
మనవాడి వాయిస్‌కీ... ఇప్పుడు డిమాండ్!
రాజ్ తరుణ్ ఇవాళ వరుస సక్సెస్‌లతో క్రేజీ హీరో. పైగా, మనవాడి మాట తీరూ బాగుంటుంది. గోదావరి జిల్లా యాసతో గమ్మత్తుగా ఉంటుంది. అందుకేనేమో ‘అబ్బాయితో అమ్మాయి’కి రాజ్ తరుణ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ తరుణ్ టూకీగా కథాపరిచయం చేస్తారు. జనవరి 1న అది హాల్లోవినాలి.