నాగార్జున రొమాంటిక్ హీరో.. ‘నా సామిరంగ’లో ఆ సీన్స్‌ ఉన్నాయి: ఆషికా రంగనాథ్‌ | Ashika Ranganath Talk About Naa Saami Ranga Movie | Sakshi
Sakshi News home page

Ashika Ranganath: నాగార్జున రొమాంటిక్ హీరో.. ‘నా సామిరంగ’లో ఆ సీన్స్‌ ఉన్నాయి

Published Tue, Jan 9 2024 4:35 PM | Last Updated on Tue, Jan 9 2024 4:55 PM

Ashika Ranganath Talk About Naa Saami Ranga Movie - Sakshi

ఆషికా రంగనాథ్‌..ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇది. ‘అమిగోస్‌’చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ భామ.. తనదైన అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ‘నా సామిరంగ’చిత్రంలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆషికా రంగనాథ్‌ విలేకర్లతో ముచ్చటించారు. ఈ విశేషాలు.. 

దర్శకుడు విజయ్‌ బిన్నీ ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
చాలా సర్ ప్రైజ్ అయ్యాను. నాలాంటి న్యూ కమ్మర్ కి నాగార్జున గారు లాంటి బిగ్ స్టార్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇందులో వరాలు అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. రెండు వేరియేషన్స్ లో నా పాత్ర కనిపిస్తుంది. పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నాను. తప్పకుండా వరాలు పాత్ర అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది.

మీ పాత్రలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
వరాలు చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథానాయికల పాత్రలు కొంచెం సున్నితంగా ఉంటాయి. కానీ వరాలు పాత్ర మాత్రం రెబల్. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇలా ఉండాలనే భావన కలిగించే పాత్ర ఇది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్‌ అనిపించింది. నా సామిరంగ తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.

నాగార్జున గారితో వర్క్  చేయడం ఎలా అనిపించింది ?
నాగార్జున గారితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. నాగార్జున గారు ఛార్మింగ్, అమెజింగ్ పెర్ఫార్మర్. అలాంటి పెద్ద స్టార్ తో పని చేయడం నిజంగా నా అదృష్టం. నాగార్జున గారు చాలా స్వీట్ పర్సన్. అంత పెద్ద స్టార్ ఉన్న ఈ చిత్రంలో వరాలు లాంటి అద్భుతమైన పాత్ర దక్కడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. 

ఇందులో నాగార్జున గారి పాత్రకు, మీ పాత్రకు మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ?
నాగార్జున గారు రొమాంటిక్ హీరో. ఈ చిత్రంలో కూడా కథకు అనుగుణంగా మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ పాత్రలకు కూడా ప్రత్యేకమైన రొమాంటిక్ స్టొరీస్ ఉన్నాయి. పాత్రలన్నీ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో నరేష్, రాజ్ తరుణ్ తో చాలా మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతాయి.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
కీరవాణి గారు స్వరపరిచిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా అనేక చిత్రాలు చూశాను. ఆయన పాటలు విన్నాను. ఆయన లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో భాగం కావడం చాలా అనందంగా ఉంది. నా సామిరంగలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు అన్ని వైపుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.

డైరెక్టర్ విజయ్ బిన్నీ గురించి ?
విజయ్ బిన్నీ గారు కొత్త దర్శకుడిలా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని తీర్చిదిద్దారు. ఆయన నిర్ణయాలని చాలా త్వరగా తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై చాలా క్లారిటీ ఉంటుంది.

తెలుగు కల్చర్ ఎలా అనిపించింది ? భాష పరంగా ఎలా ప్రిపేర్ అయ్యారు ?
తెలుగు, కన్నడ కల్చర్స్ సిమిలర్ గానే ఉంటాయి. తెలుగు భాష మాత్రం నాకు కొత్త. రైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాయిస్ నోట్స్ ని బాగా ప్రాక్టీస్ చేశాను. ఈ ప్రక్రియని చాలా ఎంజాయ్ చేశాను.

మిమ్మల్ని చాలామంది జూనియర్ అనుష్క పిలుస్తారు కదా.. ఎలా అనిపిస్తుంటుంది ?
అనుష్క గారు అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతమైన చిత్రాలు, పాత్రలు చేశారు. ఆమెతో పోల్చడం ఆనందమే (నవ్వుతూ)

మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. అలాగే పిరియాడిక్ ఫిల్మ్ చేయాలనే డ్రీమ్ ఉంది. ఏదో ఒక రోజు రాజమౌళి గారి సినిమాలో భాగం కావాలని బలంగా కోరుకుంటున్నాను(నవ్వుతూ)

నిర్మాతల గురించి ?
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ వండర్ ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా సపోర్ట్ చేశారు. చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. సినిమా అంటే వారికి చాలా ప్యాషన్. ఈ చిత్రంతో వారికి పెద్ద విజయం వస్తుందనే నమ్మకం ఉంది.

కొత్త సినిమాలు గురించి ?
తమిళ్ లో హీరో సిద్ధార్ తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడలో ఓ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement