది. మహేశ్ హీరోగా ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌తో కొరటాలకు మంచి అనుబంధం ఏర్పడింది. సో.. ‘జనతా గ్యారేజ్’కి నిజంగానే వాయిస్ ఓవర్ అవసరమైతే మహేశ్ కాదనరేమో! -
యాడ్ కోసం పవన్ వాయిస్ ఓవర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ యాడ్ ఫిల్మ్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. మానవ జాతిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ రూపొందుతున్న ఓ యాడ్‌కి వాయిస్ ఇచ్చేందుకు పవన్ అంగీకరించారని తెలుస్తోంది. త్వరలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవుతుందట. ప్రజల్లో మార్పు వస్తుందనే చిన్న ఆశతోనే పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందు జాగ్రత్త చర్యలు, కొన్ని చెడు అలవాట్లను మానుకోవడం వంటి అంశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యాడ్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారు. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మనవాడి వాయిస్‌కీ... ఇప్పుడు డిమాండ్!
రాజ్ తరుణ్ ఇవాళ వరుస సక్సెస్‌లతో క్రేజీ హీరో. పైగా, మనవాడి మాట తీరూ బాగుంటుంది. గోదావరి జిల్లా యాసతో గమ్మత్తుగా ఉంటుంది. అందుకేనేమో ‘అబ్బాయితో అమ్మాయి’కి రాజ్ తరుణ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ తరుణ్ టూకీగా కథాపరిచయం చేస్తారు. జనవరి 1న అది హాల్లోవినాలి. -
చరణ్‌కు మాటసాయం చేస్తున్న ఎన్టీఆర్
-
రుద్రమదేవికి హెల్ప్ చేస్తున్న మెగా హీరోలు
-
వాయిస్ ఓవర్
పూరి జగన్నాథ్ ఓ చిత్రంలో వినబడనున్నారు. కనపడకుండా.. వినపడటమేంటి? అనుకుంటున్నారా! మానవ సంబంధాలపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రానికి పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. తన గొంతు ద్వారా ఆ కథను నడిపించే బాధ్యతను పూరీ తీసుకున్నారు. ఇటీవలే ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం పూర్తయ్యిందనీ, మంచి చిత్రాలకు ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటాననీ నిరూపించిన పూరీగారికి కృతజ్ఞతలనీ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ‘మధురా’ శ్రీధర్ అన్నారు. మంజునాథ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అడవి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజ్, చైతన్య కృష్ణ, నిఖితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి ఈ చిత్రానికి మరో నిర్మాత. -
గొంతుకు యమ గిరాకీ
గౌతమ్ మీనన్ చిత్రంలో కమల్‌హాసన్ పని చేస్తున్నారట. ఇప్పుడు చెన్నైలో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశమ్’ చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న కమల్ మూడో సినిమా చేస్తున్నారేమిటా అని ఆశ్చర్యపోకండి. కమల్‌హాసన్ తన గంభీర స్వరాన్ని గౌతమ్ మీనన్ చిత్రానికి అందించనున్నారట. అజిత్ హీరోగా తాను దర్శకత్వం వహి స్తున్న చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలకు గంభీరమైన కంఠస్వరం ఉన్నవారితో వాయిస్ ఓవర్ చెప్పించాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట. కమల్ అయితే బాగుంటుందని ఆయన భావించారట. కమల్ దగ్గర గౌతమ్ ఈ విషయం చెప్పారని భోగట్టా. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ ‘వేట్టయాడు విళయాడు’ (తెలుగులో ‘రాఘవన్’) అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. సో... గౌతమ్ ప్రతిపాదనకు కమల్ పచ్చజెండా ఊపుతారని ఊహించవచ్చు. ఇది ఇలా ఉండగా, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ సహాయకుడైన విజయ్ విల్వక్రిష్ తొలిసారిగా రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘అవమ్’లో కమల్ ఓ రాక్ సాంగ్ పాడారట. వరుస చూస్తుంటే, తమిళనాట కమల్ గొంతుకు ఇప్పుడు బాగా గిరాకీ ఉన్నట్లుంది. -
గొంతును అరువిచ్చే.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. వారితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ గొంతుకు, ఆ వ్యక్తికి అభిమానులుగా మారుతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విసృ్తతమవుతుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అంతేస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వరసామర్థ్యం ఉన్నవారిని అధికంగా ఆకర్షిస్తున్న నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. స్వరమే అసలైన పెట్టుబడి టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులు మాట్లాడే మాటలు నిజానికి వారివి కావు. వారికి గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు. ఇక టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో మంచి డిమాండ్ ఉంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల ప్రధాన బాధ్యత... కాగితంపై రాసి ఉన్నదాన్ని కమ్మటి గొంతుతో వీనులవిందైన స్వరంగా మార్చి, ప్రేక్షకులను రంజింపజేయడమే. మైక్రోఫోన్ ముందు కూర్చొని, కొన్ని గంటలపాటు మాట్లాడితే.. ఆకర్షణీయమైన ఆదాయం అందుకోవచ్చు. దీంతోపాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం కళాకారులకు దక్కే బోనస్. ఈ రంగంలో ప్రవేశానికి స్వరమే అసలైన పెట్టుబడి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌గా మనదేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు మంచి అవకాశాలు లభిస్తుండడంతో ఇందులోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో పార్ట్‌టైమ్‌గా మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్‌గా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. వీలును బట్టి ఎలాగైనా పనిచేసుకొనే అవకాశం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే గొంతును కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి ఉండాలి. అర్హతలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులు లేవు. కానీ, ఫొనెటిక్స్పై కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. సాధారణంగా ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికైనట్లే. వేతనాలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు సంతృప్తికరమైన వేతనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. సాధారణంగా ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆర్జించొచ్చు. ప్రతిభకు సాన పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్టుకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌తో సమానంగా వేతనం లభిస్తుంది. వాయిస్, డిక్షన్‌తో రాణింపు ‘‘మీడియా రంగం విస్తరిస్తుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు క్రేజ్ పెరిగింది. ఇక్కడ రాణించాలంటే ప్రాక్టిస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో భాషపై పట్టు అంత అవసరం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగినా చాలు. నగర యువత కంటే గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు భాషపై పట్టుతో ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 7 ఎఫ్ఎం స్టేషన్లున్నాయి. సినిమా, టీవీ, నాటకం, డాక్యుమెంటరీ ఇలా ప్రతిచోటా పసందైన గొంతుకు స్థానం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాయిస్, డిక్షన్ రెండూ ముఖ్యమే. న్యూస్, ఆర్జే, డాక్యుమెంటరీ, డబ్బింగ్ చెప్పాలంటే.. ఒక్కోచోట గొంతును ఒక్కో విధంగా పలకాల్సి ఉంటుంది. కష్టపడేతత్వం, నిరంతర సాధనతో ఇవన్నీ సాధ్యమే. సృజనాత్మకత, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటే కెరీర్లో ఎదిగేందుకు వీలుంటుంది’’ -రాజేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జే -
వాయిస్ ఓవర్...
సంగీత దర్శకులు వాయిస్ ఓవర్ చెప్పడం అనేది చాలా అరుదైన విషయం. కీరవాణి తన కెరీర్లోనే తొలిసారిగా ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పారు. గుణ్ణం గంగరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ‘చందమామలో అమృతం’ సినిమాకు కీరవాణి ఇటీవలే వాయిస్ ఓవర్ చెప్పారు. అవసరాల శ్రీనివాస్, హర్షవర్థన్, శివన్నారాయణ తదితరులు ఇందులో నటించారు. బుల్లితెరపై ‘అమృతం’ సీరియల్ విశేషాదరణ పొందిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపు లాంటిది ఈ సినిమా. -
‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్
తెలుగు తెరపై వాయిస్ ఓవర్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఈ వాయిస్ ఓవర్ కల్చర్ కనిపిస్తోంది. అలీ హీరోగా నటించిన 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’కు ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజి నిర్మించిన ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా త్వరలో పాటలను విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపిస్తుందని దర్శకుడు చెప్పారు. -
‘వెంకటాద్రి...’కి వాయిస్ ఓవర్
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్... ఇప్పుడు ఓ కొత్త అవతారం ఎత్తారు. ఓ చిత్రం కోసం తన గాత్రాన్ని అరువిచ్చేశారాయన. అల్లరి నరేష్ ఏంటి? గాత్రదానం చేయడమేంటి? అనుకుంటున్నారా? గాత్రదానం అంటే వాయిస్ ఓవర్. ఇంతకీ ఈ ‘సుడి గాడు’ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఏ సినిమాకు అనుకుంటున్నారా? ఆ సినిమానే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మించారు. గాంధీ మేర్లపాక దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో హీరోహీరోయిన్లు, కీలక పాత్రధారులను పరిచయం చేయడం కోసం నరేష్ వాయిస్ఓవర్ అందించారు. అల్లరి నరేష్ వాయిస్ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమణ గోగుల, కెమెరా : చోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు.