NTR 30: Jr NTR and Koratala Siva movie to commence shooting in March - Sakshi
Sakshi News home page

NTR 30: NTR 30 నుంచి క్రేజీ అప్‌డేట్‌! అప్పుడే షూటింగ్‌ స్టార్ట్‌?

Published Sat, Feb 4 2023 11:39 AM | Last Updated on Sat, Feb 4 2023 12:07 PM

NTR 30: Jr NTR And Koratala Siva Movie Shooting Starts in March - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించిన అనంతరం కొరటాల, ఎన్టీఆర్‌ సైలెంట్‌గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్‌డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్‌పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు వెల్లుత్తాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్‌ సందర్భంగా మూవీ రిలీజ్‌ చేసింది చిత్రం బృందం.

చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

అయితే ఈ మూవీ ఇప్పటి వరకు సెట్స్‌పైకి రాని విషయం తెలిసిందే. దీంతో ఇంకా షూటింగ్‌యే మొదలు పెట్టని సినిమాకు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్‌ సంబంధించిన అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 20 నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకొనుందట. హైదరాబాద్‌లోనే తొలి షెడ్యూల్‌ స్టార్ట్‌ చేయనున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం.

చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్‌ వారసులు.. ఎందుకంటే

ఇక ఈ ఫస్ట్‌ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై కీలకమైన యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించి షూటింగ్‌ జరుగనుందని సమాచారం. కాగా ఆచార్య మూవీ ప్లాప్‌తో కొరటాల ఎన్టీఆర్‌ 30 స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారట. అందుకే ఈ మూవీ షూటింగ్‌ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కొరటాల గ‌త చిత్రాల త‌ర‌హాలోనే సామాజికాంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌వించి ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ ఎవర్నది ఖారారు కాలేదు. గతంలో​ జాన్వీ కపూర్‌, అలియా భట్‌ల పేర్లు వినిపించగా తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ పేరు వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement