సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ప్రముఖ హీరోయిన్‌ సోదరి పెళ్లి.. ఫోటోలు వైరల్‌ | Actor Ashika Ranganath Sister Anusha Ranganath Marriage With M Software Engineer, Wedding Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Anusha Ranganath Marriage Pics: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ప్రముఖ హీరోయిన్‌ సోదరి పెళ్లి.. ఫోటోలు వైరల్‌

Published Thu, Jan 25 2024 12:30 PM | Last Updated on Thu, Jan 25 2024 1:06 PM

Ashika Ranganath Sister Anusha Ranganath Get Married - Sakshi

నా సామిరంగా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన   ఆషికా రంగనాథ్‌ కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. తన అక్క అనూషా రంగనాథ్ (32) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అనూష కూడా కన్నడ చిత్ర సీమలో హీరోయిన్‌గా కొనసాగుతుంది. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.ఈ వేడుకకు కేవలం వారి కుటుంబ సభ్యుల మాత్రం హాజరైనట్లు సమాచారం. తాజాగా తన అక్క పెళ్లి పోటోలను హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

కానీ, తన అక్క అనూష రంగనాథ్ ఎవరిని పెళ్లి చేసుకుంది..? ప్రేమ పెళ్లి లేదా ప్రేమ వివాహం.. అనే సమాచారాన్ని ఆమె వెళ్లడించలేదు. అంతే కాకుండా తన సోదరి భర్త పేరు శ్రవణ్‌ అని మాత్రమే చెప్పారు కానీ ఏం చేస్తాడనే విషయాన్ని కూడా వారు తెలుపలేదు. కానీ అతను బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగి అని సమాచారం.  అనూషా రంగనాథ్‌కు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఆమె  అనేక సినిమాలు, సీరియల్స్‌లో నటించింది.

ఈ వివాహ వేడుకలో రెండు పెళ్లిళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది మాత్రమే హజరయ్యారు. వారందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

కల్యాణ్‌ రామ్‌ 'అమిగోస్‌' చిత్రం ద్వారా ఆషికా రంగనాథ్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రంలో అవకాశం దక్కింది. ఈ సంక్రాంతికి విడుదల అయిన ఈ చిత్రంలో వరలక్ష్మీగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. 

👉: ఆషికా రంగనాథ్‌ కుటుంబంలో వివాహ వేడుక (ఫోటోలు వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement