‘నా సామి రంగ’ మొదలైంది అంటున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా సామి రంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణతో మొదలైంది.
స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ ఈ యాక్షన్‌ను డిజైన్ చేశారు. ‘‘నాగార్జునగారు ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.
కీరవాణి.
Comments
Please login to add a commentAdd a comment