shooting beginning
-
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'వశిష్ఠ'మూవీ
సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "వశిష్ఠ". ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. "వశిష్ఠ" మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. వశిష్ఠ పోస్టర్ చూస్తుంటే హనుమాన్ సినిమా గుర్తుకొస్తుంది. హనుమాన్ మూవీలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారందరిలో కాన్ఫిడెన్స్, సంతోషం కనిపిస్తోంది. వశిష్ఠ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా వశిష్ఠ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. సాయివెంకట్ , నాగబాల సురేష్ అతిథులుగా వచ్చి బ్లెస్ చేశారు. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా మిత్రుల సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. మా వశిష్ఠ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్‌లో మా హీరో సుమన్ తేజ్ ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్ గా దొరికింది. మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. -
'ముగ్గురు హీరోయిన్లతో సినిమా'.. ఘనంగా షూటింగ్ ప్రారంభం!
శ్యామ్ షెల్వన్, హాన్విక, రితిక, గ్రీష్మ, ఎస్తేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ". ఈ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.."కొత్త వాడినైనా మా నిర్మాత మల్లికార్జున్ రెడ్డి ఈ కథను నమ్మి ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది . ఈ చిత్రం యూత్, కుటుంబ సమేతంగా చూసే విధంగా తెరకెక్కించబో తున్నాం'.అని అన్నారు.నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నాం' అని తెలిపారు. ఈ సినిమాకు గాజుల శివ సినిమాటోగ్రఫీ, చరణ్ అర్జున్ సంగీతమందిస్తున్నారు. -
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్‌హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్‌హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
నా సామి రంగ.. యాక్షన్ స్టార్ట్
‘నా సామి రంగ’ మొదలైంది అంటున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా సామి రంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణతో మొదలైంది. స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ ఈ యాక్షన్‌ను డిజైన్ చేశారు. ‘‘నాగార్జునగారు ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం. కీరవాణి. -
రాజ్యంకోసం మహిళ పోరాటం
మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో రాకేష్ రెడ్డి యాస దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. సుధ క్రియేషన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవీ ప్రసాద్ బలివాడ క్లాప్ ఇచ్చారు. మోనికా రెడ్డి మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ మైథలాజికల్‌గా రూపొందనున్న చిత్రమిది. కథ అంతా నా పాత్ర చుట్టూ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజ్యం కోసం ఓ మహిళ ధైర్యసాహసాలతో ఎలా పోరాడింది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అన్నారు రాకేష్ రెడ్డి యాస. ‘‘నయనతార, అనుష్కగార్లలా మోనికకు మంచి పేరు రావాలి’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి. -
లండన్‌లో ఇండియన్ ఆఫీసర్
ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా లండన్‌లో చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ జాన్వీకపూర్. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో అన్నమాట. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ‘ఉలజ్’ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్వీకపూర్. ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్‌లో ప్రారంభమైంది. జాన్వీకపూర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందని టాక్. కాగా జాన్వీకపూర్ నటించిన మరో హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగుకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో బవాల్.. వరుణ్‌ధావన్, జాన్వీకపూర్ జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ లవ్‌స్టోరీ ‘బవాల్’. షాజిద్ నదియాద్వాలా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలైలో డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
NTR 30 నుంచి క్రేజీ అప్డేట్! అప్పుడే షూటింగ్ స్టార్ట్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించిన అనంతరం కొరటాల, ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్‌పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు వెల్లుత్తాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా మూవీ రిలీజ్ చేసింది చిత్రం బృందం. చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? అయితే ఈ మూవీ ఇప్పటి వరకు సెట్స్‌పైకి రాని విషయం తెలిసిందే. దీంతో ఇంకా షూటింగ్యే మొదలు పెట్టని సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకొనుందట. హైదరాబాద్‌లోనే తొలి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి షూటింగ్ జరుగనుందని సమాచారం. కాగా ఆచార్య మూవీ ప్లాప్‌తో కొరటాల ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారట. అందుకే ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కొరటాల గత చిత్రాల తరహాలోనే సామాజికాంశాలకు కమర్షియల్ హంగులను మేళవించి ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఎవర్నది ఖారారు కాలేదు. గతంలో జాన్వీ కపూర్, అలియా భట్ల పేర్లు వినిపించగా తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. -
చివరి పేజీ షురూ
నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ ‘18 పేజెస్’ చివరి పేజీ (షెడ్యూల్) ప్రారంభమైంది. ‘‘కార్తికేయ 2’ విడుదల, ప్రమోషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం కొంచెం విరామం తీసుకున్న తర్వాత నిఖిల్ తాజాగా ‘18 పేజెస్’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. డిసెంబర్ 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
ప్రారంభమైన ప్యాకప్ చిత్రం.. ముఖ్య అతిథిగా ఏయమ్ రత్నం
వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్యాకప్’. జీవీఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఏయమ్ రత్నం కోరారు. ‘‘ప్రేమలోని మరో కోణాన్ని ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాం’’ అన్నారు జీవీఎస్ ప్రణీల్. ‘‘ఏకధాటిగా షూటింగ్ ప్లాన్ చేశాం’’ అన్నారు శరత్‌రెడ్డి. ఒక మంచి కథతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని వాసం నరేశ్ తెలిపాడు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా శ్రీకృష్ణ గుళ్లపల్లి లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
శర్వానంద్, రష్మికా మండన్న కొత్త చిత్రం ప్రారంభం
-
ప్రయాణం మళ్లీ మొదలైంది
కన్నడ యాక్షన్ చిత్రం ‘కేజీయఫ్ – ఛాప్టర్ 1’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంత అలరించిందో తెలిసిందే. దాంతో ఈ సినిమా రెండో భాగంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలు అందుకునే రీతిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యష్ ముఖ్య పాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కేజీయఫ్’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ఈ సినిమా రెండో భాగం ‘ఛాప్టర్ 2’ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు యష్. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘అలల్ని ఆపలేం. కానీ వాటి మీద ఎదురీదడం నేర్చుకోవచ్చు. చిన్న విరామం తర్వాత రాకీ భాయ్ ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు’ అని ట్వీట్ చేశారు యష్. ఈ సినిమాలో రాకీ భాయ్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. -
ట్రయల్ షూట్!
