Na Sami Ranga
-
సాఫ్ట్వేర్ ఉద్యోగితో ప్రముఖ హీరోయిన్ సోదరి పెళ్లి.. ఫోటోలు వైరల్
నా సామిరంగా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆషికా రంగనాథ్ కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. తన అక్క అనూషా రంగనాథ్ (32) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అనూష కూడా కన్నడ చిత్ర సీమలో హీరోయిన్గా కొనసాగుతుంది. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.ఈ వేడుకకు కేవలం వారి కుటుంబ సభ్యుల మాత్రం హాజరైనట్లు సమాచారం. తాజాగా తన అక్క పెళ్లి పోటోలను హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. కానీ, తన అక్క అనూష రంగనాథ్ ఎవరిని పెళ్లి చేసుకుంది..? ప్రేమ పెళ్లి లేదా ప్రేమ వివాహం.. అనే సమాచారాన్ని ఆమె వెళ్లడించలేదు. అంతే కాకుండా తన సోదరి భర్త పేరు శ్రవణ్ అని మాత్రమే చెప్పారు కానీ ఏం చేస్తాడనే విషయాన్ని కూడా వారు తెలుపలేదు. కానీ అతను బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగి అని సమాచారం. అనూషా రంగనాథ్‌కు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఆమె అనేక సినిమాలు, సీరియల్స్‌లో నటించింది. ఈ వివాహ వేడుకలో రెండు పెళ్లిళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది మాత్రమే హజరయ్యారు. వారందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కల్యాణ్ రామ్ 'అమిగోస్' చిత్రం ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రంలో అవకాశం దక్కింది. ఈ సంక్రాంతికి విడుదల అయిన ఈ చిత్రంలో వరలక్ష్మీగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. 👉: ఆషికా రంగనాథ్ కుటుంబంలో వివాహ వేడుక (ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
Rukshar Dhillon: అదిరిపోయే స్టిల్స్ తో నా సామి రంగ...ఆ ఫోజులు చూశారంటే అంతే!(ఫోటోలు)
-
నాగార్జున రొమాంటిక్ హీరో.. ‘నా సామిరంగ’లో ఆ సీన్స్ ఉన్నాయి: ఆషికా రంగనాథ్
ఆషికా రంగనాథ్..ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇది. ‘అమిగోస్’చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ భామ.. తనదైన అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ‘నా సామిరంగ’చిత్రంలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆషికా రంగనాథ్ విలేకర్లతో ముచ్చటించారు. ఈ విశేషాలు.. దర్శకుడు విజయ్ బిన్నీ ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? చాలా సర్ ప్రైజ్ అయ్యాను. నాలాంటి న్యూ కమ్మర్ కి నాగార్జున గారు లాంటి బిగ్ స్టార్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇందులో వరాలు అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. రెండు వేరియేషన్స్ లో నా పాత్ర కనిపిస్తుంది. పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నాను. తప్పకుండా వరాలు పాత్ర అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. మీ పాత్రలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? వరాలు చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథానాయికల పాత్రలు కొంచెం సున్నితంగా ఉంటాయి. కానీ వరాలు పాత్ర మాత్రం రెబల్. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇలా ఉండాలనే భావన కలిగించే పాత్ర ఇది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్ అనిపించింది. నా సామిరంగ తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది. నాగార్జున గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? నాగార్జున గారితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. నాగార్జున గారు ఛార్మింగ్, అమెజింగ్ పెర్ఫార్మర్. అలాంటి పెద్ద స్టార్ తో పని చేయడం నిజంగా నా అదృష్టం. నాగార్జున గారు చాలా స్వీట్ పర్సన్. అంత పెద్ద స్టార్ ఉన్న ఈ చిత్రంలో వరాలు లాంటి అద్భుతమైన పాత్ర దక్కడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ఇందులో నాగార్జున గారి పాత్రకు, మీ పాత్రకు మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ? నాగార్జున గారు రొమాంటిక్ హీరో. ఈ చిత్రంలో కూడా కథకు అనుగుణంగా మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ పాత్రలకు కూడా ప్రత్యేకమైన రొమాంటిక్ స్టొరీస్ ఉన్నాయి. పాత్రలన్నీ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో నరేష్, రాజ్ తరుణ్ తో చాలా మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? కీరవాణి గారు స్వరపరిచిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా అనేక చిత్రాలు చూశాను. ఆయన పాటలు విన్నాను. ఆయన లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో భాగం కావడం చాలా అనందంగా ఉంది. నా సామిరంగలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు అన్ని వైపుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. డైరెక్టర్ విజయ్ బిన్నీ గురించి ? విజయ్ బిన్నీ గారు కొత్త దర్శకుడిలా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని తీర్చిదిద్దారు. ఆయన నిర్ణయాలని చాలా త్వరగా తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై చాలా క్లారిటీ ఉంటుంది. తెలుగు కల్చర్ ఎలా అనిపించింది ? భాష పరంగా ఎలా ప్రిపేర్ అయ్యారు ? తెలుగు, కన్నడ కల్చర్స్ సిమిలర్ గానే ఉంటాయి. తెలుగు భాష మాత్రం నాకు కొత్త. రైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాయిస్ నోట్స్ ని బాగా ప్రాక్టీస్ చేశాను. ఈ ప్రక్రియని చాలా ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని చాలామంది జూనియర్ అనుష్క పిలుస్తారు కదా.. ఎలా అనిపిస్తుంటుంది ? అనుష్క గారు అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతమైన చిత్రాలు, పాత్రలు చేశారు. ఆమెతో పోల్చడం ఆనందమే (నవ్వుతూ) మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ? గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. అలాగే పిరియాడిక్ ఫిల్మ్ చేయాలనే డ్రీమ్ ఉంది. ఏదో ఒక రోజు రాజమౌళి గారి సినిమాలో భాగం కావాలని బలంగా కోరుకుంటున్నాను(నవ్వుతూ) నిర్మాతల గురించి ? శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ వండర్ ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా సపోర్ట్ చేశారు. చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. సినిమా అంటే వారికి చాలా ప్యాషన్. ఈ చిత్రంతో వారికి పెద్ద విజయం వస్తుందనే నమ్మకం ఉంది. కొత్త సినిమాలు గురించి ? తమిళ్ లో హీరో సిద్ధార్ తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడలో ఓ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. -
సినిమా హిట్‌కి ఆస్కార్ ఉపయోగపడదు
‘‘నేను మొదటి నుంచి సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా వస్తుంది. అంతే కానీ నాకు వచ్చిన ‘ఆస్కార్’ అవార్డు అనేది ఓ సినిమా విజయానికి ఉపయోగపడదని భావిస్తాను. నా వరకూ సంగీతం బాగా అందించాలి. సినిమాని డైరెక్టర్ బాగా తీయాలి. అది జనాలకి నచ్చాలి. ‘నా సామిరంగ’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అన్నారు. నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► నాగార్జునగారు, నా కాంబినేషన్లో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, అన్నమయ్య, శ్రీరామదాసు..’ వంటి పలు హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వస్తున్న ‘నా సామిరంగ’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా. అందులో ఉన్నట్లుగానే ‘నా సామిరంగ’లోనూ వినోదాత్మక అంశాలు చాలా ఉన్నాయి. ఈ మూవీ మరో ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ అవుతుందని ఆశిస్తున్నాను. పైగా ‘నా సామిరంగ’ నాగార్జునగారికి యాప్ట్ టైటిల్. ► సీనియర్స్ కంటే కొత్త దర్శకుల్లో బాగా కష్టపడే తత్వం ఉంటుంది. ఎలాగైనా తమను తాము నిరూపించుకోవాలనే కసితో పని చేస్తారు. ఈ చిత్రదర్శకుడు విజయ్ బిన్నీ కూడా అంతే.. చాలా త్వరగా ఈ సినిమా తీయగలిగాడు. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రాఘవేంద్ర రావుగార్లలా క్వాలిటీ తగ్గకుండా త్వరగా సినిమా తీయడం తన ప్రధాన బలం అని భావిస్తున్నాను. బిన్నీ డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ప్రతి పాటని ఫుల్ డ్యాన్స్ కోణంలో ఆలోచించడం సహజం. కానీ, దానికి భిన్నంగా ఇందులో రెండు మూడు మెలోడీ పాటలు చేయించాడు. అప్పుడు తను పరిపక్వత ఉన్న దర్శకుడనిపించింది. తెలుగు నేటివిటీ, కట్టుబాట్లు, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ► ‘నా సామిరంగ’ చిత్రానికి పాటలన్నీ చంద్రబోస్గారే రాశారు. అయితే అన్నం తినేటప్పుడు కొంచెం పచ్చడి నంజుకుంటాం. అలా అని పచ్చడి తిన్నామని ప్రత్యేకంగా చెపుకోం.. అన్నం తిన్నామని మాత్రమే చెప్పుకుంటాం కదా (నవ్వుతూ). ఇదీ అంతే. నేనుప్రేషనల్ లిరిక్ రైటర్ని కాదు. ఎవరైనా వచ్చి రాయమని అడిగినా రాయను. కానీ రీ రికార్డింగ్ చేసినప్పుడు ఒక సందర్భం పుడుతుంది. అలాంటి సందర్భంలో నుంచి ఓ ఆలోచన వస్తుంది. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ఓ పాట రాశానంతే. ► ‘నా సామిరంగ’ చిత్రంలో ఇప్పటి తరానికి కావాల్సిన పాటలు ఇచ్చాను. నా వయసు ఎక్కువైనా నా వద్ద పని చేసే వారందరూ యువకులే.. వారి ఆలోచనలు నేటి యువతకు తగ్గట్టు ఉంటాయి. అలా ముందుకెళుతున్నాను (నవ్వుతూ). ఓ పాట వైరల్ కావడం, కాకపోవడం అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది.. వ్యూస్‌ని బట్టి తెలుస్తోంది. కానీ గతంలో పాట హిట్ అయ్యిందా? లేదా అని తెలుసుకోవాలంటే కష్టంగా ఉండేది. ఏదైనా పెళ్లికి వెళ్లి చూసేవాళ్లం. అక్కడ బ్యాండ్‌లో ఆ పాట ప్లే చేస్తుంటే హిట్టయినట్టు.. లేకుంటే కానట్టు అని తెలుసుకునే వాళ్లం (నవ్వుతూ). ►నేను సంగీతం అందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి మూడు పాటలు రికార్డ్ చేశాం. చిరంజీవిగారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ప్రారంభమయ్యాయి. రాజమౌళిగారితో చేయబోయే కొత్త సినిమా మ్యూజిక్ వర్క్ నా వరకూ ఇంకా రాలేదు. -
చైనా గోడ దూకినా తప్పు లేదు...
‘‘ఈ మనసుందే.. అది ప్రేమించే వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రేమించగానే ఆలోచించడం మానేస్తది. తనకోసం ఏమైనా చేసేయొచ్చు.. ఏమడిగినా ఇచ్చేయొచ్చు అనిపిస్తది. అలా ఇచ్చినప్పుడు తన మోహం మీద వచ్చే చిరునవ్వు, అది చూసి మన మనసులో కలిగే అనందం. అబ్బబ్బబ్బా... దాని కోసం పక్క ఊరి ప్రెసిడెంట్గాడి గోడ ఏంటి? పక్క దేశం చైనా గోడ దూకినా తప్పులేదు..’’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్‌తో ‘నా సామిరంగ’లోని భాస్కర్ లవ్‌స్టోరీ వీడియో విడుదలైంది. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా, మరో హీరోయిన్ రుక్సార్ కీలక పాత్రలో నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, కుమారి పాత్రలో రుక్సార్, వరలక్ష్మి పాత్రలో ఆషికా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించిన భాస్కర్ పాత్ర తాలూకు వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
లేదంటే మాటొచ్చేత్తది!
అంజిగా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇందులోని కీలకమైన అంజి పాత్రను ‘అల్లరి’ నరేశ్ చేస్తున్నారు. శుక్రవారం ‘అల్లరి’ నరేశ్ పాత్ర అంజిని గురించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘మా అల్లరి అంజిగాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చేత్తది’’ అంటూ ‘అంజి’ గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు నాగార్జున. ‘‘చేసేయ్.. చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది’’ అనే డైలాగ్ చెప్పారు ‘అల్లరి’ నరేశ్. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి. -
నిన్నిట్టా సూత్తుంటే..
‘నిన్నిట్టా సూత్తుంటే ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల.. ఎత్తుకెల్లిపోవాలనిపిస్తుందే..’ అంటూ హీరోయిన్ ఆషికా రంగనాథ్‌ని చూసి పాడేస్తున్నారు హీరో నాగార్జున. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ‘నా సామి రంగ’ చిత్రంలోని పాట ఇది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రామ్ మిరియాల పాడారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘నా సామి రంగ’. ఈ సినిమాలో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల..’ పాటలో నాగార్జున, ఆషిక కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. నాగార్జున హ్యాండ్సమ్ లుక్స్, ఆషిక ట్రెడిషనల్ గెటప్ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి విడుదల కానున్న మా సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
లవ్.. యాక్షన్.. రొమాన్స్
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు అనిల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లవ్.. యాక్షన్.. రొమాన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో బిజీగా ఉన్నారు నాగార్జున. -
టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!
సినిమా ఎంత బాగా తీసినా సరైన టైంలో రిలీజ్ చేయకపోతే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయిపోద్ది. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతలు వరకు పండగల్ని టార్గెట్ పెట్టుకుంటారు. మిగతా ఫెస్టివల్స్ సంగతి అలా పక్కనబెడితే సంక్రాంతి కోసం విపరీతంగా పోటీపడుతుంటారు. గతంలో మహా అయితే రెండో మూడో సినిమాలొచ్చేవి. ఈసారి మాత్రం అరడజనుకు పైగా లైన్లో ఉన్నాయి. కట్ చేస్తే గందరగోళమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ పండక్కి రాబోయే సినిమాలేంటి? వాటి లెక్కేంటి? (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) సంక్రాంతికి అనగానే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కావడం గ్యారంటీ. వచ్చే ఏడాది కూడా మహేశ్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోస్ తమ చిత్రాల్ని బరిలోకి దింపుతున్నారు. మొన్నటివరకు డేట్ చెప్పకుండా ఊరించారు గానీ ఇప్పుడు ఆయా తేదీల్ని కూడా ఫిక్స్ చేసేశారు. అలా అని వీళ్ల ముగ్గురే వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. విజయ్ దేవరకొండ, తేజ సజ్జాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫ్యామిలీ స్టార్ - జనవరి 11 (రూమర్ డేట్) గుంటూరు కారం - జనవరి 12 హనుమాన్ - జనవరి 12 నా సామిరంగ - జనవరి 12 (రూమర్ డేట్) ఈగల్ - జనవరి 13 అయాలన్ - జనవరి 14 (రూమర్ డేట్) (ఇదీ చదవండి: సిద్ధార్థ్ కొత్త సినిమా.. రెండేళ్లు కేవలం దానికోసమే!) ప్రస్తుతానికి పైన చెప్పిన సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అలానే 'సలార్' డిసెంబరు చివరి వారంలో రానుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వెంకటేశ్ 'సైంధవ్', నాని 'హాయ్ నాన్న' కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాయని తెలుస్తోంది. దర్శకనిర్మాతలు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ పైన చెప్పిన వాటిలో ఏయే సినిమాలు సైడ్ అవుతాయనేది ఇప్పుడే చెప్పలేం. మహేశ్ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉంది. నిర్మాతలు సంక్రాంతి అంటున్నారు కానీ చూడాలి. ఒకవేళ పైన చెప్పినవన్నీ సంక్రాంతికే వచ్చినా థియేటర్ల సమస్య పక్కా. కలెక్షన్స్పైనా ఘోరమైన ఎఫెక్ట్ పడుతుంది. బహుశా టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో చూసుకుంటే.. సంక్రాంతి రిలీజ్ విషయంలో ఇంత గందరగోళం ఉండటం ఇదే ఫస్ట్ టైమ్! మరి ఫైనల్‌గా రేసులో నిలిచి గెలిచేది ఎవరో చూడాలి? (ఇదీ చదవండి: ప్రభాస్ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!) This time! Sankranthi is going to be full vibrant 🤗#EAGLE 🦅 13th Jan 2024! Theatres lo Kaludham :)))) pic.twitter.com/okV5LOSrgG — Ravi Teja (@RaviTeja_offl) September 27, 2023 -
నా సామి రంగ.. యాక్షన్ స్టార్ట్
‘నా సామి రంగ’ మొదలైంది అంటున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా సామి రంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణతో మొదలైంది. స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ ఈ యాక్షన్‌ను డిజైన్ చేశారు. ‘‘నాగార్జునగారు ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం. కీరవాణి. -
ఈసారి పండక్కి..నా సామి రంగ
సంక్రాంతికి ‘నా సామి రంగ’ అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘నా సామి రంగ’ టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా ‘నా సామి రంగ’ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఈసారి పండక్కి నా సామి రంగ’ అంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాతో ‘పలాస’ ఫేమ్ దర్శకుడు కరుణకుమార్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘సంక్రాంతి సీజన్లో నాగార్జునగారికి చాలా హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వినోదాత్మకంగా సాగే ‘నా సామి రంగ’ సినిమాను సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ చేయనున్నాం. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, డైలాగ్స్ అందిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి. పవర్ఫుల్ రోల్: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూ΄÷ందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో నాగార్జున ఓ పవర్ఫుల్ రోల్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ
‘‘దర్శకుడు కావాలన్న నా 18 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరుతోంది. ఛాయాగ్రహణం, అగస్త్య సంగీతం ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్’’ అని దర్శకుడు సుబ్రహ్మణ్యం పచ్చా చెప్పారు. దిలీప్, సాయికుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని ముఖ్యతారలుగా సీహెచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, జె.కృష్ణారెడ్డి, జీపీరెడ్డి నిర్మిస్తున్న ‘నా సామిరంగ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆవిష్కరించిన అశోక్‌కుమార్ మాట్లాడుతూ -‘‘నా సామిరంగ’ అనే ఊతపదాన్ని టైటిల్‌గా పెట్టడం చాలా బావుంది’’ అన్నారు. ఇందులో పాటలన్నీ బావుంటాయని అగస్త్య తెలిపారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా చిర్రావూరి విజయ్‌కుమార్, కృష్ణచైతన్య, సాయి పంపన తదితరులు మాట్లాడారు.