
‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్‌గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది.
నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా, మరో హీరోయిన్ రుక్సార్ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించిన భాస్కర్ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌ఎమ్ కీరవాణి.
Comments
Please login to add a commentAdd a comment