రాజమౌళి ట్రయల్ షూట్ ప్లాన్ చేశారు. ప్రçపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’లాంటి సినిమా తెరకెక్కించిన రాజమౌళికి ట్రయల్ షూట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ ఏ సినిమా కోసం ఈ ట్రయల్ షూట్ అనుకుంటున్నారా? మరేం లేదు... కరోనా ఎక్కడికీ వెళ్లలేదు. మనతోపాటే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ పనులు చేసుకుంటున్నారు. కొన్ని నియమ నిబంధనలు సూచించి, షూటింగ్స్ చేసుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమవారికి అనుమతి ఇచ్చాయి. తక్కువమంది సభ్యులతో షూటింగ్ చేయాలి, భౌతిక దూరం పాటించాలి.. వంటివన్నీ గైడ్‌లైన్స్‌లో ఉన్నాయి. ఇవి పాటిస్తూ... షూటింగ్స్ ఎలా చేయాలి? అని ఓ నిర్ణయానికి రావడం కోసమే ఈ ట్రయల్ షూట్ అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ట్రయల్ షూట్ జరపనున్నారట. 50 మంది సభ్యులతో డూప్ ఆర్టిస్టులతో ఈ షూట్‌ని ప్లాన్ చేశారని భోగట్టా. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అజయదేవగన్, ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. -
నేను బాగానే ఉన్నాను: రజనీకాంత్
-
'వర్కవుట్ అయ్యింది' వెబ్ సిరీస్ ప్రారంభం
సినీ అభిమానులు ఇప్పుడు చిన్న తెరలకు అతుక్కుపోతున్నారు. ఆ సంఖ్య వేలల్లో కాదు, లక్షల్లో ఉంది. దీంతో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరగడంతో వాటి నిర్మాణాలు జోరందుకున్నాయి. తాజాగా ‘వర్కవుట్ అయ్యింది’ పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. మా ఆయి పతాకంపై బి.శివకుమార్ దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సిరీస్ షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరపనున్నారు. రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, శశిధర్, సూర్య, ఫన్ బకెట్ ఫణి, ఫన్ బకెట్ భార్గవి, ఇషాని, ఫణీంద్ర, మోడబుల్ గై, రాహుల్ కొసరాజు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ డాన్స్‌మాస్టర్ అనీ లామా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
అమ్మ తోడు యాక్షన్ మొదలైంది
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరా ముందుకొచ్చింది. ఇప్పటివరకూ చాలాసార్లు వచ్చింది కదా అనుకుంటున్నారా? నటిగా రావడం ఇదే ఫస్ట్ టైమ్. జాన్వీ కథానాయికగా నటిస్తోన్న మొదటి హిందీ చిత్రం ‘ధడక్’ షూటింగ్ శుక్రవారం మొదలైంది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘సైరాట్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ‘‘మార్చికల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. జాన్వీ, ఇషాన్ చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారిని ఎవరైనా డైరెక్ట్ చేయాలనుకుంటారు. ఒరిజినల్ సినిమాలోని సోల్ మిస్ కాకుండా నా స్టైల్లో సినిమా తీయాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు కేతన్. వచ్చే ఏడాది జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. ఆ సంగతలా ఉంచితే.. ముద్దుల కూతురి మొదటి సినిమా, మొదటి రోజు షూటింగ్‌ని కళ్లారా చూడాలనుకున్నారేమో.. శ్రీదేవి కూడా లొకేషన్‌కి వెళ్లారు. కూతురితో కలసి సెల్ఫీ దిగి, సందడి చేశారు. -
ఉగాది నుంచి... వైట్లతో... వరుణ్ తేజ్
డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్, క్యారెక్టర్, మంచి దర్శకుడు... ఈ మూడూ కరెక్ట్‌గా కుదిరితే వరుణ్ తేజ్ సినిమా ఒప్పేసుకుంటారు. ఇప్పటి వరకూ ఈ యువహీరో ‘ముకుంద’లో పక్కింటి అబ్బాయిగా, ‘కంచె’లో సైనికుడిగా, ‘లోఫర్’లో పక్కా మాస్ యువకునిగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్‌లోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించడానికి దర్శకుడు శ్రీను వైట్ల సన్నాహాలు చేస్తున్నారు. వినోద ప్రధానమైన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని తెరకెక్కిం చడంలో శ్రీను వైట్ల దిట్ట. ఇప్పుడాయన వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ కథ తయారు చేశారు. ఈ చిత్రాన్ని బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్టి ) నిర్మించ నున్నారు. ఏప్రిల్ 8న ఉగాది సందర్భంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.