crazy hero
-
మనవాడి వాయిస్‌కీ... ఇప్పుడు డిమాండ్!
రాజ్ తరుణ్ ఇవాళ వరుస సక్సెస్‌లతో క్రేజీ హీరో. పైగా, మనవాడి మాట తీరూ బాగుంటుంది. గోదావరి జిల్లా యాసతో గమ్మత్తుగా ఉంటుంది. అందుకేనేమో ‘అబ్బాయితో అమ్మాయి’కి రాజ్ తరుణ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ తరుణ్ టూకీగా కథాపరిచయం చేస్తారు. జనవరి 1న అది హాల్లోవినాలి. -
కోహ్లి సంతకం చేసిన బ్యాట్ కావాలా ?
బెంగళూరు: ఫార్మాట్‌తో పనిలేకుండా పరుగుల వరద పారిస్తున్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి.. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల క్రేజీ హీరో అయిపోయాడు. దీనిని సొమ్ము చేసుకుంటూ collectabillia.com అనే వెబ్సైట్.. కోహ్లి స్వయంగా సంతకం చేసిన బ్యాట్, బంతిని అభిమానులకు అందించేందుకు వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి నుంచి మొదలయ్యే ఈ వేలం ఈ వారాంతం వరకు కొనసాగనుంది. మరి కోహ్లి చేవ్రాలుతో కూడిన బ్యాట్, బంతిని ఏ అభిమాని సొంతం చేసుకుంటాడో!